Bhanumathi May 10th Episode : భానుమతికి పరీక్ష పెట్టిన బలరామ్.. భార్యకి అండగా పార్ధు, రగిలిపోతున్న భువన
నాయనమ్మ పిలవడంతో భానుమతిని దగ్గరికి వస్తాడు పార్ధు. మీ నాయనమ్మ గారు ఎప్పుడూ నన్నే టార్గెట్ చేస్తున్నారని నేను రానని చెప్పడంతో నువ్వు చేసిన తప్పుకి శిక్ష వేయబోతున్నారని చెబుతాడు పార్ధు. దాంతో కంగారుపడిన భానుమతి అలాగే పెద్దావిడ దగ్గరికి వెళ్తుంది. శారద, బలరామ్ తల్లి కలిసి భానుమతిని బంగారు నగలతో అలంకరిస్తారు. భార్య అందాన్ని చూసి పార్ధు మురిసిపోతూ ఆమెకు దిష్టి తీస్తాడు.
పార్ధు మీద ఆశలు వదులుకోమని భువనకి చెబుతుంది శాంభవి. అది ఈ జన్మలో జరగదని, కాంచన గారు కూడా ఈ ఇంటికి కోడలయ్యే అర్హత నాకే ఉందని చెప్పారని తల్లితో అంటుంది భువన. ఏదో ఒకరోజున భానుమతి ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని అప్పుడు పార్ధు భార్య స్థానం నాదేనని చెబుతుంది. నిజం బయటపడితే కూతురి కాపురం ఏమవుతుందోనని ప్రమీల ఆలోచిస్తూ చేయి కోసుకుంటుంది. ఇంతలో కోటి వచ్చి భానుమతి కాపురానికి ఏం కాదని ఆమెను ఓదారుస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 10వ తేదీ ఎపిసోడ్ 54లో ఏం జరిగిందంటే?

అన్న సేవలో తరిస్తున్న భర్తకు శక్తి క్లాస్ పీకుతుంది శక్తి. ఇంకా ఎన్నాళ్లు ఈ ఇంట్లో గుమాస్తాలా ఉంటారని ప్రశ్నిస్తుంది. మీ బలం మీరు తెలుసుకోవాలని, ఈ ఇంటి ఆధిపత్యాన్ని మీరు చేజిక్కించుకోవాలని అంటుంది శక్తి. అవన్నీ జరిగే పనులు కాదని దుర్గ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నేను చేసి చూపిస్తానని వెళ్లిపోతుంది శక్తి. భానుమతిని అందంగా అలంకరించి బయటికి తీసుకొస్తారు శారద, బలరామ్ తల్లి. నీ భార్య ఎలా ఉంది? మన ఇంటి కోడలిగా హుందాగా ఉందా? అని అడుగుతుంది నాయనమ్మ.
భానుమతిని చూసి మురిసిపోయిన పార్ధు కుందనపు బొమ్మలా ఉందని, నా దిష్టే తగిలేలా ఉందని పార్ధు చెబుతాడు. ఈ మాటలన్నీ విన్న భువన రగిలిపోతుంది. నీకు ఈ నగలు నచ్చలేదా? ఎందుకు అలా ఉన్నావని పార్ధు అడుగుతాడు. మీకు నాలో చందమామ కనిపిస్తుందేమో కానీ నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయని చెబుతుంది భానుమతి. ఒకటో రెండో అయితే అందంగా ఉంటుందని, కానీ ఇన్ని నగలు వేసేసరికి బండెడు మోత మోస్తున్నట్లుగా ఉందని అంటుంది. చాలా బరువుగా ఉన్నాయని చెప్పడంతో బలరామ్ తల్లి మండిపడుతుంది. ఈ బంగారం బరువే మోయలేకపోతే.. రేపు నీ కడుపులో పడే బిడ్డ బరువు ఏం మోస్తావని ప్రశ్నిస్తుంది.
పెద్దావిడ మాటలకు పార్ధు నవ్వుకుంటాడు. నీ భార్యని తండ్రికి చూపించమని చెప్పడంతో పార్ధు సరేనని అంటాడు. తర్వాత కోడలిని తీసుకుని బలరామ్ దగ్గరికి తీసుకెళ్తారు శారద, పెద్దావిడ. నగల్లో ఆమెను చూడగానే బలరామ్ కూడా మురిసిపోతాడు. ఈ ఇంటి పరువుకు, ప్రతిష్టకు నిదర్శనంలా నా కోడలు ఉందని బలరామ్ మెచ్చుకుంటాడు. ఈ ఇంటి బరువు బాధ్యతలు మోయడానికి కావాల్సిన పెద్దరికం తన ఒంటి మీదకు వచ్చినట్లుగా అనిపిస్తోందని అంటాడు. ఇప్పుడు బలరామ్ కోడలనే హుందాతనం భానుమతికి వచ్చిందని అంటుంది పెద్దావిడ.
