Bhanumathi April 26th Episode : తాగిన మత్తులో నిజం చెప్పేసిన కానిస్టేబుల్.. షాక్‌లో శక్తి , శాంభవి చివరి ఎత్తు

భువనను చూసి షాకైన బాబూరావుని పార్ధు గమనించి వెంటనే భువనని దగ్గరికి పిలుస్తాడు. వాడు ఎక్కడ తన కూతురిని గుర్తుపట్టేస్తాడోనని శాంభవి వణికిపోతుంది. నా దగ్గర ఫోన్ తీసుకున్న అమ్మాయి భువన లాగే ఉందని, కానీ ఆమె కాదని అంటాడు బాబూరావు. దాంతో భువన, శాంభవిలు షాక్ అవుతారు. ఆ అమ్మాయిని మళ్లీ చూస్తే గుర్తుపట్టి మీకు చెబుతానని బాబూరావు వెళ్లిపోతాడు. భానుమతి గురించి తెలిసిపోయిందని భయపడుతున్న కోటి.. పార్ధుకి ఫోన్ చేసి ఏం జరిగిందని అడుగుతాడు. ఫోన్ నెంబర్ తెలిసింది కానీ ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో తెలియలేదని అంటాడు.

ఎక్కువ రోజులు నిజం దాయలేనని భానుమతి కోటితో చెప్పడంతో ప్రమీలను కత్తిపీట మీదకి విసిరేస్తాడు కోటి. పార్ధుకి నిజం చెప్పనని మాటిస్తే మీ అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెబుతాడు కోటి. నిజం తెలిసినా నీ గురించి చెప్పలేదని, ఇకపై ఈ నిజం బయటకు రాకూడదంటే నాకు డబ్బులు ఇవ్వాలని భువనని బ్లాక్‌మెయిల్ చేస్తాడు బాబూరావు. కానిస్టేబుల్‌ని కలిసిన కోటి.. భానుమతి విషయం ఎవరికీ చెప్పొద్దని అంటాడు. పెళ్లి కోసం భానుమతిని పెళ్లికూతురిని చేస్తుండగా భువన వచ్చి గొడవ చేస్తుంది. ఇదంతా గల ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 26వ తేదీ ఎపిసోడ్ 42లో ఏం జరిగిందంటే?

Bhanumathi Serial April 26th 2025 Episode 42 Here is Today s full story

కోటి ఇంటికి వెళ్లిన భువన గొడవ చేస్తుందని తెలుసుకున్న పార్ధు .. ఫోన్‌లో ఆమెపై మండిపడతాడు. ఏం నాశనం చేయడానికి అక్కడికి వెళ్లావని ప్రశ్నిస్తాడు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావని, వాళ్లతో గొడవ పడితే నేను కరిగిపోతున్నానని అనుకుంటున్నావా అని నిలదీస్తాడు పార్ధు. వారిని లొంగదీసుకుంటే నేను నీ మెడలో తాళి కడతానని అనుకుంటున్నావా? అది ఎట్టి పరిస్ధితుల్లోనూ జరగదని తేల్చిచెబుతాడు పార్ధు. నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావ్? నా కోపాన్ని రెచ్చగొడుతున్నావ్? వాళ్లకి క్షమాపణ చెప్పి బయల్దేరి రమ్మని మండిపడతాడు. దాంతో పార్ధు చెప్పినట్లుగానే కోటి కుటుంబానికి క్షమాపణలు చెప్పి వెళ్లిపోతుంది భువన.

ఆడదానికి ఆడదే శత్రువని, భానుమతి జీవితాన్ని నాశనం చేయాలని భువన అనుకుంటుందని మండిపడుతుంది కుమారి. నా మనసు చంపుకుని ఈ పెళ్లి చేసుకుంటున్నానని.. కానీ తనను ఇష్టపడే అమ్మాయి ప్రేమని చంపేసి జీపు అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటున్నాడని బాధపడుతుంది భానుమతి. భయం భయంగా ఇంటికొచ్చిన భువనని చూసి రగిలిపోతాడు పార్ధు. మనుషులు రెండు రకాలు ఉంటారు.. పరిస్ధితుల్ని అర్ధం చేసుకునేవాళ్లు కొందరైతే, పరిస్ధితులకు ఎదురెళ్లాలని అనుకునేవాళ్లని మండిపడతాడు.

పరిస్ధితుల్ని అర్ధం చేసుకునేవాళ్లు మన:శాంతితో బతుకుతారని, రెండో రకం వాళ్లు మనశ్శాంతితో పాటు ఒక్కోసారి జీవితాన్ని కూడా కోల్పోతారని మండిపడతాడు. ఇప్పుడు నువ్వు కూడా పరిస్ధితుల్ని ఎదురించాలని ప్రయత్నిస్తున్నావని, కానీ ఏం జరిగినా అది నీ వల్ల కాదని హెచ్చరిస్తాడు పార్ధు. ఇంతలో వీరి గొడవ విని శాంభవి పరిగెత్తుకుంటూ వస్తుంది. చిన్నపిల్ల కావడంతో మనసుని అంత త్వరగా అర్ధం చేసుకోలేకపోతుందని అంటుంది . మనసులో ఉన్న ప్రేమని చంపుకోలేకపోతుందని చెబుతుంది శాంభవి. తనకి అర్ధమయ్యేలా నువ్వయినా చెప్పొచ్చు కదా అని అంటాడు పార్ధు.

