Bhanumathi April 5th Episode: పెళ్లి ఆపడానికి భానుమతి సాహసం .. పోలీసులపైనే భారం , పార్థు ఆశలు ఆవిరేనా?

పార్ధు పంపించిన మేకప్ అమ్మాయితో తనకు మేకప్ వేయించుకుంటుంది కుమారి. భానుమతిని పిలిచి మేకప్ వేయించుకోమని చెప్పగా నాకొద్దని ఆమెను పంపించేస్తుంది. భానుమతి తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పడంతో కోటిని పిలిచి వార్నింగ్ ఇస్తుంది శక్తి. ఇంతలో భానుమతికి మేకప్ వేసిన తర్వాత ఒక ఫోటో కావాలని మేకప్ అబ్బాయికి పార్ధు చెప్పడంతో అతను మేకప్ అమ్మాయికి ఫోన్ చేస్తాడు. భానుమతికి పెళ్లి ఇష్టం లేన్నట్లుగా ఉందని మేకప్ అమ్మాయి చెప్పడంతో పార్ధు ఆ మాటలు విని షాక్ అవుతాడు.

పెట్రోల్ డబ్బాతో ఇంటికొచ్చిన కోటి ఒంటిపై పోసుకుని కట్టె తీసుకుని నిప్పంటించుకుంటానని భానుమతిని బెదిరిస్తాడు. ఇంతలో పార్ధు .. భానుమతికి ఫోన్ చేసి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అడుగుతాడు. తండ్రి కోసం ఈ పెళ్లి తనకు ఇష్టమేనని అంటుంది భానుమతి. ఆ మాటలతో పార్ధు చాలా సంతోషిస్తాడు. పార్ధు, భానుమతిలను పెళ్లి కుమార్తె, పెళ్లి కూతురిగా చేస్తారు ముత్తయిదువులు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 5వ తేదీ ఎపిసోడ్ 24లో ఏం జరిగిందంటే?

Bhanumathi Serial April 5th 2025 Episode 24 Here is Today s full story

పార్ధుకి పన్నీటి స్నానం చేయిస్తుండగా దూరంగా ఉన్న శాంభవి, భువనలను పిలిచి స్నానం చేయించమంటాడు బలరామ్. దాంతో గత్యంతరం లేక తను కూడా స్నానం చేయిస్తుంది శాంభవి. భానుమతిని పెళ్లి కూతురిని చేసి అందంగా అలంకరిస్తుంది ప్రమీల. నీకు గొప్ప జీవితం రావాలని ఎన్నో కలలు కన్నానని.. ఇప్పుడు ఆ జీవితం రాబోతోందని అంటుంది. పెద్దింటికి కోడలిగా వెళ్లబోతున్నావని, ఆ పెద్దింటి బాధ్యత ఇప్పుడు నీ భుజాన వేసుకోబోతున్నావని చెబుతుంది ప్రమీల. అక్కడ సుఖ సంతోషాలు నువ్వు ఎంతగా అనుభవిస్తావో , బాధ్యతలు కూడా నువ్వు అంతే ధ్యాసపెట్టి నిర్వహించాలని చెబుతుంది.

పార్ధుని కూడా పెళ్లికొడుకుని చేస్తారు బలరామ్ కుటుంబం. అద్దంలో తన అందం చూసుకుని మురిసిపోతాడు పార్ధు. ఇన్నిరోజులు పార్ధుకి ఎలాంటి అమ్మాయి భార్యగా వస్తుందా అని అందరూ అనుకున్నారని అంటుంది శక్తి. పార్ధుకి తను ఇష్టపడిన అమ్మాయే తన జీవితంలోకి వస్తుందని చెబుతుంది. రేపే కదా పెళ్లి ఈ పెళ్లితో నీ చదువు సంగతి మరిచిపోయి, కొత్త జీవితం మొదలుపెడతావా అని భానుమతిని అడుగుతుంది వసు. చదువును వదిలేయడానికి నాకు మనసు రావడం లేదని, వీళ్లంతా చెప్పే ఆ గొప్ప జీవితం అందుకోవాలనే ఆశ కూడా కలగడం లేదని.. ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లి ఆపేయాలని అంటుంది భానుమతి.

పెళ్లికొడుకుని చేసిన తర్వాత బలరామ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు పార్ధు. శారద అక్షింతలు వేయబోతుండగా ఆమెను కోపంగా చూస్తాడు. ఇది చూసి అంతా బాధపడతారు. ఆ తర్వాత దుర్గ, శక్తిల ఆశీర్వాదం తీసుకుంటాడు పార్ధు. అతని తీరుతో శారద చాలా బాధపడుతుంది. అక్కడ కుమారి ఒంటి నిండా నగలు పెట్టుకుని, పట్టు చీర కట్టుకుని ఊయల ఊగుతూ పాటలు పాడుతుంది. ఊళ్లో వాళ్లంతా నా అదృష్టాన్ని చూసి అసూయ పడుతున్నారా అని అడుగుతుంది కుమారి. పడకుండా ఎలా ఉంటారు, మనవరాలికి గొప్పింటి సంబంధం కుదరడంతో ఊళ్లో మీ పరపతి పెరిగిందని అంటారు కుమారి ఫ్రెండ్స్.

