Bhanumathi April 8th Episode: బలరామ్ అరెస్ట్ .. ఆగిపోయిన పెళ్లి, తండ్రి కోసం పార్ధు పరుగులు

పెళ్లికి వెళ్తూ హుందాగా తయారవమని కొడుకుతో చెబుతుంది కుమారి. దీంతో కోటి లోపలికి వెళ్లి పట్టుబట్టలు కట్టుకుని బయటి వస్తాడు. ఒంటరిగా బాధపడుతున్న భానుమతికి మరోసారి నచ్చచెప్పి రెడీ అవ్వమని చెబుతుంది ప్రమీల. చీర కట్టుకుని నగలు పెట్టుకుని వచ్చిన భానుమతిని చూడగానే కోటి, ప్రమీల, కుమారిలు ఎంతో సంతోషిస్తారు. పార్ధు పెళ్లి జరిగిపోతుండటంతో భువన కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది.

పెళ్లి జరిగే వేదిక వద్దకు తన కుటుంబంతో సహా వస్తాడు కోటి. దీంతో బలరామ్ కుటుంబ సభ్యులు వారికి స్వాగతం చెబుతారు. భానుమతిని చూసిన పార్ధు ఎంతో మురిసిపోతాడు. ఈలోపు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిని పంతులు గారు పిలవడంతో భానుమతి షాక్ అవుతుంది. ఆ వెంటనే పీటల మీద పార్ధు పక్కన కూర్చొని బాధపడుతుంది. పార్ధు తాళి కడుతుండగా పోలీసులు వచ్చి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని చెబుతారు. చట్ట ప్రకారం ఈ అమ్మాయి మేజర్ కాలేదని అయినా పెళ్లి చేస్తే అది నేరమని అంటాడు ఎస్ఐ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 8వ తేదీ ఎపిసోడ్ 26లో ఏం జరిగిందంటే?

Bhanumathi Serial April 8th 2025 Episode 26 Here is Today s full story

భానుమతి మెడలో పార్ధు మూడు ముళ్లు వేస్తుండగా పోలీసులు వచ్చి పెళ్లి ఆపమంటారు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. భానుమతి - వసు మాత్రం సంబరపడిపోతుంటారు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని అంటాడు ఎస్ఐ. చూడటానికి పెద్దమనిషిలా కనిపిస్తున్నారు? ఒంటిమీద ఖద్దరు బట్టలు వేసుకోగానే సరిపోదని పెద్దమనిషిలా వ్యవహరించాలని బలరామ్‌పై మండిపడతాడు ఎస్ఐ. నోరు జారేముందు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడండి అని పార్ధు రగిలిపోతాడు.

అభం శుభం తెలియని ఒక మైనర్ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్న మనిషితో మాట్లాడుతున్నానని ఎస్ఐ అంటాడు. కాలం మారింది కానీ, మీ మనస్తత్వాలు, మీ చాదస్తాలు మారలేదని మైనర్ అమ్మాయికి పెళ్లి చేయడం తప్పని మీకు తెలియదా అని ప్రశ్నిస్తాడు ఎస్ఐ. ఈ పీటల మీద కూర్చొన్న అమ్మాయి వయసు 18 ఏళ్లు నిండలేదని , ఇంకా మేజర్ కాలేదని చెబుతాడు. దాంతో కోటిని పిలిచి అది నిజమేనా అని అడుగుతాడు బలరామ్. ఆయన చెబుతున్నది నిజమేనని, ఇంకొద్దిరోజుల్లో భానుమతికి 18 ఏళ్లు వస్తాయని చెబుతాడు కోటి. ఆ మాటలతో బాధపడ్డ బలరామ్.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమని, ఇది మా కుటుంబ పరువు మర్యాదలకు సంబంధించిన విషయమని ఎస్ఐతో చెబుతాడు బలరామ్.

చేసేది తప్పని తెలిసినా ఈ పెళ్లి చేయాలనే అనుకుంటున్నారా అని ఎస్ఐ మండిపడతాడు. ఒక అమ్మాయి ఫోన్ చేసి ఈ విషయం చెప్పిందని , చాలా మంచి పని చేసిందని అంటాడు ఎస్ఐ. మీకు ఫోన్ చేసి మా మీదకి ఉసిగొల్పింది ఎవరు అని అంతా అడగటంతో భానుమతి- వసులు టెన్షన్ పడతారు. ఎస్ఐ మాత్రం ఆ అమ్మాయి ఎవరో చెప్పడానికి ఇష్టపడడు. ఎవరు ఏం చేసినా ఈ పెళ్లి జరగదు, జరగనివ్వనని తేల్చిచెబుతాడు. శుభకార్యం చేసుకుంటున్నాం, అందరం సంతోషంగా ఉన్నాం.. చిన్న సమస్యని పెద్దది చేయొద్దని వేడుకుంటాడు బలరామ్. నువ్వేం పెద్ద మనిషివయ్యా.. చట్టం ముందు తూకాలు వేస్తున్నావని బలరామ్‌పై మండిపడతాడు ఎస్ఐ.

