Bhanumathi April 3rd Episode: బలరామ్ ఇంట్లో పెళ్లి సందడి.. పెళ్లి ఆపడానికి భానుమతి ఆఖరి ప్రయత్నం
పార్ధు సెలెక్ట్ చేసిన బట్టలు, నగలను తీసుకుని భానుమతి ఇంటికి బయల్దేరతారు చిత్ర, శక్తి. అయితే ఆ భానుమతికి అంతటి విలువైన నగలు ఇవ్వడం ఇష్టం లేని చిత్ర వాటిలో కొన్నింటిని కొట్టేస్తుంది. తమ ఇంటికి శక్తి, చిత్ర వచ్చేసరికి ప్రమీల, కోటి షాక్ అవుతారు. వాళ్లు తెచ్చిన బంగారు ఆభరణాలు, డబ్బును చూసి భానుమతి కుటుంబమంతా అవాక్కవుతుంది. తాను పేపర్ మీద రాసిచ్చినది చదవకుండా కేవలం పాంప్లేట్ మీదున్న బంగారు ఆభరణాలనే పార్ధు చూడటంతో భానుమతి బాధపడుతుంది.
తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని శక్తితో చెప్పాలని ఆమెను పక్కకి తీసుకెళ్తుంది. ఎక్కడ పెళ్లి ఆగిపోతుందోనని కోటి, కుమారి, ప్రమీలలు టెన్షన్ పడుతుంటారు. తనికి ఈ పెళ్లి ఇష్టం లేదని శక్తితో చెప్పబోతుండగా ప్రమీల అడ్డుపడుతుంది. తాను సెలెక్ట్ చేసిన నగలు, బట్టలు భానుమతికి నచ్చాయో లేదోనని టెన్షన్ పడుతున్న పార్ధుని సూరి ఆటపట్టిస్తాడు. వారి మాటలు విన్న భువన రగిలిపోతుంది. పార్ధు - భానుమతిల పెళ్లి ఆపడానికి నాకు ఒక్క ఛాన్స్ ఖచ్చితంగా వస్తుందని కూతురితో అంటుంది శాంభవి. ఈ మాటలు విన్న బలరామ్ రగిలిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 3వ తేదీ ఎపిసోడ్ 22లో ఏం జరిగిందంటే?

తనకు భానుమతిని చూసేయ్యాలని ఉందని రాత్రిపూట బయల్దేరతాడు పార్ధు. ఇంతలో శారద పిలవడంతో పార్థు రగిలిపోతాడు. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ముఖం మాడ్చుకుని ఎదురవ్వకూడదని కొంతమందికి తెలియదని నానామాటలు అంటాడు పార్ధు. పెళ్లయ్యే వరకు అమ్మాయి - అబ్బాయి కలుసుకోకూడదని చెబుతుంది శారద. ఇక్కడ ఉచిత సలహాలు వినడానికి ఎవ్వరూ సిద్దంగా లేరని అంటాడు పార్ధు. నేను చెప్పేది నీకు కష్టంగా ఉంటుందని కానీ పెళ్లయ్యే వరకు ఈ రాకపోకలు ఉండొద్దని అంటుంది శారద. అయినప్పటికీ పట్టించుకోకుండా పార్ధు వెళ్తుండగా బలరామ్ ఆపి మీ అమ్మ చెప్పినట్లు నువ్వు బయటికి వెళ్లొద్దని అంటాడు. దీంతో పార్ధు లోపలికి వెళ్లిపోతాడు .
పార్ధు మాటలు పట్టించుకోవద్దని వాడి గురించి నీకు తెలిసిందే కదా అని శారదను ఓదారుస్తాడు బలరామ్. పట్టించుకోకూడదనే అనుకుంటానని.. కానీ ఒక్కోసారి పార్ధు మాటలు గుండె మీద కత్తితో పొడిచినట్లుగా ఉంటుందని చెబుతుంది శారద. వాడు మారి నిన్ను అర్ధం చేసుకునే వరకు ఎదురుచూడక తప్పదని చెబుతాడు బలరామ్. పాంప్లేట్ వెనుకరాసిన విషయాన్ని పట్టించుకోకుండా ముందున్న బంగారం గురించి జీపబ్బాయి అర్ధం చేసుకున్నాడని బాధపడుతుంది భానుమతి.
మన ప్రయత్నం వల్ల ఈ పెళ్లి ఆగకపోగా.. ఇంకా ముందుకు వెళ్తోందని అంటుంది వసు. ఈ పరిస్ధితి నుంచి .. ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో అర్ధం కావడం లేదని చెబుతుంది భానుమతి. ఇంతలో వీరిద్దరినీ వెతుక్కుంటూ కుమారి రావడాన్ని వసు గమనించి భానుమతికి చెబుతుంది. ఈ ముసలిదాని కాళ్లు పడిపోయేలా చేస్తానని చెప్పి అరటి పండు తొక్కని వేస్తుంది. చూసుకోకుండా దాని మీద కాలు వేసిన కుమారి నడుం విరగ్గొట్టుకుని కుయ్యో, మొర్రో అంటుంది. ఆ అరుపులు విన్న కోటి, ప్రమీల పరుగు పరుగున వస్తారు. నువ్వు కనుక బకెట్ తన్నేస్తే భానుమతి పెళ్లి ఆగిపోతుందని కోటి ఆనడంతో కుమారి షాక్ అవుతుంది. పెళ్లి ఆపడానికి ఇంకో కొత్త ప్లాన్ చేయాలని వసుతో చెబుతుంది భానుమతి.
