Bhanumathi May 15th Episode: బలరామ్ ఆస్తిపై శక్తి కన్ను, చేపల పులుసు ఇరగదీసిన భానుమతి..స్వాతికి మొట్టికాయలు

ఫస్ట్ నైట్ రోజున తన తల్లి నగలు చూసి బాధపడతాడు పార్ధు. వాటి గురించి వివరిస్తుండగా పార్ధు ఒడిలో భానుమతి నిద్రపోతుంది. భార్యకు నిద్రాభంగం కాకుండా పార్ధు కూడా కూర్చొనే నిద్రపోతాడు. ఉదయాన్నే లేచి చూసే సరికి పార్ధు కూర్చొని నిద్రపోవడంతో భర్తను చూసి భానుమతి మురిసిపోతుంది. భానుమతి రెడీ అయి బయటికి వెళ్తుండగా పదే పదే లోపలికి లాగుతాడు పార్ధు. భానుమతిని ముగ్గు వేయమని ఆర్డర్స్ వేస్తుంది బామ్మ.

ముగ్గు వేయడం రాకపోవడంతో ఆడి కారు రింగులని వేస్తుంది భానుమతి. అది చూసి బామ్మ ఆమెపై మండిపడుతుంది. ముగ్గు చేయడం ఎలాగూ చేతకాదు కనీసం వంటైనా చేయమని చెప్పడంతో భానుమతి తలపట్టుకుంటుంది. అప్పు తీసుకున్న ఓ రైతు అప్పు కట్టలేకపోవడంతో అతని పొలాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటాడు దుర్గ. ఈ విషయం తెలిసిన బలరామ్ తన తమ్ముడిపై కోప్పడి ఆ రైతుకి 25 లక్షలు ఇచ్చి పొలం తీసుకుంటాడు. అది చూసిన శక్తి రగిలిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 15వ తేదీ ఎపిసోడ్‌ 58లో ఏం జరిగిందంటే?

Bhanumathi Serial May 15th 2025 Episode 58 Here is Today s full story

భానుమతికి ఫస్ట్ నైట్ అప్పుడు ఇచ్చిన గిఫ్ట్ తీసుకొచ్చి ఓపెన్ చేయమని చెబుతాడు పార్ధు. ఈ గిఫ్ట్ ఓపెన్ చేసే టైమొచ్చిందని పార్ధు చెప్పగా.. ఇప్పుడు నా టైం బాలేదని ఏడుస్తుంది భానుమతి. ఈ గిఫ్ట్ ఓపెన్ చేయడానికి ఇదే కరెక్ట్ టైమని, ఓపెన్ చేసి చూడమని చెబుతాడు పార్ధు. అది ఓపెన్ చేసి చూడగా అందులో మొబైల్ ఉండటంతో భానుమతి సర్‌ప్రైజ్ అవుతుంది. ఇంత పెద్ద ఫోనా? ఇది కొనడానికి ఎంత ఖర్చు అయ్యుంటుందో కదా? అని పార్ధుతో అంటుంది భానుమతి. అంత పెద్ద ఖర్చు కాదులే 50 వేలని అంటాడు పార్ధు. 50 వేలు ఉంటే మా అమ్మ ఇంటిని ఆరు నెలలు నడిపిస్తుందని చెబుతుంది భానుమతి.

నా భార్య చేతుల్లో ఈ మాత్రం ఫోన్ లేకపోతే ఎలా చెప్పు అని పార్ధు ప్రశ్నిస్తాడు. మనిద్దరం ముందు ఓ సెల్ఫీ దిగుదామని, ఆమెను టచ్ చేయడంతో భానుమతి షాక్ అవుతుంది. నువ్వు మీ అమ్మకి ఫోన్ చేసి ఎలా వంట చేయాలో తెలుసుకోమని సలహా ఇస్తాడు పార్ధు. తను మాత్రం చేపల్ని కట్ చేసి తీసుకొస్తానని అంటాడు. మరోవైపు.. భర్తను బలవంతంగా లోపలికి తీసుకొచ్చిన శక్తి అతనిపై మండిపడుతుంది. బలరామ్ చేతుల కింద బానిసలా ఎన్నాళ్లు బతుకుతావని నిలదీస్తుంది.

వసూలు కానీ మొండి బాకీకి బదులుగా పొలం రాయించుకుని వచ్చిన మిమ్మల్ని మీ అన్న తప్పు చేసినవాడిలా చిత్రీకరించాడని, అతను మాత్రం నాలుగు మాటలు చెప్పి 25 లక్షలు కాజేసి దేవుడని పొగిడించుకున్నాడని అంటుంది. కష్టం మీది, సుఖం అతనిది అని దుర్గతో అంటుంది. కాళ్ల దగ్గర మీరు సింహాసనంపై అతను అని రగిలిపోతుంది. ఆ శారద కింద నేను, ఆ పార్ధు కింద చరణ్ .. ఎన్నాళ్లు చాకిరీ చేయాలని ప్రశ్నిస్తుంది. మన ఆస్తి 20 కోట్లు, మీ అన్నయ్య ఆస్తి 100 కోట్లు ఉంటుందని దుర్గ చెప్పడంతో శక్తి రగిలిపోతుంది.

