Bhanumathi March 26th Episode: పార్ధుతో పెళ్లికి భానుమతి అంగీకారం.. కోటికి షరతు పెట్టిన బలరామ్

తాను వచ్చింది భానుమతి ఇంటికేనని తెలుసుకున్న పార్ధు ముఖం వెలిగిపోతుంది. సంతోషంతో తండ్రిని హత్తుకుంటాడు. నా కొడుకు సంతోషం కన్నా నాకు ఏది ఎక్కువ కాదని చెబుతాడు బలరామ్. కోటి ఇంట్లో హడావుడి చేస్తుండగా పెళ్లి కొడుకు ఎవరని ప్రమీల అడగటంతో బలరామ్ తనను తోటకి పిలిపించి పెళ్లి గురించి మాట్లాడిన విషయాలన్నీ చెప్పడంతో ప్రమీల సంతోషిస్తుంది. పెళ్లి ఇష్టం లేక బాధపడుతున్న భానుమతి దగ్గరికి వెళ్లి నీకు మంచి సంబంధం వచ్చిందని, త్వరగా పెళ్లి చేసుకుని ఈ నరకం నుంచి వెళ్లిపోమని చెబుతుంది.

నేను చదువుకుంటానని పెళ్లి చేసుకోనని గోల చేస్తున్న భానుమతికి కోటి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు పెళ్లి చేసుకోపోతే మీ అమ్మని చంపేస్తానని బెదిరిస్తాడు. తల్లి కోసం ఒప్పుకున్న భానుమతి.. పెళ్లి చూపుల్లో పార్ధుని చూసి షాక్ అవుతుంది. భానుమతిని చూడటానికి బలరామ్ కుటుంబ సభ్యులంతా వెళ్లారని తెలుసుకున్న శాంభవి, భువనలు రగిలిపోతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 26వ తేదీ ఎపిసోడ్ 15లో ఏం జరిగిందంటే?

Bhanumathi Serial March 26th 2025 Episode 15 Here is Today s full story

మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చాడో లేదో ఇంకా చెప్పలేదని శక్తి అడగ్గా.. బలరామ్ కూడా మా అబ్బాయి నచ్చాడా లేదా అని భానుమతిని అడుగుతాడు. ఇంతమందిలో అడిగితే ఆ అమ్మాయైనా ఎలా ఒప్పుకుంటుంది అని పిన్నిగారు అడుగుతుంది. ఇష్టం ఉన్నా లేకున్నా .. ఏదైనా సరే అది మనందరి ముందే చెప్పాలని అంటాడు బలరామ్. ఎవరి బలవంతం మీదో పెళ్లికి ఒప్పుకుంటే తర్వాత ఇబ్బందిపడేది వాళ్లిద్దరేనని చెబుతాడు. ఎవరి గురించి ఆలోచించకుండా, దేనికీ భయపడకుండా నీ మనసులో మాట చెప్పమని భానుమతితో చెబుతాడు బలరామ్. అంతా భానుమతి నిర్ణయం కోసం ఎదురుచూస్తుండగా.. కోటిగాడు ప్రమీల వైపు సెగ చేసి ఒప్పించమని చెబుతాడు.

ప్రమీల కూడా ఒప్పుకోమని చెప్పడంతో పాటు తల్లిని చంపేస్తానన్న తండ్రి వార్నింగ్ గుర్తొచ్చి భయపడుతుంది భానుమతి. అన్ని ఆలోచించి పెళ్లికి ఒప్పుకుంటుంది భానుమతి. దాంతో పార్ధు సహా బలరామ్ కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. మిగతా విషయాలు మాట్లాడుకుందామని పిన్నిగారు అంటుండగా.. ఇప్పటి దాకా వీళ్లద్దరికి ఒకరి పేరు మరొకరికి తెలియదని అంటాడు సూరి. ఇప్పటిదాకా పేరు కూడా తెలుసుకోలేదా? ఇంకా ఏ కాలంలో ఉన్నారు మరిది గారు అని అంటుంది బలరామ్ పెద్ద కోడలు. ఇప్పుడైనా అడగమని పార్ధుకి చెబుతుంది.

మీ పేరేంటీ బస్సమ్మాయి అని పార్ధు అడగ్గా అంతా నవ్వేస్తారు. భానుమతి అని చెబుతుంది. చక్కని పేరు పెట్టారని బలరామ్ అనగా.. నేను భానుమతి గారి ఫ్యాన్ అని అందుకే ఆ పేరు పెట్టమన్నానని కుమారి చెబుతుంది. మరి మా అన్నయ్య పేరు నువ్వు అడగవా అని శక్తి కూతురు భానుమతిని అడుగుతుంది. మీ పేరేంటి జీపబ్బాయి అని భానుమతి అడగ్గా.. పార్ధు అని చెబుతాడు. ఈ బస్సు అమ్మాయి.. జీపు అబ్బాయి గోలేంట్రా అని బలరామ్ పెద్ద కొడుకు అడగ్గా అదో పెద్ద కథని తర్వాత చెబుతానని అంటాడు సూరి.