తల్లికి కూతురి కన్నీరే కనిపిస్తుందని, చుట్టూ ఉన్న పరిస్థితులు కాదని అంటుంది శాంభవి. నువ్వే తన జీవితాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నావని మండిపడతాడు పార్ధు. నువ్వు ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తున్నావంటే నువ్వు నా తండ్రిని ఢీకొడుతున్నట్లే, ఆయనతో తలపడటమంటే నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నట్లని అంటాడు . మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు పార్ధు. వీళ్ల గొడవని చూసిన శక్తి, చిత్రలు అక్కడికొచ్చి ఏం జరిగిందని అడుగుతారు.

నువ్వే కదా అక్కడికి వెళ్లమన్నావు, దాని వల్ల బావ అసహ్యించుకునే పరిస్ధితి వచ్చిందని శక్తితో చెబుతుంది భువన. ఎవరి స్వార్ధం వాళ్లు చూసుకుంటారు తప్పించి, నీ గురించి ఎవరు ఆలోచిస్తారని అంటుంది చిత్ర. ఈ పెళ్లి ఆపడానికి ఇంకెలాంటి దారి దొరుకుతుందని శక్తిని అడుగుతుంది శాంభవి. ఇప్పటి వరకు జరిగింది చాలు.. ఇంకా మనం ముందడుగు వేస్తే మూతి పళ్లు రాల్తాయని సలహా ఇస్తుంది శక్తి. పార్ధు - భానుమతిల పెళ్లి చాలా దూరం వెళ్లిపోయిందని ఇక ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిది కాదని అంటుంది. భానుమతి ఇంటికి వెళ్లి అల్లరి చేస్తే భువన తన విలువ కోల్పోతుందని తెలిసే పంపించావా అని తల్లిని ప్రశ్నిస్తుంది చిత్ర. అన్ని తెలిసే భువనని అక్కడికి పంపించానని అంటుంది వక్తి.

పార్ధు - భానుమతిల పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేస్తాడు బలరామ్. ఇంతలో కోటి తన కుటుంబంతో కలిసి వస్తాడు . శాంభవి, భువనలు ఎవరి గురించో ఎదురు చూస్తుంటారు. ఇంతలో బాబూరావు వస్తుంటాడు. వాడిని నేనే రమ్మన్నానని చెబుతుంది శాంభవి. వాడిని ఎందుకు రమ్మన్నావని తల్లిని ప్రశ్నించడంతో వాడితోనే బాంబు వేయిస్తానని అంటుంది. ఎందుకు నన్ను మళ్లీ పిలిపించారని బాబూరావు అడుగుతాడు. ఆ రోజు నా దగ్గరి నుంచి ఫోన్ తీసుకుని పోలీసులకు ఫోన్ చేసింది భానుమతేనని చెప్పాలని అంటుంది శాంభవి. ఆ మాటలతో నా వల్ల కాదంటాడు. దాంతో శాంభవి డబ్బు కట్టలు తీసుకురావడంతో బాబూరావు సరేనని అంటాడు.

పెళ్లి అయ్యే వరకు నిన్ను వదిలి వెళ్లనని భానుమతితో చెబుతుంది ప్రమీల. పార్ధు దగ్గరికి వెళ్లి మాట్లాడాలని పక్కకి తీసుకొస్తాడు బాబూరావు. ఇంతలో బలరామ్ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్లని చితక్కొడతాడు పార్ధు. దాంతో భయపడిన బాబూరావు .. శాంభవి దగ్గరికి వచ్చి డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడు. ఇంతలో కానిస్టేబుల్‌ పెళ్లికి వచ్చి కోటిని పార్టీ అడుగుతాడు . దాంతో బలరామ్ పెద్ద కొడుకు ధర్మ జోక్యం చేసుకుని మనిద్దరం పార్టీ చేసుకుందామని బయటికి తీసుకెళ్తాడు. తాగుతూ మాట్లాడుకుంటూ ఉండగా మీ వూరి ఎస్ఐ వల్లే మా తమ్ముడి పెళ్లి ఆగిపోయిందని అంటాడు ధర్మ. పెళ్లి ఆగిపోయింది మా ఎస్ఐ వల్ల కాదని .. ఆరోజు పెళ్లి ఆపమని ఫోన్ చేసింది భానుమతేనని చెప్డంతో ధర్మ షాక్ అవుతాడు. ఈ మాటలు విన్న శక్తి, కోటిలు ఉలిక్కిపడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Read more about: bhanumathi sai kiran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X