Bhanumathi May 13th Episode: కానిస్టేబుల్‌కు లంచం ఇచ్చిన పార్ధు.. స్వాతి - చరణ్ ఎఫైర్ పసిగట్టిన శక్తి
భానుమతి పెట్టిన కాఫీ చాలా బాగుందని ఇంట్లో వాళ్లంతా మెచ్చుకుంటారు. దీంతో భార్యను తీసుకుని తమ పొలాలన్నీ చూపిస్తాడు పార్ధు. భానుమతి మంచితనం చూసి పనివాళ్లంతా ఆమెను మెచ్చుకుంటారు. ఇంతలో ఒక రైతు తాటి ముంజలు తీసుకొచ్చి ఇవ్వగా భానుమతికి వాటిని తినిపిస్తాడు పార్ధు. భర్త తన మీద చూపిస్తున్న ప్రేమతో భానుమతి మురిసిపోతుంది.
తనకు పది లక్షలు కావాలంటూ భువనను బాబూరావు బ్లాక్ మెయిల్ చేయడంతో ఈ విషయం తల్లికి చెబుతుంది. భువనకి ధైర్యం చెప్పిన శాంభవి, బాబూరావుని రెండ్రోజులు టైం కావాలని అడగమని చెబుతుంది. భానుమతిని తీసుకుని పార్ధు ఇంటికి రాగా.. పిల్లలు తమకు నాటకం వేయడం నేర్పించమని అడుగుతారు. దాంతో ఝాన్సీ లక్ష్మీభాయిలా వేషం వేస్తుంది భానుమతి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 13వ తేదీ ఎపిసోడ్ 56లో ఏం జరిగిందంటే?

పిల్లలతో ఝాన్సీ లక్ష్మీభాయి నాటకం రిహార్సల్స్ చేస్తున్న భానుమతిపై కోప్పడుతుంది కౌసల్య. ఉదయాన్నే లెక్కలు చూస్తున్న బలరామ్, దుర్గల దగ్గరికి కానిస్టేబుల్ వస్తాడు. నన్నెందుకు రమ్మన్నారు అని అడుగుతాడు. ఆ వెంటనే పార్ధుని పిలుస్తాడు బలరామ్. ఆరోజు పెళ్లి ఆపడానికి ఎస్ఐ గారికి ఫోన్ చేసింది ఒక అమ్మాయి అని అడుగుతాడు పార్ధు. ఆ మాటలతో భానుమతి, భువనలు వణికిపోతారు. ఆ అమ్మాయి ఎవరో చెప్పమని కానిస్టేబుల్ అడగ్గా.. ఎస్ఐ గారు మాకు కూడా ఆమె ఎవరో చెప్పలేదని అంటాడు కానిస్టేబుల్. ఆయన చెప్పరని, కానీ మీరే తెలుసుకోవాలని పార్ధు చెబుతాడు.
అతనికి అర్ధమయ్యేలా నేను చెబుతానని కానిస్టేబుల్‌ను పక్కకి తీసుకెళ్తాడు పార్ధు. పెళ్లి ఆపడానికి పోలీసులకు ఫోన్ చేసింది భానుమతేనని తెలిస్తే ఆమెను ఇంటి నుంచి బయటికి గెంటేస్తారని శక్తి కంగారు పడుతుంది. ఆ తర్వాత మరో సంపన్న కుటుంబం నుంచి కోడల్ని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు మొదలవుతాయని, ఆ వచ్చే అమ్మాయి నాకు తగ్గట్లుగా నడుచుకోకపోతే నా పెత్తనం చెల్లదని అనుకుంటుంది. భానుమతి విషయం బయటికి రాకూడదని ప్లాన్ చేస్తుంది శక్తి.
నిజం తెలిసేలోపు నేనే నోరు విప్పడం మంచిదని భానుమతి అనుకుంటుంది. నిజం తెలిసిన రోజున నేను నోరు విప్పడం కుదరదని, నన్ను మోసగత్తెలా చూస్తారని బాధపడుతుంది. కానిస్టేబుల్‌ని పక్కకి తీసుకెళ్లిన పార్ధు ఆయనకి డబ్బులు ఇస్తాడు. నాకు తెలిసిన నిజం భయటపెడితే ఒకమ్మాయి జీవితం నాశనం అయిపోతుందని, నాకు తెలియదని ఎంతకాలం ఈ నిజం దాచగలనని భయపడతాడు కానిస్టేబుల్. బయటికి వెళ్తున్న కానిస్టేబుల్‌కి శక్తి ఎదురవుతుంది. పెళ్లిని ఆపిని అమ్మాయి ఎవరో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారా? అని అడుగుతుంది శక్తి. ఖచ్చితంగా తెలుస్తుందని లేదని, కానీ ప్రయత్నం చేస్తానని అంటాడు. దాంతో శక్తి డబ్బులు తీసి అతని చేతిలో పెడుతుంది.