ఈ పెళ్లి అవ్వగానే ప్యాలెస్ లాంటి ఇంటికి ఓనర్‌ని అయిపోతానని చెబుతుంది కుమారి . ఇంతలో కోటి వచ్చి మనది ఇక నుంచి రాజయోగం అంటాడు. నువ్వే రాజమాతవి అని చెప్పడంతో కుమారి మురిసిపోతుంది. ఒంటరిగా బాధపడుతున్న భానుమతి దగ్గరికి వసు వచ్చి ఈ ఇంట్లో మనిద్దరం తప్ప అందరూ సంతోషంగా ఉన్నారని అంటుంది. ఎదుటివాళ్లు కష్టంలో ఉంటే వాళ్లని అర్ధం చేసుకోలేని లోకంలో ఉన్నామని ఇక్కడ మనకి నచ్చినట్లుగా బతకడం కుదరదని అంటుంది భానుమతి.

ఈ ఇంట్లో మన చిన్నప్పటి నుంచి మనకి ఇష్టమైన పని ఏది జరగలేదని .. అయినా ప్రతి పరిస్ధితిని ఎదిరిస్తూ, ప్రతి రోజూ కొత్త యుద్ధం గెలుస్తూ వచ్చానని అంటుంది భానుమతి. తొలిసారిగా ఈ యుద్ధాన్ని నేను గెలవలేకపోతున్నానని బాధపడుతుంది. రేపు నా నీట్ ఎగ్జామ్ అని , ఎలాగైనా పరీక్ష రాయాలని డాక్టర్‌ని కావాలని అంటుంది భానుమతి. నీ లక్ష్యాన్ని అర్ధం చేసుకునేవాళ్లు ఈ ఇంట్లో లేరని వసు అంటుండగా ప్రమీల వచ్చి తెల్లారితే పెళ్లి అని త్వరగా భోజనం చేసి పడుకోమని అంటుంది .

తల్లిని పిలిచి దేవుడా నాకు ఇలాంటి జీవితం ఎందుకిచ్చావ్ అని నువ్వు ఏనాడైనా అనుకున్నావా అని అడుగుతుంది భానుమతి. అలా అనుకోని రోజంటూ లేదని.. అలాంటి జీవితం మీకు రాకూడదనే నా బాధ అంటుంది ప్రమీల. కావాల్సింది ఇచ్చే భర్త దొరకడం, ఏ లోటు లేకుండా చూసుకునే కుటుంబం దొరకడమే గొప్ప జీవితమని కూతురికి చెబుతుంది. నీ కలలు కరిగిపోవాలని, రేపు నీ మెడలో పడే తాళితో నీకంటూ కొత్త జీవితం మొదలు కాబోతోందని అంటుంది. పుస్తకాలు తడుముతూ బాధపడుతుంది భానుమతి.

నా కోసం మా నాన్న 100 మెట్లు దిగొచ్చారని అలాంటి తండ్రి దొరకడం నా అదృష్టమని అంటాడు పార్ధు. ఈ మాటలను బలరామ్ వింటుండగా శారద వచ్చి పార్ధుకి ఇష్టమైన జీవితాన్ని ఇస్తున్నారని చెబుతుంది. దీనికి పరోక్ష కారణం నువ్వేనని అంటాడు బలరామ్. ఇంతలో దుర్గ వచ్చి చదువు, ఉద్యోగం లేదని పార్ధుని ఎంతో మంది అమ్మాయిలు పక్కనపెట్టేశారని కానీ వాడిని అర్ధం చేసుకున్న అమ్మాయి భార్యగా వస్తోందని అంటాడు. ఈ మాటలు విన్న శక్తి.. ఇంకెంత కాలం అన్న ముందు తల వంచుతారంటూ మనసులో అనుకుంటుంది.

ఈ పెళ్లి ఆపడానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉందని భానుమతితో చెబుతుంది వసు. మైనర్లకి పెళ్లి చేస్తే నేరం కాబట్టి పోలీసులకు ఫోన్ చేయమని అంటుంది . ఆ వెంటనే ఫోన్ తీసుకుని పోలీసులకు ఫోన్ చేసి తన పేరు భానుమతి అని , ఇంటర్మీడియట్ చదువుతున్నానని, నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని చెబుతుంది. నా జీవితాన్ని కాపాడమంటూ పోలీసులకు జరిగినదంతా చెబుతుంది. ఉదయాన్నే పోలీసులు ఎప్పుడు వస్తారోనని ఎదురుచూస్తుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Read more about: bhanumathi sai kiran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X