Bhanumathi March 29th Episode: శారద ఉగ్రరూపం, వణికిపోయిన శాంభవి.. భానుమతి ప్లాన్ చెడగొట్టిన కుమారి
తన పుస్తకాలు కాల్చేస్తోన్న తండ్రిని అడ్డుకుంటుంది భానుమతి. నేను చదువుకుంటానని, ఇప్పట్లో పెళ్లి వద్దని అంటుంది. అదృష్టం వచ్చి వరిస్తానంటే మళ్లీ చదువేంటీ అంటూ మండిపడతాడు కోటి. ఇంతలో ప్రమీల పరిగెత్తుకుంటూ రాగా.. నువ్వైనా నీ కూతురికి అర్ధమయ్యేలా చెప్పమని అంటాడు. నా జీవితం లాగా నీ జీవితం కాకూడదని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెబుతుంది ప్రమీల.
పార్ధు కోసం వచ్చిన శారదను తను బాధపెడతాడు. పెళ్లికి పంతులుగారు అద్భుతమైన ముహూర్తం పెడతాడు. ఈ ఊరిలో, సీతారాముల సమక్షంలోనే పెళ్లి చేస్తానని బలరామ్ చెబుతాడు. దీంతో భువన బాధపడుతుండగా..శాంభవి ఆమెకు ధైర్యం చెబుతుంది. పార్ధు కోసం గుడికి వెళ్తున్న భానుమతి - వసులను కోటి చూసి అనుమానంతో కుమారిని కూడా తోడుగా పంపుతాడు ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 29వ తేదీ ఎపిసోడ్ 18లో ఏం జరిగిందంటే?

గుడికి వచ్చిన భానుమతి, వసులు పార్ధు కోసం అటుఇటు వెతుకుతారు. గుడికొచ్చి దిక్కులు చూస్తారేంటి అని కుమారి వాళ్లని ప్రశ్నిస్తుంది. భానుమతి కోసం పార్ధు, సూరిలు కారులో బయల్దేరతారు. బస్సు అమ్మాయి నన్ను ఎందుకు గుడికి రమ్మంది? ఏం మాట్లాడాలని అనుకుందని సూరిని అడుగుతాడు పార్ధు. తన మనసులో ఉన్న మాటను చెప్పడానికే గుడికి రమ్మందని అంటాడు. ఆ బస్సు అమ్మాయితో నాన్న పెళ్లికి ఒప్పుకున్నాడు కాబట్టి.. నేను ఆ బస్సు అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అంటాడు పార్ధు. నా ప్రేమ గెలిస్తే చాలని అనుకుంటాడు.
నేను కలలు కన్న జీవితం కోసం నేను పోరాడుతున్నానని.. నేను ఆశపడ్డ భవిష్యత్ కోసం సాహసం చేస్తున్నానని దేవుడితో చెబుతుంది భానుమతి. దేవుడికి దండం పెట్టుకున్నావ్ కదా ఇక పోదాం పదండి అని భానుమతితో కుమారి అంటుంది. ఈ ముసల్ది మన ప్లాన్ అంతా పాడు చేసేలా ఉందని భానుతో అంటుంది వసు. ఆమెను డైవర్ట్ చేయడానికి భానుమతి ప్లాన్ వేస్తుంది. నానమ్మ మనతో వచ్చి మంచిపని చేసిందని నేను మొక్కుకున్న మొక్కు నానమ్మ తీర్చేస్తుందని అంటుంది.
దీంతో ఏం మొక్కుకున్నావే అంటూ కుమారి అడుగుతుంది. నా పెళ్లి కుదిరితే నీ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తుందని దేవుడికి మొక్కుకున్నానని అంటుంది భానుమతి. నీ పెళ్లి కోసం నేను 108 ప్రదక్షణలు చేయడం ఏంటని కుమారి నిలదీస్తుంది. నా పెళ్లి జరిగితే నీకు , నాన్నకి మీ గుండెల మీదున్న భారం తగ్గిపోతుంది కదా అందుకేనని అంటుంది భానుమతి. 108 ప్రదక్షణలు నేను చేయలేనని కుమారి చెప్పడంతో , నువ్వు చేయకపోతే నిన్ను ఆ పైవాడు పైకి తీసుకెళ్తాడని భయపడుతుంది వసు. భయపడిన కుమారి ప్రదక్షణలు చేస్తుంటుంది.
నువ్వు నిజంగానే మావయ్య రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలివేనా? లేకపోతే చెత్తబుట్టలో దొరికితే తీసుకొచ్చి పెంచుకున్నారా అని శాంభవిని అడుగుతుంది భువన. సొంత చెల్లి మీద ఇంత పెద్ద పక్షపాతమా? మీ అన్నయ్య ఊరు మొత్తాన్ని ఉద్దరిస్తాడు.. చెల్లెలిని, మేనకోడలిని మాత్రం చిన్నచూపు చూస్తున్నాడని మండిపడుతుంది భువన. మీ మేనల్లుడు తలకుమాసిన వాళ్లని ప్రేమిస్తాడని.. తనే ప్రాణం అనుకున్నవాళ్లని మాత్రం వదిలేస్తాడని అంటుంది. ఆ పెద్దాయనికి బుద్ధి లేదు, పార్ధుకి తెలివి లేదని అనడంతో ఆ మాటలు విన్న శారద .. భువన చెంప పగలగొడుతుంది.
