Bhanumathi March 31st Episode: భానుమతి జీవితంలో మలుపులు.. పెళ్లి రోజే నీట్ పరీక్ష, శక్తి కొత్త పథకం
భానుమతిపై డౌట్ రావడంతో కుమారిని గుడికి వెంట పంపిస్తాడు కోటిగాడు. పార్ధు రావడం ఆలస్యం కావడంతో కుమారిని ఎలా తప్పించుకోవాలో తెలియక నా పెళ్లి కుదిరితే దేవుడికి 108 ప్రదక్షణలు చేస్తానని మొక్కుకున్నానని చెబుతుంది భానుమతి. వయసు, ఆరోగ్యం సహకరించకపోయినా ఆలయంలో ప్రదక్షణలు చేస్తుంటుంది కుమారి. పార్ధుని, బలరామ్‌ని నానామాటలు అన్న భువనని లాగిపీకుతుంది శారద. ఇదేనా నీ కూతురికి నేర్పించింది అంటూ శాంభవికి చీవాట్లు పెడుతుంది. ఇంతలో బలరామ్ వచ్చి భువన తల నిమురుతాడు. పార్థు గురించి చులకనగా మాట్లాడితే నిన్ను ఇక్కడే గొయ్యి తవ్వి పాతేస్తానని వార్నింగ్ ఇస్తుంది శారద.
ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే పెద్దమ్మ ఈ రేంజ్‌లో రెచ్చిపోయిందేంటని శక్తిని అడుగుతాడు కొడుకు . గుడిలో పార్ధు- భానుమతి మాట్లాడుకుంటూ ఉండగా కుమారి చూసి వాళ్లిద్దరిని అడ్డుకుంటుంది. పెళ్లి కాకుండా ఇలా చేయకూడదని భానుమతిని లాక్కెళ్లిపోతుంది. ప్రసాదం వంకతో పేపర్ మీద తనకు పెళ్లి ఇష్టం లేదని రాసి పార్ధు చేతిలో పెడుతుంది భానుమతి. ఆ పాంప్లేట్ మీద బంగారు గాజులు ఉండటంతో భానుమతికి అవి కావాలేమోనని పార్ధు , సూరి అనుకుంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 31వ తేదీ ఎపిసోడ్ 19లో ఏం జరిగిందంటే?

విశ్వనాథం ఇంట్లోకి వెళ్లబోతున్న ప్రమీలకు శక్తి ఆమె కూతురు చిత్ర ఎదురవుతారు. ఏంటి ప్రమీల పెద్దింటికి వియ్యంకులయ్యే అదృష్టం వచ్చేసరికి పట్టించుకోవడమే మానేశావ్ అని అంటుంది శక్తి. పాత విషయాలన్నీ గుర్తుచేసుకుని తిరుగుతున్నావా? అని ప్రశ్నిస్తుంది. బంధాలు కలుపుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా ఉన్నావని.. ఇప్పుడు మనం కాబోయే బంధువులమని కంగారు పడొద్దని చెబుతుంది. రేపటి నుంచి అభిమానంగా వరసలు పెట్టి పీలుచుకునేవాళ్లమని అంటుంది శక్తి. ఈ మాటలన్నీ శాంభవి, భువన విని రగిలిపోతారు.
మన ఇంటి గడప ముందు కాలు పెట్టడానికి కూడా అర్హత లేని వాళ్లకి ఈ ఇంటి వియ్యంకుల హోదా ఇస్తారా.. మన ఇంటి పనిమనిషిగా కూడా పనికిరాని ఆ భానుమతిని ఈ ఇంటి కోడల్ని చేస్తారా అంటూ రగిలిపోతుంది భువన. చెప్పు ఎప్పుడు బయటే ఉండాలన్న విషయం ఈ ఇంట్లో వాళ్లకి ఎప్పుడు అర్ధమవుతుందోనని అంటుంది శాంభవి. లోపలికి వెళ్లి బలరామ్‌ని కలుస్తారు ప్రమీల - కోటి. మా వాళ్ల ఏమైనా తప్పు జరిగిందా అని కోటి అడగ్గా.. అవును అని ఆన్సర్ ఇస్తుంది విశ్వనాథం భార్య.
