Bhanumathi March 20th Episode: పార్ధు ప్రేమకి అండగా శక్తి .. ఆస్తిని కొట్టేసేలా పావులు, రగిలిపోతున్న శాంభవి
భానుమతి తండ్రి ఓ తాగుబోతు కావడంతో నాన్న తన ప్రేమను ఒప్పుకోడని సూరితో చెప్పి బాధపడతాడు పార్ధు. ఉదయాన్నే కోటి, భానుమతి కూరగాయలు తీసుకుని వెళ్తుండగా అప్పు ఇచ్చిన ఓ రౌడీ .. కోటిగాడిని అడ్డగిస్తాడు. కోటిగాడిని కిడ్నాప్ చేయబోతుండగా భానుమతి అడ్డుపడటంతో వీడిని కాదు.. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయమని అంటాడు రౌడీ.
ఈ గొడవను చూసిన పార్ధు రౌడీలను చితకబాది కోటిగాడు కట్టాల్సిన బాకీ లక్ష రూపాయలను తీరుస్తాడు. ఇదంతా కారులోంచి గమనించి శాంభవి.. వీరి బంధాన్ని ఇక్కడే ముగించేయాలని అనుకుంటుంది. రాత్రి పార్ధు పెళ్లి గురించి ఆలోచిస్తున్న బలరామ్ దగ్గరికి శారద వచ్చి .. టెన్షన్ పడొద్దని వాడికి కాబోయే భార్యను పార్ధునే వెతుక్కున్నాడని చెబుతుంది. దాంతో బలరామ్ చాలా సంతోషించి భానుమతి ఎవరో కనుక్కోవాలని అనుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 20వ తేదీ .. ఎపిసోడ్ 10లో ఏం జరిగిందంటే?

పార్ధు గురించి భానుమతి ఆలోచిస్తూ ఉండగా వసు వచ్చి ఎవరి గురించి ఆలోచిస్తున్నావని అడుగుతుంది. దారిలో ఒక మనసున్న మారాజును చూశానని అంటుంది భానుమతి. ఎవరతను అని వసు అడగ్గా జీపబ్బాయి అని చెబుతుంది భాను. దారిలో రౌడీలతో జరిగిన గొడవ, పార్ధు లక్ష రూపాయలు ఇచ్చిన విషయాన్ని చెబుతుంది భానుమతి. ఎవరైనా ఫ్రీగా ఇస్తే నువ్వు తీసుకోవు కదా అని వసు గుర్తుచేయగా ఔను అంటుంది భానుమతి. పార్ధు - సూరిలు కారులో వెళ్తుండగా.. నేను ప్రేమించిన విషయం చెబుతామని వెళితే ఇలా జరిగిందేంటీ అని అడుగుతాడు పార్ధు. ఈలోపు మీ నాన్నకి చెప్పి ఒప్పించు, లేదంటే ఆయన ఇంకో సంబంధం చూస్తాడని సూరి హెచ్చరిస్తాడు.
నేను మా నాన్న దగ్గరికి వెళ్లి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడమా? నా వల్ల కాదని అంటాడు పార్ధు. మరి ఎవరితో చెప్పిస్తావని అడుగుతాడు సూరి. మీ పిన్నితో చెప్పిస్తానని అంటాడు పార్ధు. శక్తి దగ్గరికి వెళ్లి ఒంటరిగా ఉన్న ఒక పక్షి ఒక తోడును వెతుక్కుంటుంది అంటాడు. ప్రేమ గురించి చెప్పడానికి వచ్చి పక్షుల గురించి చెబుతావేంటీ అని మండిపడతాడు సూరి. ఆ మాటలతో షాకైన శక్తి.. ప్రేమ ఏంటీ అంటుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించానని శక్తితో చెబుతాడు. ఇంతకీ ఎవరా అమ్మాయి అని ప్రశ్నిస్తుంది శక్తి.
సీతారాముల కళ్యాణంలో రాములవారి విగ్రహాలు తీసుకొచ్చింది కదా ఆ అమ్మాయి అని చెబుతాడు పార్ధు. లక్షలు పోసినా దొరకని లక్షణమైన అమ్మాయిని ప్రేమించావా అని అంటుంది శక్తి. ఈ విషయం మీ నాన్నకి చెప్పావా అని శక్తి అడుగుతుంది. అయితే ఆ అమ్మాయి వాళ్ల నాన్న గురించి చెబితే నాన్న ఒప్పుకోడని అంటాడు పార్ధు. సీతారాముల కళ్యాణంలో నాన్నకి వచ్చి తగిలిన తాగుబోతు కూతురిని నేను ప్రేమించానని చెప్పేసరికి శక్తి షాక్ అవుతుంది. ఇవన్నీ నాన్నకి తెలిస్తే నా ప్రేమను నాన్న ఒప్పుకోడని బాధపడతాడు పార్ధు. నాన్నకి చెప్పాలన్నా, ఆయనను ఒప్పించాలన్నా నీ వల్లే అవుతుందని అంటాడు. కష్టమని తెలిసినా నీ కోసం ఒప్పుకుంటానని మాట ఇస్తుంది శక్తి.