ఆ రోజు పెళ్లి ఆపిందెవరు మీకు తెలుసు.. మీకు తెలుసని నాకు తెలుసని అంటుంది శక్తి. అది ఎప్పటికీ బయటికి రాకూడదని, మీకు తెలిసిన నిజం మీ గొంతులోనే సమాధి అయిపోవాలని ఎట్టి పరిస్ధితుల్లోనూ ఎవ్వరికీ తెలియకూడదని చెబుతుంది. పెళ్లి ఆపిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని బలరామ్ ఆలోచిస్తుండగా పార్ధు వచ్చి ఆ అమ్మాయి ఎవరో ఖచ్చితంగా తెలుస్తుందని చెబుతాడు. ఈ కానిస్టేబులే కాదు మరో దారిలోనైనా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుంటానని, తనని వదిలిపెట్టనని అంటాడు పార్ధు.
సూట్‌కేసులో పెట్టిన డబ్బు కనిపించకపోవడంతో దుర్గ టెన్షన్ పడతాడు. ఇంతలో శక్తి రావడంతో ఎవరో వచ్చి లక్ష రూపాయలు తీశారని చెప్పడంతో .. ఎవరో కాదు నేనే తీశానని అంటుంది శక్తి. ఏదో ఒక లెక్కలో రాసేయండి, గుమాస్తాలా నా దగ్గర లెక్కలు అడగొద్దని మండిపడుతుంది. నిజం తెలిస్తే తన పరిస్ధితి ఏంటని భానుమతి టెన్షన్ పడుతుంది. తొందరపడి ఎంత పని చేశావ్.. నిజం తెలిస్తే అంత మంచి జీపబ్బాయి దృష్టిలో చెడ్డదానివి అవుతావని అనుకుంటుంది. ఇంతమంచి ఫ్యామిలీతో రిలేషన్‌షిప్ లేకుండా పోతుందని బాధపడుతుంది.
బాధపడుతున్న భానుమతిని చూసి ఏం జరిగిందని అడుగుతాడు పార్ధు. నువ్వు దేని గురించో బాధపడుతున్నావని అడుగుతాడు. ఇప్పుడు మనిద్దరం వేర్వేరు కాదని నీ బాధేంటో తెలిస్తే దానిని చిటికెలో తరిమేస్తానని అంటాడు. చెబితే నా బాధనే కాదు, నన్నే తరిమేస్తావని అనుకుంటుంది శక్తి. అమ్మ గుర్తొచ్చి బాధపడ్డానని పార్ధుతో చెబుతుంది భానుమతి. ఇళ్లు శుభ్రం చేస్తున్న పనిమనిషి స్వాతిని అదేపనిగా చూస్తాడు చరణ్. వీరిద్దరి వ్యవహారాన్ని శక్తి పసిగట్టి స్వాతిపై కేకలు వేస్తుంది.
మార్కెట్‌కు వెళ్లి పూలు, పళ్లు తీసుకురమ్మని చెబితే అడ్డమైన పనులు చేస్తున్నావా? అని మండిపడుతుంది. పనిదానివి చెప్పిన పని మీద ధ్యాస పెట్టాలని క్లాస్ పీకుతుంది. ఇంట్లో పనిచేయడం ఇష్టం లేదా? మీ అమ్మ నీకు పెళ్లి ఖాయమని చెప్పిందా అని ప్రశ్నిస్తుంది శక్తి. ముందు మార్కెట్‌కి వెళ్లిరమ్మని స్వాతిపై మండిపడుతుంది. తన కొడుకు శోభనం పనులు నాకు చెప్పడం ఏంటని శారదపై ఫైర్ అవుతుంది శక్తి. తన మొగుడు నా మొగుడికి పనులు చెప్పినట్లు చేస్తే పనులు అవ్వదని తొందరల్లోనే తెలియజేస్తానని అనుకుంటుంది.
భానుమతి - పార్ధులకు మరోసారి ఫస్ట్ నైట్‌కు ఏర్పాట్లు చేస్తుంది బలరామ్ ఫ్యామిలీ. నిన్న రాత్రిలా టైం వేస్ట్ కానివ్వకూడదని అనుకుంటూ ఉంటాడు పార్ధు. ఇంతలో భానుమతి అందంగా రెడీ అయి లోపలికి వస్తుంది. ఈ చీరలో, నగల్లో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావని ఆమెను పొగుడుతాడు పార్ధు. నాకు మాత్రం నరకం కనిపిస్తోందని, ఈ నగలు బాగా బరువుగా ఉన్నాయని, పైగా గుచ్చుకుంటున్నాయని అమాయకంగా అంటుంది భానుమతి.
వీటిని తీసేయొచ్చా అని భాను అడగ్గా సరేనని అంటాడు పార్ధు. నాకు తీయడం రాదని, మీకు హెల్ప్ చేయండి అని అంటుంది భానుమతి. నగలు తీస్తుండగా పార్ధు బాధపడతాడు. ఆ నగల్ని ఎందుకు అలా చూస్తున్నావని పార్ధుని అడుగుతుంది భానునమతి. ఆ నగలు మా అమ్మవని చెబుతాడు పార్ధు. ఆ మాటలు విన్న భాను.. వెంటనే ఆ నగల్ని కళ్లకు అద్దుకుని దండం పెట్టుకుంటుంది. అత్తయ్య గారి నగలని తెలియక ఈ నగల వల్ల ఇబ్బందిగా ఉందని, తప్పుగా మాట్లాడానని అంటుంది భానుమతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