అనుక్షణం ఈ కుటుంబ క్షేమం గురించి ఆలోచించే మీ మావయ్యకి బుద్ధి లేదా? అని మండిపడుతుంది. దిక్కులేక పడిఉన్న మీ ఇద్దరిని చేరదీసి, ఈ కుటుంబంలో కలుపుకున్నందుకా ఆయనకి బుద్ధి లేనిది అని ప్రశ్నిస్తుంది శారద. నిన్ను ప్రేమించకపోతే పార్ధు మంచివాడు కాదా? నిన్ను పెళ్లి చేసుకోకపోతే పార్ధు తెలివి తక్కువ వాడా? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుందని ఆలోచించినవాడు అని చెబుతుంది శారద. పార్ధుకి చదువు లేకపోవచ్చు కానీ సంస్కారం ఉన్నవాడని అంటుంది . మనుషుల్ని గౌరవించడం తెలిసినవాడని, తన గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని మండిపడుతుంది .
పార్ధు గురించి చులకనగా మాట్లాడితే గొయ్యి తీసి పాతేస్తానని వార్నింగ్ ఇస్తుంది శారద. భువనకి నువ్వు చిన్నప్పటి నుంచి చీవాట్లు పెట్టకుండా పెంచావా అంటూ మండిపడుతుంది. ఇంతలో బలరామ్ వచ్చి ఇక్కడ ఉన్నావా? అని అడుగుతాడు. మీ చెల్లెలు, మీ మేనకోడలు మీ గురించి చెబుతుంటే మురిసిపోతున్నానని అంటుంది. భువనకి ఈ మామయ్య అంటే చాలా ఇష్టమని అంటాడు బలరామ్. అందుకే భువనని మన పిల్లలతో పాటు అంత అల్లారుముద్దుగా పెంచానని చెబుతాడు. మీ అమ్మ మీద , నీ మీద మీ మావయ్యకి ఎంత నమ్మకం ఉందో అర్ధమైందా అని ప్రశ్నిస్తుంది శారద. అనవసరంగా నోరుజారి ఆ నమ్మకాన్ని పొగొట్టుకోవద్దని హితవు చెబుతుంది. శారద పెద్దమ్మలో ఈ రేంజ్ ఫైర్ ఉందా అని శక్తిని కూతురు అడుగుతుంది. శారద సైలెంటే కానీ పెదనాన్నని, పార్ధుని ఎవరైనా ఏమైనా అంటే ఇలాగే రగిలిపోతుందని చెబుతుంది శక్తి.
ఇంత పెద్ద గుడిలో ఆ బస్సు అమ్మాయిని ఎక్కడ కనిపెట్టాలా అని సూరి, పార్ధులు వెతుకుతుంటారు. ఇంతలో పార్ధు, భానుమతిలు ఒకరినొకరు చూసుకుంటారు. మీతో ఒక విషయం చెప్పాలని పార్ధుతో అంటుంది భానుమతి. వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కుమారి చూస్తుంది. వీళ్లు ముందే ప్లాన్ చేసుకుని కలుసుకున్నారా? లేక అనుకోకుండా కలుసుకున్నారా అని డౌట్ పడుతుంది. మధ్యలోకి వెళ్లి భానుమతి ప్లాన్ చెడగొడుతుంది. పెళ్లి కాని జంటలు ఇలా కలుసుకుని మాట్లాడుకోకూడదని చెప్పి భానుమతిని ప్రసాదం దగ్గరికి పంపిస్తుంది.
దీంతో ఎలాగైనా పార్ధుకి పెళ్లి ఇష్టం లేదని చెప్పడానికి ఓ కాగితం మీద రాసి పార్ధు చేతిలో పెడుతుంది భానుమతి. అయితే ఆ కాగితం మీద బంగారు నగలు ఉండటంతో అవి కొనమని నీకు ఇన్‌డైరెక్ట్‌గా చెబుతుందని పార్ధుతో అంటాడు సూరి. కానీ అసలు భానుమతి రాసినదేంటో మాత్రం చదవడు. భానుమతి మాత్రం పార్ధుకి విషయం చెప్పానని అనుకుంటుంది. పసుపు దంచే కార్యక్రమం ఎప్పుడు మొదలుపెడదామని శారద హడావుడి చేస్తుంది. ఇంతలో ప్రమీల - కోటి కలిసి విశ్వనాథం ఇంటికి వస్తారు. వారిని చూసి శక్తి వియ్యంకుల వారు వచ్చారంటూ మాట్లాడుతుంది. దీంతో గతంలో శక్తి చేసిన అవమానం ప్రమీలకు గుర్తొస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