నా భర్త కష్టపడి తెచ్చిన పొలం పేపర్లను, నా కొడుకు చేతికి ఇచ్చి తన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని చెబుతుంటే నా గుండె రగిలిపోతోందని చెబుతుంది శక్తి. ఇక నుంచి కథను నేను నడిపిస్తానని మీరు కామ్‌గా ఉండమని భర్త, కొడుకులకు తేల్చిచెబుతుంది శక్తి. ఇంతలో చిత్ర వచ్చి పొద్దున్నే క్లాస్ మొదలుపెట్టావా అని మండిపడుతుంది. భర్తను, బిడ్డను వదిలి ఇది కొంపలో చేరిందని చిత్రకు క్లాస్ పీకుతుంది శక్తి. ఇప్పుడు మనం దర్జాగానే ఉన్నామని చిత్ర చెప్పగా.. మీ పెదనాన్నతో పోల్చుకుంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నామని అంటుంది శక్తి. ఏదో ఒక రోజున నేను మంచి ప్లాన్ వేస్తానని, దానిని మీరంతా అమలు చేస్తే .. ఈ సామ్రాజ్యం మన చేతికి చిక్కుతుందని చెబుతుంది.

ప్రమీలకి భానుమతి ఫోన్ చేసి నాకు జీపబ్బాయి ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చాడని చెప్పడంతో మా ఆయన అని చెప్పమని కూతురికి క్లాస్ పీకుతుంది ప్రమీల. నువ్వు అక్కడ సంతోషంగా ఉంటే చాలని అంటుంది ప్రమీల. ఈ మధ్యన నాకు పెద్ద కష్టం వచ్చిందని అంటుంది భానుమతి. బామ్మగారు నన్ను చేపల కూర చేయమని చెప్పిందని, కానీ నాకు ఏ కూరలు రావు కదా అని బాధపడుతుంది. ఇదంతా నా వల్లే వచ్చిందని, ఎప్పుడూ పుస్తకాలు పట్టుకుని తిరిగే నీతో అప్పుడప్పుడు కాస్త గరిట తిప్పిస్తే బాగుండేదని అంటుంది ప్రమీల.

చేపల కూర ఎలా చేయాలో నాకు ఫోన్‌లో చెప్పు నేను ఇక్కడ చేసేస్తానని అంటుంది భానుమతి. తల్లి డైరెక్షన్ మేరకు చేపల కూర చేస్తుండగా భువన, చిత్రలు అది చూసి షాక్ అవుతారు. భానుమతిని ఇరికించాలని అనుకున్న భువన.. వెంటనే దానిని ఫోన్‌లో వీడియో తీస్తుంది. ఇంతలో బాబూరావు ఆమెకు ఫోన్ చేయడంతో బయటికి వెళ్తుంది. నాకు తెలియని అంత అర్జెంట్ ఫోన్ కాల్ ఎవరో అని ఆమె వెనకే వెళ్తుంది చిత్రం. చేపల కూర వాసన చూసిన భానుమతికి చాలా సంతోషం కలుగుతుంది.

పొలం కొలతలు వేయించమని పార్ధుకి చెప్పి పంపిస్తాడు బలరామ్. ఇంతలో శారద వచ్చి ఆ పొలం పొలిమేరకు అవతల వైపు ఉందని పార్ధుని అక్కడికి పంపించొద్దని చెబుతుంది. మూడు రాత్రులు కూడా పూర్తి కాకుండా బిడ్డ పొలిమేర దాటి వెళ్లడం మంచిది కాదని చెప్పడంతో బలరామ్ కూడా సరేనని అంటాడు. ఆ వెంటనే చరణ్‌ను పిలిచి ఆ పని చేయమని చెబుతాడు బలరామ్. బాబూరావుని వెతుక్కుంటూ భువన వెళ్తుంది. నీకు 3 లక్షలు ఇస్తాను, జీవితంలో నువ్వు కనిపించకూడదని చెబుతుంది. బాబూరావుతో మాట్లాడి భువన వెళ్తుండగా పార్ధు చూసి వాడితో మాట్లాడతాడు. ఆ అమ్మాయి ఎవరో గట్టిగా వెతకమని బాబూరావుకు పార్ధు వార్నింగ్ ఇస్తాడు.

భానుమతికి ప్రమీల ఫోన్ చేసి నేను, నాయనమ్మ అక్కడికి వస్తున్నామని చెబుతుంది. చేపల పులుసు ఎలా ఉందని విశేషాలు కనుక్కుంటూ ఉండగా శక్తి అక్కడికి వస్తుంది. తన ముందు దర్జాగా ఊయల ఊగుతున్న భానుమతిని చూసి శక్తి రగిలిపోపతుంది.

More from Filmibeat

Read more about: bhanumathi sai kiran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X