Bhanumathi April 30th Episode : శారదని బాధపెట్టిన పార్ధు.. భానుమతి అదృష్టం చూసి రగిలిపోతోన్న భువన
పార్ధు తనను తల్లిగా అంగీకరించడం లేదని కనీసం కొత్త కోడలైనా తనను అత్తగారిలా గౌరవించాలని దేవుడికి దండం పెట్టుకుంటుంది శారద. భానుమతి కోసం ఎదురుచూస్తున్న శక్తికి తన కొడుకు చరణ్ తాగినట్లుగా తెలియడంతో అతనికి క్లాస్ పీకుతుంది. నువ్వయినా కనీసం నా మాట వింటే ఈ ఆస్తికి వారసుడిగా ఉండొచ్చని చెబుతుంది. భానుమతి కొత్త కోడలిగా బలరామ్ ఇంటికి వస్తుంది. కుటుంబం మొత్తం ఆమెకు స్వాగతం చెబుతుంది. గుమ్మం దగ్గర బియ్యంతో నిండిన కలశాన్ని ఫుట్‌బాల్ తన్నినట్లుగా తంతుంది భానుమతి. దాంతో అంతా షాక్ అవుతారు.
గాలి వస్తున్నా ఒక్క అగ్గిపుల్లతో దీపాలన్ని వెలిగించాలని బలరామ్ తల్లి చెప్పడంతో భానుమతి కంగారు పడుతుంది. పార్ధు దీపానికి అడ్డుగా నిలబడటంతో దీపం వెలిగిస్తుంది. పార్ధు.. శారద ఆశీర్వాదం తీసుకోకపోవడంతో తను మాత్రం తీసుకుంటుంది. శారద కంటే శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై భానుమతికి ఆశ్చర్యం కలుగుతుంది. అనంతరం భార్యాభర్తలిద్దరూ బలరామ్ ఆశీర్వాదం తీసుకుంటారు. ఇదంతా గల ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 30వ తేదీ ఎపిసోడ్ 45లో ఏం జరిగిందంటే?

బలరామ్ ఆశీస్సులు తీసుకున్న తర్వాత మా అమ్మ ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి భానుమతిని వాళ్ల అమ్మ ఫోటో దగ్గరికి తీసుకెళ్తాడు పార్ధు. ఈవిడే నాకు అమ్మ.. నీకు అత్తగారు అని భార్యకు చెబుతాడు. ఆ మాటలతో శారద- బలరామ్‌లు బాధపడతారు. అత్తయ్య గారిని జీపు అబ్బాయి ఒక తల్లిగా చూడటం లేదని భానుమతికి అర్ధమవుతుంది. భానుమతి అత్తారింటికి వెళ్లిపోవడంతో ఒంటరిగా బాధపడుతుండటంతో ప్రమీల చూస్తుంది. అక్క లేకపోవడంతో బాధగా ఉందని వసు చెప్పడంతో , భానుమతి కోటలాంటి ఇంటికి కోడలిగా వెళ్లిందని అంటుంది కుమారి. ఇంతలో కోటి తాగుతూ ఇంటికి రావడంతో ప్రమీల మండిపడుతుంది.
శుభకార్యం జరిగిన రోజు కూడా ఈ తాగుడేంటీ అని నిలదీస్తుంది. కూతురికి పెళ్లి చేశాడని సంతోషంతో మందు కొడుతున్నాడని కొడుకుని కుమారి వెనకేసుకొస్తుంది. పెద్దింటోళ్లు 10 మెట్లు దిగొచ్చారు కాబట్టి ఈ పెళ్లి జరిగిందని, భానుమతి అదృష్టం బాగుంది కాబట్టి దాని బతుకు బాగుపడుతుందని అంటుంది ప్రమీల. భానుమతి అదృష్ట రేఖల్ని అలా కదిపితే చాలు లక్షలకు లక్షలు మనింట్లో వచ్చిపడతాయని అంటాడు కోటి. అనవసరమైన అత్యాశతో నీ కూతురి జీవితాన్ని నువ్వే పాడు చేసేలా ఉన్నావని మండిపడుతుంది ప్రమీల. లోక జ్ఞానం ఉన్నోడిని అల్లుడుగారిని ఎలా గుప్పిట్లో పెట్టుకోవాలో నాకు తెలుసని అంటాడు కోటి. రేపు సత్యనారాయణ వ్రతం రోజున నా చాణక్య చక్రం తిప్పుతానని చెబుతాడు.
ఇంతలో ఇరుగు పొరుగు వాళ్లు వచ్చి పెళ్లి బాగా జరిగింది, ఇక మీ కష్టాలన్నీ తీరిపోయినట్లేనని అంటారు. భానుమతి పెళ్లి జరిగితే మా కష్టాలెందుకు తీరతాయని ప్రశ్నిస్తుంది ప్రమీల. ధనవంతుల కుటుంబం.. సిగ్గు పడకుండా కాస్త చేయి చాస్తే ఏడాది తిరిగేసరికి మీరు కూడా సంపన్నులు అయిపోతారని అంటారు. మాకు అంత అత్యాశ లేదని, కూతురి పెళ్లి జరిగిందని మాకు అదె చాలని .. ఆమెను అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించాలనే ఉద్దేశం లేదని మండిపడుతుంది ప్రమీల.
