Bhanumathi May 12th Episode: ఝాన్సీ లక్ష్మీభాయిలా భానుమతి.. భువనకి బాబూరావు టార్చర్

భానుమతిని అందంగా అలంకరించడంతో భార్యను చూసుకుని మురిసిపోతాడు పార్ధు. ఆమెను బలరామ్‌కి కూడా చూపించడానికి శారద, పెద్దావిడ తీసుకుని వెళ్తారు. ఆమెను చూసిన బలరామ్ కుందనపు బొమ్మలా ఉన్నావని మెచ్చుకుంటాడు. భానుమతిని ఇంట్లో వాళ్లు నెత్తిన పెట్టుకోవడంతో భునవ, శాంభవిలు రగిలిపోతారు. నేను బాధపడతానని తెలిసి కూడా ఆమెను నా ముందే పొగుడుతున్నారని భువన ఫైర్ అవుతుంది. ఇంకా ఎన్నిరోజులు భానుమతిని నెత్తిన పెట్టుకుంటారో చూస్తానని తల్లితో అంటుంది భువన.

భానుమతిని తీసుకుని బయటికి వెళ్తానని పార్ధు చెప్పగా.. దాని కంటే ముందు మీ ఆవిడకి ఓ టెస్ట్ పెడతానని అంటుంది బలరామ్ తల్లి. వచ్చినప్పటి నుంచి భానుమతి చేతి వంట మనం రుచి చూడలేదని, కనీసం కాఫీ అయినా పెట్టమని చెబుతుంది. ఆ మాటలతో భానుమతి వణికిపోతుంది. కాఫీ పెట్టడం తనకు రాకపోవడంతో వంటింట్లోకి వెళ్లి టెన్షన్ పడుతుంది. ఆమె పరిస్ధితి చూసిన పార్ధు.. కిటికీలో నుంచి చూసి సైగలతో కాఫీ చేయడం నేర్పిస్తాడు. అనంతరం అందరికీ భానుమతి కాఫీ ఇవ్వగా అంతా మెచ్చుకుంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 12వ తేదీ ఎపిసోడ్‌ 55లో ఏం జరిగిందంటే?

Bhanumathi Serial May 12th 2025 Episode 55 Here is Today s full story

భానుమతి పెట్టిన కాఫీ చాలా బాగుందని బలరామ్ మెచ్చుకుంటాడు. ఈ కాలంలో కూడా అన్నీ నేర్చుకుని ఇంట్లో అడుగుపెట్టడం, మాకు సంతోషంగా ఉందని అనడంతో భానుమతి సంతోషిస్తుంది. ఇంతకీ అత్తయ్యగారికి నచ్చిందా లేదా అని శక్తి అడుగుతుంది. మరీ అంత అద్భుతంగా లేకపోయినా తాగేలానే ఉందని అంటుంది కౌసల్య. పెద్దావిడ మాటలతో భానుమతి ఊపిరి పీల్చుకుంటుంది. ఇప్పుడైనా నేను భానుమతిని తీసుకుని బయటికి వెళ్లొచ్చా? ఇంకేమైనా పరీక్షలు ఉన్నాయా? అని పార్ధు అడుగుతాడు. ఈరోజుకు చాలు కానీ, నువ్వు భానుమతిని తీసుకుని బయటికి వెళ్లమని అంటుంది కౌసల్య. భానుమతి, పార్ధులు కలిసి బైక్ మీద ఓ పూల తోటకి వస్తారు. పొలం గట్ల మీద పార్ధు పడిపోబోతుండటంతో భానుమతి పట్టుకుని పకపక నవ్వుతుంది.

పొలం దగ్గరికి తీసుకొచ్చి పనివాళ్లకి పరిచయం చేస్తాడు పార్ధు. అమ్మాయి గారు లక్ష్మీదేవిలా ఉన్నారని పనివాళ్లు చెప్పడంతో, ఇన్ని నగలు మోయడం ఆ లక్ష్మీదేవికి అలవాటేమో కానీ.. నా వల్ల కాదని మండిపడుతుంది భానుమతి. వీటిని మోయడం చాలా కష్టమని, మీరు చూడండి చాలా ఫ్రీగా ఉన్నారని అమాయకంగా చెబుతుంది. నాకు మీలాగే ఉండటం ఇష్టమని అంటుంది. ఇంత పెద్దింటికి కోడలైనా అమ్మాయి గారికి డబ్బు మీద, డాబు మీద మక్కువ లేనట్లుగా ఉందని పనివాళ్లు మెచ్చుకుంటారు. అమ్మాయిగారే కాదు, మనుసు కూడా బంగారమేనని భానుమతిని ప్రశంసించడంతో పార్ధు మురిసిపోతాడు.

నా మనసు కూడా బంగారమని మా బామ్మ ముందు చెబితే అవి కూడా ఒంటిపై వేసుకోమని అంటుందని భానుమతి చెప్పడంతో పార్ధు సహా అంతా నవ్వేస్తారు. తర్వాత భానుమతిని తీసుకుని వచ్చేస్తాడు పార్ధు. మనింట్లో పంట పొలాల బాధ్యత, పైసా వసూళ్ల బాధ్యత మొత్తం నాదేనని చెప్పడంతో భానుమతి షాక్ అవుతుంది. ఏమో అనుకున్నాను కానీ మీరు నిజంగా చాలా గ్రేట్ అంటుంది భానుమతి. ఇంతలో ఓ పనివాడు పార్ధు, భానుమతిల కోసం తాటిముంజలు కోసుకుని వస్తాడు. తర్వాత ఇద్దరూ కలిసి తాటిముంజలు తింటారు. భానుమతికి తాటిముంజలు తినడం రాకపోవడంతో పార్ధు దగ్గరుండి తినిపిస్తాడు. భర్త తనపై చూపుతున్న ప్రేమకు భానుమతి మురిసిపోతుంది.