ఇకనుంచి అయినా మా వాడిని పాము పాము అని భయపెట్టొద్దు బస్సు అమ్మాయి అని భానుమతితో చెబుతాడు సూరి. దాంతో అందరూ నవ్వేస్తారు. మాకు తెలియకుండా చాలానే జరిగాయని అనుకుంటుంది పార్ధు నానమ్మ. నువ్వు చాలా అదృష్టవంతురాలివని, మా పార్ధు చాలా మంచోడని చెబుతుంది పార్ధు వదిన. అందరూ వెళ్లొస్తామని భానుమతికి చెప్పి బయల్దేరతారు బలరామ్ కుటుంబ సభ్యులు. ఇంటికి బయల్దేరుతుండగా బలరామ్ కోటిని పిలిచి.. అమ్మాయి ఎంత వరకు చదువుకుందని అడుగుతాడు. ఇంటర్ పూర్తయిపోయి డాక్టర్ కోర్స్ చేయాలని ఏదో ఎగ్జామ్ రాస్తోందని చెబుతాడు కోటి.

ఇక చదివించాల్సిన పనిలేదని, ఇంతటితో ఆపేయమని చెబుతాడు బలరామ్. మీరు ఏది చెబితే అదే చేస్తానని అంటాడు కోటి. ఎలాగైనా నా కూతురితో చదువు ఆపించేయాలని అనుకుంటాడు కోటి. బలరామ్ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి ఆనందంగా ఉంటారు. పెళ్లిచూపుల కోసం వెళ్తే పెళ్లే సెట్ అయ్యిందని సూరి సంబరపడిపోతుంటాడు. ఈ మాటలు విన్న శాంభవి, భువనలు షాక్ అవుతారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం ఎంత మందికి దక్కుతుంది అని అంటాడు సూరి. మన పార్ధుకి జీవితంలో అదృష్ట రేఖ ఆ పైవాడు గట్టిగా గీసినట్లుగా ఉన్నాడని, ప్రేమించిన అమ్మాయితోనే జీవితం మొదలుపెట్టబోతున్నాడని చెబుతాడు దుర్గా.

నీ మాటల్లో ఉన్న ప్రేమ , నీ చేతల్లో కనిపించడం లేదని బలరామ్‌పై మండిపడుతుంది శాంభవి. ఒకే తల్లికి పుట్టినా నన్ను సవతి తల్లి కూతురిగానే చూస్తున్నావని భగ్గుమంటుంది. పార్ధుకి పరాయి పిల్లనిచ్చి చేయడానికి ఒప్పుకున్నావు కానీ సొంత మేనకోడలినిచ్చి పెళ్లి చేయడానికి నీకు మనసు రావడం లేదని మండిపడుతుంది. ఇష్టం లేని పెళ్లి ఎన్నటికీ నిలబడదని బలరామ్ అంటాడు. పరువు కోసం ప్రాణాలిచ్చే నువ్వు ఒక తాగుబోతు కూతురిని మనింటికి ఎలా తీసుకొస్తావని నిలదీస్తుంది శాంభవి.

నాకు పరువు ప్రతిష్టలు ముఖ్యమని , కానీ నా కొడుకు సంతోషం కన్నా ఏది ముఖ్యం కాదని చెబుతాడు బలరామ్. వాడు నవ్వుతూ బతకడం కోసం నేను నాలుగు మెట్లు దిగడంలో తప్పులేదని తేల్చిచెబుతాడు. పార్ధుకి, భువనికి సావాసం కుదరదు.. వివాహం జరగదని అంటాడు. నాకు, భువనికి పెళ్లి జరిగితే మా మధ్య తాళి అనే బంధం మాత్రమే ఉంటుందని ప్రేమ అనే అనుబంధం ఉండదని శాంభవితో చెబుతాడు పార్ధు. శాంభవికి శక్తి నచ్చచెప్పబోతుండగా భువనకి, పార్ధుకి పెళ్లి చేస్తానని చెప్పి మాట తప్పుతావా అంటూ మండిపడుతుంది శాంభవి. ఆ భానుమతి అప్పుడు నాతో క్షమాపణలు చెప్పించిందని, నాకు దక్కాల్సిన స్థానాన్ని అది ఆక్రమించిందని భువన రగిలిపోతుంది.

మందు కొడుతూ చిల్ అవుతూ ఉంటాడు కోటి. అక్కడికి భానుమతి వచ్చి నాకు అప్పుడే పెళ్లి వద్దని, నేను చదువుకుంటానని అంటుంది. చదువు అయిపోయాక పెళ్లి చేసుకుంటానని, ఇప్పుడే వద్దని అంటుంది. ఆ మాటలతో కోటి మండిపడుతూ గట్టిగా కేకలు వేయడంతో ప్రమీల పరిగెత్తుకుంటూ వస్తుంది. మందు బాటిల్ పగులగొట్టి ప్రమీల పీకల మీద పెట్టి చంపేస్తానని బెదిరించడంతో భానుమతి భయపడుతుంది. నీ మాట వింటానని అమ్మాయిని వదిలేయమని చెబుతుంది. బాధపడుతున్న భానుమతిని వసు ఓదార్చి ఈ పెళ్లి వద్దని పార్ధుతోనే చెప్పమని సలహా ఇస్తుంది. ఆయన చాలా మంచివాడని సరే అంటాడని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Read more about: bhanumathi sai kiran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X