విశ్వనాథం ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి. అందరూ కలిసి పసుపు కొడతారు. ఈ సందడి చూసి బలరామ్ , పార్ధులు చాలా సంతోషిస్తుండగా శాంభవి, భువనలు రగిలిపోతుంటారు. పెళ్లి ఎలా ఆపాలో తెలియక భానుమతి, వసులు టెన్షన్ పడుతుంటారు. సినిమాల్లో ట్విస్టులు ఉంటాయని అనుకున్నానని.. కానీ ఇలా రియల్ స్టోరీలో ఇంత పెద్ద ట్విస్ట్‌లు ఉంటాయని అనుకోలేదని భానుమతితో అంటుంది వసు. పెళ్లి ఆగిపోతుందని సంబరపడ్డానని.. ఇక చదువుపై శ్రద్ధ పెట్టొచ్చని అనుకున్నానని చెబుతుంది భానుమతి.
ఆ పార్థు గారికి పెళ్లి ఇష్టం లేదని ఫోన్‌లో డైరెక్ట్‌గా చెప్పమని అంటుంది వసు. కానీ ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు కదా అని అంటుంది భాను. నాన్న ఫోన్‌లో ఆ ఇంట్లో వాళ్ల నెంబర్ ఉంటుందని దానికి ఫోన్ చేసి పార్ధు గారిని పిలవమంటే సరిపోతుందని అంటుంది వసు. లోపలికి వెళ్లి ఫోన్ కోసం వెతుకుతుండగా అది కుమారి పక్కనే ఉండటం చూస్తారు. ఇంతలో కోటి వచ్చి కుమారిని తాగడానికి 100 రూపాయలు అడుగుతాడు. ఇంట్లో ఇన్ని పెళ్లి పనులు పెట్టుకుని తాగుతావా అంటూ కొడుకుపై మండిపడుతుంది కుమారి.
ఫోన్ తీసుకుని విశ్వనాథం ఇంటికి చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన పిల్లలతో పార్ధుని పిలవమని అంటుంది. పార్ధు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుండగా కోటి రావడంతో ఫోన్ కట్టేస్తుంది భానుమతి. కోటి వెళ్లిపోయాక మళ్లీ విశ్వనాథం ఇంటికి ఫోన్ చేయగా శక్తి లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ చేసింది ఎవరో తెలియకుండానే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఆ విషయం మీకు చెప్పాలని పాంప్లేట్ మీద రాసి మీకు ఇచ్చానని అంటుంది. కానీ మీరు అది అర్ధం చేసుకోలేదని.. నాకు పెళ్లి చేసుకోవాలని లేదని, చదువుకోవాలని ఉందని చెబుతుంది భానుమతి. దయచేసి నన్ను అర్ధం చేసుకుని ఈ పెళ్లి ఆపేయండి అని అడుగుతుంది భానుమతి. ఇంతలో ఫోన్ వెతుక్కుంటూ కోటి లోపలికి వస్తాడు. భానుమతి మాటలు విన్న శక్తి షాక్ అవుతుంది.
భానుమతికి ఈ పెళ్లి ఇష్టం లేదా? వాళ్లింటికి వెళ్లినప్పుడు తను నాకు ఇదే చెప్పాలని అనుకుందా? పల్లెటూరి పిల్ల, అంతగా చదువుకోని పిల్ల పార్ధుకి భార్యగా వస్తే ఇద్దరినీ చెప్పుచేతల్లో పెట్టుకుని నా కళ్ల కింద చెప్పులా చూసుకుందామని అనుకున్నానని అనుకుంటుంది. కానీ భానుమతి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిందని షాక్ అవుతుంది శక్తి. మేకప్‌మెన్‌ని పిలిచి పార్ధుని హీరోలా మార్చేయమని చెబుతాడు సూరి. ఇంతలో పిల్లలు పార్ధుని చూసి సినిమా హీరోలా ఉన్నావని పొగుడుతారు. నేను ముందే చెప్పాను కదా.. ఇప్పుడు చూడు చుక్కల్లో చందమామలా ఎలా తళుక్కుమంటున్నావో అని ఆటపట్టిస్తాడు సూరి.
పార్ధు వదిన కూడా అతనికి దిష్టి తీసి దిష్టి చుక్క పెట్టమని అంటుంది. భానుమతి మామూలుగానే అందగత్తె అని, ఆమెకి మేకప్ వేస్తే అతిలోక సుందరిలా ఉంటుందని అంటాడు పార్ధు. ఈ మేకప్‌మెన్‌ని భానుమతి ఇంటికి పంపించి ఆమెకు కూడా మేకప్ వేయించమని చెబుతాడు. నువ్వు అడుగుతావని ముందే అనుకున్నానని , ఆడ్రెడీ ఒక మేకప్ అమ్మాయిని అక్కడికి పంపించానని చెబుతాడు సూరి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