పనిమనిషి స్వాతి బట్టలు ఉతుకుతూ కనిపించడంతో చరణ్ ఆమెను వెనుక నుంచి పట్టుకోవాలని చూస్తాడు. బట్టలు ఉతుకుతుండగా సబ్బు నురగ చరణ్ బట్టలపై పడుతుంది. నేను చూసుకోలేదని స్వాతి చెప్పగా.. నువ్వు చూసుకోలేదు సరే ఇలా మా అమ్మ చూస్తే నా పరిస్థితి ఏంటని అడుగుతాడు చరణ్. ఏదో ఒకటి చెప్పండి, నేను మీ మీద వేశానని చెబితే అమ్మగారు నన్ను ఉతుకుతారని భయపడుతుంది స్వాతి. నిన్ను ఎక్కడికో తీసుకెల్దామని నేను అనుకుంటుంటే, నువ్వు అక్కడి రాకుండా ఇలా అన్నింటికి భయపడిపోతుంటావని మండిపడతాడు చరణ్.

నేను చెప్పినట్లు చేస్తే నువ్వు ఈ ఇంటికి అమ్మగారివి అయిపోతావని, మా అమ్మగారు అత్తయ్య గారు అయిపోతారని అంటాడు చరణ్. అప్పుడు నేను ఇలా వెళ్లి నా బట్టలు చూపించినా ఎవ్వరూ ఏమీ అనరని చెబుతాడు. ఆ మాటలతో స్వాతి ఆలోచనలో పడుతుంది. భువన టెన్షన్ పడుతుండటం చూసిన శాంభవి ఏం జరిగిందని అడుగుతుంది. ఆ బాబురావు గాడు డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, ఇవ్వకపోతే డైరెక్ట్‌గా ఇంటికే వచ్చేస్తానని భయపెడుతున్నాడని చెబుతుంది భువన.

భువన మాటలతో ఏం చేయాలో అర్ధం కాక తలపట్టుకున్న శాంభవిని.. నువ్వు పట్టుకోవాల్సింది గుండె అని చెబుతుంది భువన. నీకు హార్ట్ అటాక్ వచ్చిందని డాక్టర్‌ను మేనేజ్ చేసి మావయ్యతో ఆపరేషన్ చేయాలంటే పది లక్షలు కావాలని చెబుదామని , ఆ డబ్బుని ఆ బాబూరావు గాడికి ఇచ్చేదామని చెబుతుంది భువన. వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా బాబురావు ఫోన్ చేస్తాడు. డబ్బులు తీసుకొస్తావా? లేకపోతే నేను మీ మావయ్య దగ్గరికి వచ్చి డబ్బు కొట్టేస్తానని చెబుతాడు. నాకు రెండ్రోజులు టైం ఇవ్వు నీ డబ్బు నీకు ఇచ్చేస్తానని చెబుతుంది భువన. దానికి బాబురావు ఒప్పుకుంటాడు.

పార్ధు, భానుమతిలు ఇంటి నుంచి వచ్చేసరికి పిల్లలంతా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం జరిగిందని భాను అడగ్గా.. మా ఇంటి దగ్గర నాటకాల పోటీలు జరుగుతున్నాయని, మేం ఏ నాటకాలు వేయాలో అర్ధం కావడం లేదని చెబుతారు పిల్లలు. నువ్వు ఝాన్సీ లక్ష్మీభాయి వేషం వేయమని పాపతో చెబుతుంది భానుమతి. కానీ నాకు ఝాన్సీ లక్ష్మీభాయిలా చేయడం రాదని పాప చెప్పడంతో నేను చూసుకుంటానని అంటుంది భాను. పిల్లలకి కావాల్సిన వస్తువులు తీసుకురమ్మని చెప్పి తను ఝాన్సీ లక్ష్మీభాయిలా వేషం వేసి ట్రైనింగ్ ఇస్తుంది. భానుమతి అరుపులు, కేకలు విన్న కౌసల్య బయటికి వస్తుంది.

ఇక్కడ ఏం జరుగుతుంది? నీ తలకు ఆ గుడ్డ ఏంటీ అని భానుమతిని నిలదీస్తుంది పెద్దావిడ. ఝాన్సీ లక్ష్మీభాయి డ్రామా జరుగుతుందని పిల్లలు చెబుతారు. మా వీధిలో నాటకాలు వేస్తున్నారని, ఎలా చేయాలో నాకు అక్క నేర్పిస్తుందని అంటారు. అత్తారింట్లో కాపురం ఎలా చేయాలో నేర్చుకోలేదు కానీ పిల్లలకు మాత్రం నాటకాలు ఎలా వేయాలో నేర్పిస్తున్నావా? అని మండిపడుతుంది. కర్రతో పిల్లల వెంటపడుతున్న పెద్దావిడని చూసి భానుమతి నవ్వుకుంటుంది. ఇదంతా చూసిన పార్ధు మురిసిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Read more about: bhanumathi sai kiran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X