విశ్వనాథం వాళ్ల ఇంటికి భానుమతి రావడంతో పార్ధు సంతోషిస్తాడు. ఎందుకొచ్చావని పార్ధు అడగ్గా.. మీరు నాకు సాయం చేశారు కదా, ఎవరైనా అప్పు ఇస్తే ఇలాంటి కాగితాల మీద సంతకాలు చేయించుకుంటారని పత్రాలు తీసుకొస్తుంది. సాయమంటే ఏది ఆశించనిది, లాభం వస్తుందని ఎదురుచూడనిది అని అంటాడు పార్ధు. అది మనసులో ఉంటే చాలు ఇలాంటి కాగితాలు, సంతకాలు అక్కర్లేదని చెబుతాడు. మీరు భలే మాట్లాడుతున్నారు జీపబ్బాయి.. మీ మాటల్లో మంచితనం ఉందని, మీ చేతల్లో గొప్పతనం ఉందని మెచ్చుకుంటుంది భానుమతి.
మీరు ఎవరికైనా ఇట్టే నచ్చేస్తారని భానుమతి అనడంతో అయితే మీకు నేను నచ్చానా అని పార్ధు అడగ్గా భాను షాక్ అవుతుంది. ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా పార్ధు చేత సంతకాలు చేయించుకుంటుంది భానుమతి. ఆ పత్రాలు మీ దగ్గరే పెట్టుకోండి నన్ను నిలదీయాలంటే అవి కావాలని అంటుంది. భానుమతి తిరిగి వెళ్లిపోతుండగా నా ప్రేమ గురించి ఇప్పుడే ప్రపోజ్ చేస్తే బాగుండు అని మనసులో అనుకుంటాడు పార్ధు. భానుమతిని పిలిచి నీతో కొంచెం మాట్లాడాలని చెబుతాడు. పార్ధు ఐ లవ్ యూ చెప్పడానికి తడబడుతుండగా పిల్లలు వచ్చి అల్లరి చేస్తుంటారు. దాంతో భానుమతి వెళ్లిపోతుంది.
పార్ధు ప్రేమ విషయం గురించి శక్తి ఆలోచిస్తుండగా ఆమె కూతురు, కొడుకు వస్తారు. పార్ధు అన్నయ్య కోరిక తీర్చడానికి ఎలాంటి ప్లాన్ వేయాలా అని చూస్తున్నావా? లేక పార్ధు అన్నయ్య కలల్ని ఎలా నేలకూల్చాలా అని చూస్తున్నావా అని అడుగుతారు. పార్ధు మనసులో పుట్టిన ప్రేమను మన ఆశయం కోసం ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తున్నాను అని చెబుతుంది శక్తి. మన చేతిలో ఉన్న ఆయుధాన్ని మనం ఉపయోగించే పద్ధతిని బట్టి ఆథారపడి ఉంటుందని చెబుతుంది .
పార్థు అన్నయ్య ప్రేమ అనే ఆయుధాన్ని నువ్వు ఎలా ఉపయోగించబోతున్నావ్ అని కొడుకు శక్తిని అడుగుతాడు. పార్ధు అన్నయ్య ప్రేమను గెలిపిస్తే బలరామ్ పెదనాన్న పవర్ తగ్గుతుంది అంటున్నావా అని అడుగుతుంది శక్తి కూతురు. గుడిలో పార్ధు ఇష్టపడుతున్న అమ్మాయిని చూశారు కదా? పెద్దగా చదువు సంధ్యలు ఉన్నట్లు కనిపించడం లేదని అంటుంది శక్తి. ఆ అమ్మాయి నాన్న పదికి , పాతికకి ఒకరి దగ్గర చేయి చాచే మనిషి అని చెబుతుంది. పరువు ప్రతిష్ట అనే పదానికి అర్ధం కూడా తెలియని మనుషులు .. ఆస్తి, అంతస్తు అంటే వినని బతుకులు అని అంటుంది శక్తి.
అలాంటి కుటుంబం నుంచి ఓ అమ్మాయి కోడలిగా వస్తే మన ముందు కుక్కిన పేనులా పడి ఉంటారని చెబుతుంది. నువ్వు జీనియస్‌వని, నువ్వు రాజకీయాల్లో ఉంటే ఎప్పుడో మన రాష్ట్ర రాజకీయాలను తలక్రిందులు చేసే దానివని శక్తిని పొగుడుతారు కొడుకు, కూతురు. నాకు అధికారం కావాలని, నా ముందు అంతా తలదించుకుని బ్రతకాలని దాని కోసం ఏమైనా చేస్తానని అంటుంది . ఆవేశంగా ఇంట్లోకి వచ్చిన శాంభవి ఊగిపోతూ ఉంటుంది. నిన్ను ఈ ఇంటి కోడలిగా చేయడానికి ఒక్కొక్క ఎత్తు వేస్తూ వస్తున్నానని.. కానీ ఇప్పుడు పార్ధు జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశించిందని అంటుంది శాంభవి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