దాంతో రగిలిపోయిన పార్ధు.. మీ నోటిని అదుపులో పెట్టుకోండి, నేను అదుపు తప్పాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తాడు. నన్ను ఎదిరించి ఈ పెళ్లిని చేయలేరని ఎస్ఐ చెప్పగా.. పట్టుదలకు పోతే ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరని సవాల్ చేస్తాడు బలరామ్. కొద్దిరోజుల్లో మా అమ్మాయి మేజర్ అవుతుందని, ఇప్పుడు మీరు పెళ్లి ఆపితే దాని జీవితం నాశనం అయిపోతుందని బతిమలాడతాడు కోటి. ఎస్ఐ, బలరామ్‌ల మధ్య గొడవ జరగడంతో పార్ధుని తాళి కట్టమని, ఎవరు అడ్డొస్తారో నేను కూడా చూస్తానని అంటాడు బలరామ్. పార్ధు తాళి కట్టబోతుండగా బలరామ్ చొక్కా పట్టుకుంటాడు ఎస్ఐ. దాంతో రగిలిపోయిన బలరామ్.. ఆ ఎస్ఐని చాచికొడతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.

పోలీసుల మీద చెయ్యి వేస్తావా? అంటూ బలరామ్ చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్తాడు ఎస్ఐ. నేను చేసిన ఒక్క ఫోన్ కాల్ ఈ పెళ్లిలో ఇంత ప్రళయం సృష్టించిందా అని భానుమతి బాధపడుతుంది. నేను చేసిన పని వల్ల వీళ్లకి చాలా పెద్ద శిక్ష పడిందని అంటుంది భానుమతి. బలరామ్‌ని అరెస్ట్ చేసిన ఎస్ఐ జీపులో ఎక్కించుకుని వెళ్లగా.. పార్ధు దాని వెనుకే పరుగులు తీస్తాడు. పోలీస్ డ్రెస్‌ని, పోలీస్ లాఠీని బాగా తక్కువ అంచనా వేశారని, దాని విలువ ఏంటో మీకు బాగా తెలిసేలా చేస్తానని అంటాడు ఎస్ఐ. నాన్నకి ఏం కాదు, నేను తీసుకొస్తానని చెప్పి వెళతాడు పార్ధు.

పెళ్లి ఆగిపోవడంతో అంతా బాధపడుతూ ఉంటారు. నా కూతురి పరిస్థితి ఏంటని కోటి ఏడుపులు పెడబొబ్బాలు పెడుతూ ఉంటాడు. దాంతో నీ దొంగ నాటకాలు ఆపమని మండిపడుతుంది బలరామ్ తల్లి. ఈ పెళ్లిమూలంగా మా అబ్బాయిని అరెస్ట్ చేశారు.. మా ఇంటి పరువు బజారున పడిందని రగిలిపోతుంది. పోయి పోయి ఓ పనికిమాలిన వాడి కూతురి సంబంధాన్ని అంటగట్టుకున్నందుకు మమ్మల్ని మేం చెప్పుతో కొట్టుకోవాలని అంటుంది. మీ అమ్మాయికి 18 ఏళ్లు నిండలేదని మా దగ్గర దాచారని, దాని జాతకమే ఓ ముదనష్టపు జాతకమని మాకు చెప్పలేదని రగిలిపోతుంది. దాంతో ప్రమీల జోక్యం చేసుకుంటూ జీవితంలో తొలిసారి నా కూతురిపై మచ్చపడిందని అంటుంది ప్రమీల.

మన వల్లే ఆ భానుమతి జీవితం నాశనం అయిపోయిందని మాట్లాడుతున్నారని మండిపడుతుంది శాంభవి. ఇప్పటికైనా మా వాళ్లు కళ్లు తెరిస్తే మాకు అంతే చాలని అంటుంది భువన. పెళ్లి అంటేనే ఇంత అనర్ధం జరిగిందంటే, కోడలిగా అడుగుపెడితే ఆ ఇల్లు నాశనమే అంటుంది శాంభవి. మీరూ వద్దు మీ సంబంధం వద్దని కోటి కుటుంబాన్ని వెళ్లిపోమంటుంది బలరామ్ ఫ్యామిలీ. ప్రమీల, కోటి ఎంత బతిమలాడినా వారు పట్టించుకోకపోవడంతో ప్రమీల కూతురిని తీసుకుని వెళ్లిపోతుంది. మరోవైపు బలరామ్‌ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తాడు ఎస్ఐ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Read more about: bhanumathi sai kiran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X