భానుమతి ఈ ఇంటి కోడలిగా వచ్చిందన్న మాటే కానీ ఇప్పటి వరకు దాని చేతి వంటే రుచి చూడలేదని అంటుంది బలరామ్ తల్లి. అందరికీ కనీసం కాఫీ అయినా పెట్టివ్వమని ఆర్డర్ వేస్తుంది పెద్దావిడ. తనకు కాఫీ పెట్టడం రాకపోవడంతో భానుమతి టెన్షన్ పడుతుంది. నేను ఇలాంటి ప్రయోగం చేస్తే ఆరోగ్యంగా ఉన్న వీళ్లంతా హాస్పిటల్ పాలు కావాల్సిందేనని అనుకుంటుంది. భానుమతికి ఏమైనా కావాలంటే నేను సాయం చేస్తానని జయం అనడంతో పెద్దావిడ మండిపడుతుంది.
ఆడపిల్లలకు వంటగది గురించి ఎవ్వరూ ప్రత్యేకంగా నేర్పించాల్సిన పని లేదని చెప్పి శానుమతిని లోపలికి పంపిస్తుంది శారద. భానుమతికి కాఫీ చేయడం రాదని పార్ధుకి డౌట్ వస్తుంది. కిచెన్‌లోకి వెళ్లిన భానుమతికి ఏ వస్తువు ఎక్కడో ఉందో తెలియదు. భానుమతిని అందరూ నెత్తిన పెట్టుకోవడంతో శాంభవి, భువనలు రగిలిపోతారు. నువ్వు బాధపడతావని తెలిసి కూడా నీ ముందే కొత్త కోడలిని నెత్తిన ఎక్కించుకుంటున్నారని మండిపడుతుంది. ఎన్నిరోజులు ఈ భానుమతికి నెత్తి మీద కిరీటం పెట్టి చూసుకుంటారో నేను కూడా చూస్తానని తల్లితో అంటుంది భువన. కాఫీ అడగ్గానే భానుమతి ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ మారిపోవడంతో ఆమెకు కాఫీ చేయడం రాదని పార్ధు అనుకుంటాడు. భార్యకి హెల్ప్ చేయాలని పార్ధు అనుకుని కిటికీ దగ్గరికి వెళ్లి భానుమతిని పిలుస్తాడు.
నాకేం రాదని ఇప్పుడేం చేయాలని భానుమతి అడగ్గా పార్ధు కిటికీలో నుంచి సైగలు చేసి ఆమెకు కాఫీ చేయడం నేర్పిస్తాడు. పార్ధు ఇచ్చిన సూచనలతో కాఫీ చేసిన భానుమతి .. వాళ్లకి ఇవ్వడానికి టెన్షన్ పడుతుంది. ఇంతలో భానుమతి లోపలికి వస్తుండగా బలరామ్ కుటుంబ సభ్యులు చూస్తారు. ఫస్ట్ బలరామ్‌కి కాఫీ ఇచ్చి తర్వాత మిగిలిన వారికి ఇస్తుంది భాను. ఈ కాఫీ ఎలా ఉందో ఏంటోనని భర్తను అడుగుతుంది. నువ్వేం టెన్షన్ పడొద్దని సైగలతోనే ధైర్యం చెబుతాడు పార్ధు.
కాఫీ తాగగానే బలరామ్ తల్లి కోపంగా ఫేస్ పెట్టడంతో భానుమతి టెన్షన్ పడుతుంది. పెద్దావిడ లేచి కాఫీ కప్పు నేలకేసి విసిరికొడుతుంది. దాంతో బలరామ్ కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. మీ ఇంట్లో కనీసం కాఫీ చేయడం కూడా నేర్పించలేదా అని నిలదీస్తుంది బలరామ్ తల్లి. కూతురికి కనీస బాధ్యతలు కూడా నేర్పించలేకపోయిందా అని మండిపడుతుంది. ఆడదంటే వంట గదికి మహారాణిలా ఉండాలని, కానీ నువ్వు ఎలా ఉన్నావని ఫైర్ అవుతుంది. ఇలాంటి కోడల్ని నువ్వు ఇంటికి తీసుకొచ్చేదని మండిపడుతుంది. అయితే తను కలగంటున్నానని తెలిసి ఉలిక్కిపడుతుంది.
బలరామ్ ఫ్యామిలీ కాఫీ తాగి ఎవ్వరూ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతారు. దాంతో పార్ధు కలగజేసుకుని భానుమతి కాఫీ ఎలా ఉందో చెప్పమని అడుగుతాడు. చెప్పడానికి ఏం లేదని కాఫీ సూపర్‌గా పెట్టిందని కాంప్లిమెంట్ ఇస్తుంది జయంతి. ఈ కాలంలో కూడా అన్ని నేర్చుకుని ఇంట్లో అడుగుపెట్టావని చాలా సంతోషంగా ఉందని బలరామ్ మెచ్చుకుంటాడు. ఇంతకీ అత్తయ్య గారు ఏం మాట్లాడం లేదని శక్తి ప్రశ్నిస్తుంది. భానుమతి కాఫీ నచ్చిందా? లేదా? అని అడుగుతుంది. మరీ అంత అద్భుతంగా లేకపోయినా తాగేలాగే ఉందని పెద్దావిడ చెప్పడంతో భానుమతి- పార్ధులు ఊపిరి పీల్చుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