ఇక అందమైన ఆడపిల్లని కని తప్పు చేశావని, ఇప్పుడు మేం నీ చుట్టూ తిరిగేలా చేస్తున్నావని ఫైర్ అవుతుంది . ఆ మాటలతో ప్రమీల - కోటి షాక్ అవుతారు. ఆ వెంటనే శారద, విశ్వనాథం భార్య నవ్వేస్తారు. మా అత్తయ్యగారు ఏదో సరదాగా అన్నారని.. అవేవీ పట్టించుకోవద్దని అంటుంది శారద. మీరిద్దరూ కూర్చొండి అని శారద చెప్పేసరికి కోటి కూర్చోబోతుండగా ప్రమీల అడ్డుకుంటుంది. పంతులుగారిని పిలిచి ముహూర్తం పెట్టించామని, ఆ విషయం చెప్పడానికే మిమ్మల్ని రమ్మన్నానని బలరామ్ చెప్పడంతో కోటి- ప్రమీలలు సంతోషిస్తారు.
ముహూర్తం ఎప్పుడని కోటి అడగ్గా.. వచ్చే నెల 6వ తేదీ అని బలరామ్ చెబుతాడు. మా వైపు పెళ్లి పనులు మేం మొదలుపెట్టేస్తున్నామని, మీ వైపు పెళ్లి పనులు మీరు మొదలుపెట్టేయమని అంటుంది శారద. పెళ్లి ఖర్చులకేమైనా అడుగుదామా అని కోటి అనగా ఆ డబ్బుతో కూడా తాగి తందనాలు ఆడటానికా అని మండిపడుతుంది ప్రమీల. కోటకి రాణి కాబోతున్న కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా అని మండిపడుతుంది ప్రమీల.
గుడిచుట్టూ 108 ప్రదక్షిణలు చేసేసరికి కుమారికి మోకాలి నొప్పులు వచ్చి బాధపడుతుంది. పార్ధుకి నిజం చెప్పేశామని భానుమతి- వసులు సంబరపడిపోతుంటారు. నేను డాక్టర్ కావడానికి శాయశక్తులా కష్టపడాలని, డాక్టర్ అయిన తర్వాత ప్రపంచానికి నేనేంటో చూపించాలని అంటుంది భానుమతి. మోకాళ్లనొప్పితో బాధపడుతున్న కుమారిని ఏం జరిగిందని ప్రమీల ప్రశ్నిస్తుంది. నా చేత 108 ప్రదక్షణలు చేయిస్తానని నీ కూతురు మొక్కుకుందని చెబుతుంది కుమారి.
మందు కొడితే అన్ని బాధలు , నొప్పులు పోతాయని కోటి అనేసరికి కుమారి మండిపడుతుంది. శుభవార్త చెబుదామని వస్తే నాకు శాపనార్ధాలు పెడుతున్నావ్ అని కోటి మండిపడతాడు. భానుమతికి , పార్ధుకి పెళ్లి చేయడానికి వచ్చే నెల 6వ తేదీన ముహూర్తం ఖాయం చేశారని కోటి చెప్పడంతో కుమారి సంబరపడిపోతుంది. నా కూతురు ఆ గుమ్మంలో అడుగుపెడితే చాలు.. మన జీవితాలు మారిపోతాయని అంటాడు కోటి. ఆ మాటలు విన్న ప్రమీల రగిలిపోతుంది. భానుమతి పెళ్లిని అడ్డుపెట్టుకుని లాభం పొందాలని చూడొద్దని మండిపడుతుంది.