ఉదయాన్నే బలరామ్ ఇంట్లో ఆడవాళ్లంతా పూలు గుచ్చుతుంటారు. కొత్త కోడలు అప్పుడే ఇంటి పనుల్లో పాలు పంచుకుంటోందని భానుమతిని ఉద్దేశించి జయంతి అంటుంది. కొంతమంది చూడటానికి అమాయకంగా ఉంటారని, కానీ టైం వచ్చినప్పుడు తెలుస్తుందని శక్తి అనడంతో అంతా షాక్ అవుతారు. అప్పుడే భానుమతి మీద జోకులు వేస్తున్నావని చిత్ర ప్రశ్నించడంతో అప్పుడప్పుడు చురకలు వేయకుంటే మన కంట్రోల్‌లో ఉండరని అంటుంది శక్తి. పార్ధుతో పెళ్లి జరగకపోవడంతో ఒంటరిగా బాధపడుతున్న భువనని చూస్తుంది శారద. అందని దానికోసం ఇంకా అందుకోవాలని ప్రయత్నించొద్దని ఆమెకు నచ్చచెబుతుంది .
పూల దండలు గుచ్చుతూ భానుమతిని చూసి రగిలిపోతుంది భువన. ఆమె పూలదండలు తప్పుగా గుచ్చడం చూసిన భానుమతి, నేను చూపిస్తానని అంటుంది. భువన కంటే భానుమతికి చాలా పనులు తెలుసని శక్తి అనడంతో భువన మండిపడుతుంది. బలరామ్, దుర్గలు మాట్లాడుకుంటూ ఉండగా డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు పార్ధు. నాకెందుకు లోపల పెట్టమని కొడుక్కి చెబుతాడు బలరామ్. లోపలికి వెళ్తూ భానుమతిని చూసి ఆమెను ఫోటో తీస్తాడు పార్ధు. దానిని భువన, శాంభవిలు చూసి రగిలిపోతారు.
రేపు వేదవతి పిన్నిని పిలుస్తున్నారా? అని శారదని అడుగుతుంది జయంతి. ఆమెను పిలవకుండా ఎలా ఉంటాను, మీ మావయ్య జైళ్లో ఉన్నప్పుడు వేదవతి అల్లాడిపోయిందని చెబుతుంది శారద. పోలీసులకు ఫోన్ చేసిందెవరో కనుక్కోవడానికి తన ప్రయత్నం గట్టిగానే చేసిందని అంటుంది. ఆ మాటలతో భానుమతి, భువన కంగారు పడుతుంటారు. అది ఎంతో దూరంలో లేదని, ఆ అమ్మాయి దొరకగానే తెచ్చి నీ కాళ్ల దగ్గర పడేస్తానని నాయనమ్మతో చెబుతాడు పార్ధు. ఆ మాటలు విన్న భానుమతి ఉలిక్కిపడటంతో సూది ఆమె చేతికి గుచ్చుకుంటుంది. దాంతో పార్ధు టెన్షన్ పడతాడు.
భానుమతితో తన పెళ్లి జరగడం ఒక కలగా ఉందని ఫీల్ అవుతుండగా సూరి వచ్చి తన బట్టలు తీసుకుని వెళ్లిపోతాడు. నన్న వదిలేసి వెళ్లిపోతావా? అని పార్ధు ప్రశ్నించగా.. ఇప్పుడు నీ పెళ్లాం వచ్చిన తర్వాత మాతో నీకు పనేముందని సెటైర్లు వేస్తాడు సూరి. పార్ధు మాటలతో భానుమతి నిద్రపోకుండా ఆలోచిస్తుండగా.. బలరామ్ తల్లి లేచి అడుగుతుంది. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు.. కానీ రేపు పూజ అయ్యే వరకు నీ భర్తతో నువ్వు కలిసుండటానికి వీలు లేదని అంటుంది. భానుమతికి నిద్రపట్టక మీ పెళ్లి ఎలా జరిగింది? తాతయ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అని అడుగుతుంది.
మా కాలంలో ప్రేమలు, దోమలు లాంటివేవీ లేవని చెబుతుంది. ప్రేమ లేకుండా పిల్లలు ఎలా పుడతారని భానుమతి అడగ్గా.. పిల్లలు పుట్టడానికి ప్రేమ ఉండాల్సిన అవసరం లేదని, ఇద్దరూ ఏకాంతంగా ఉంటే చాలని చెబుతుంది పెద్దావిడ. తాతగారిని చూపించి పెళ్లి చేసుకోమన్నారు , చేసుకున్నానని అంటుంది. మీ కాలంలో పుట్టకుండా నేను మంచి పని చేశానని అంటుంది భాను. అయినప్పటికీ ఆ పెద్దావిడని పడుకోనివ్వకుండా పదే పదే ప్రశ్నలు వేస్తుంటుంది భానుమతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