పార్ధు గుడిలో కనిపించాడని, మేం వెళ్లే సమయానికే ఆ అబ్బాయి అక్కడికి ఎందుకొచ్చాడని కుమారికి అనుమానం వస్తుంది. భానుమతి ఏమైనా చెప్పిందా అని కోటి అడగ్గా.. ఆ లోపే నేను అడ్డుపడ్డానని అంటుంది కుమారి. పార్ధుని భానుమతి కూడా ఇష్టపడితే పర్లేదని, కానీ మనల్ని కష్టపెట్టే ప్లాన్లు వేస్తే మాత్రం దాని ప్రాణం తీసేస్తానని వార్నింగ్ ఇస్తాడు కోటి. విశ్వనాథం ఇంట్లో పనిమనిషిని వెనుక నుంచి పట్టుకోబోతాడు శక్తి కొడుకు చరణ్. అది గమనించిన చరణ్ కొడుకుని మందలిస్తుంది. నీ వల్ల నాకు గొప్ప పేరు రాకపోయినా పర్లేదు కానీ అందరిలో తలదించుకునే పరిస్ధితి మాత్రం తీసుకురావొద్దని చెబుతుంది శక్తి.
పోయి పోయి పని పిల్ల మీద కన్నేస్తావేంట్రా .. ఇంకోసారి ఇలా నా కంటపడితే నీ పుచ్చ పగులగొడతానని వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో శక్తిని వెతుక్కుంటూ పార్ధు వస్తాడు. భానుమతి తనకు కావాల్సింది అడిగిందని ఆమెకు అది ఇచ్చేయాలని అంటాడు పార్ధు. ఇంతకీ భానుమతి ఏం కావాలని కోరిందని అడుగుతుంది శక్తి. దాంతో భానుమతి ఇచ్చిన పాంప్లేట్‌ను చూపిస్తాడు పార్ధు. దాని మీద గాజులు, నెక్లెస్ ఉండటంతో వాటిని కొని తీసుకొస్తానని ఆ నగలు నువ్వే ఇవ్వాలని అడుగుతాడు పార్ధు. దానికి శక్తి కూడా సరేనని అంటుంది.
నేను గీసిన గీత నువ్వు దాటకూడదు.. నీ నుదుటి రాత కూడా నా పర్మిషన్ లేకుండా మారకూడదని మనసులో అనుకుంటుంది శక్తి. చిన్నప్పటి నుంచి అందుకే నీకు చదువు సంధ్యలు లేకుండా చేశానని అంటుంది. చిన్నప్పటి నుంచి కూడా నా చెప్పుచేతల్లో పెట్టుకుని నిన్ను పెంచుతున్నానని, నా చేతిలో కీలుబొమ్మలా నిన్ను మార్చుకున్నానని అనుకుంటుంది. ఇకపైనా నీ జీవితం ఇలాగే ఉంటుందని , నిన్ను నమ్ముకుని ఇంటికి వచ్చిన అమ్మాయి జీవితం కూడా నా కనుసైగకి లొంగి ఉంటుందని అంటుంది. భానుమతిని, పార్ధులని నా చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి ఇది మంచి అవకాశమని చిత్ర, చరణ్‌లతో అంటుంది శక్తి.
భానుమతి ఊహాల్లో గడిపేస్తున్న పార్ధు.. తన చేతిపై ఆమె పేరు రాసుకుని మురిసిపోతాడు. భానుమతి చదువుకుంటూ ఉండగా అడుగుల శబ్ధం వినిపించడంతో కంగారుపడి పుస్తకాలు దాచేస్తుంది. అది వసు కావడంతో ఊపిరి పీల్చుకుని వచ్చే నెల 6వ తారీఖు వరకు కష్టపడితే చాలని చెబుతుంది భానుమతి. ఇంతలో సూరి వచ్చి పార్ధు చేతిపై ఉన్న అక్షరాలు చూసి తప్పని చెప్పి సరిదిద్దుతాడు . ఇంతలో పిల్లలు వచ్చి నవ్వుకుంటారు.. ఇద్దరూ తప్పేరాశారని చెప్పి కరెక్ట్ చేస్తారు. కుమారి రావడంతో పుస్తకాలు ఎక్కడ కనిపిస్తాయోనని భానుమతి భయపడుతుంది. నీ పెళ్లి ఆగిపోతుందని కలలు కనొద్దని భానుమతికి చెబుతాడు కోటి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











