Bhanumathi May 17th Episode: ప్రమీలను అవమానించిన శాంభవి.. గడ్డిపెట్టిన శారద, భాను కంటతడి
వడ్డీ అడగటానికి వెళ్లిన ఇంట్లో ఓ వ్యక్తి నేను కూడా మీ నాన్నలాగా సెకండ్ సెటప్ పెట్టుకున్నానని చెప్పడంతో పార్ధు రగిలిపోతాడు. ఇంటికొస్తుండగా శారద ఎదురురావడంతో ఆమెపై మండిపడతాడు. కొడుకుని చూసిన బలరామ్ ఏం జరిగిందని అడగ్గా సూరి జరిగినదంతా చెబుతాడు. ఎప్పుడూ కోపంగా చూడని భర్త అలా ఉండేసరికి ఏం జరిగిందని అడగటంతో భానుమతిపై కోప్పడతాడు పార్ధు. ఒంటరిగా బాధపడుతున్న భానుమతికి సారీ చెప్పి తనని భోజనం చేయడానికి తీసుకెళ్తాడు.
చేపల పులుసు ఎలా ఉందో చెప్పమని ఇంట్లో వాళ్లందరినీ అడగ్గా అందరూ బాగుందని చెప్పడంతో భానుమతి ఊపిరి పీల్చుకుంటుంది. భానును ఇరికించేందుకు తాను తీసిన వీడియోను బయటపెట్టాలని భువన అనుకునేలోగా మా అమ్మను అడిగి చేశానని భానుమతి చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 17వ తేదీ ఎపిసోడ్ 60లో ఏం జరిగిందంటే?

ఫోన్‌లో మా అమ్మని అడిగి చేపల పులుసు చేశానని భానుమతి నిజం చెప్పడంతో బలరామ్ ఫ్యామిలీ షాక్ అవుతుంది. అన్నయ్య కోడలికి ముగ్గులే కాదు, వంటలు కూడా రావని కౌసల్యని రెచ్చగొడుతుంది శాంభవి. ఫోన్‌లో వాళ్ల అమ్మని అడిగి, ఇక్కడ చేపలు కడిగి, అక్కడ ఆ ప్రమీల సలహా సూచనలతో వంట చేసిందని మండిపడుతుంది. అదంతా నిజమే కానీ చేపలు కడిగింది నేను కాదు జీపబ్బాయి అని చెబుతుంది భానుమతి. ఆ మాటలతో పార్ధు షాక్ అవుతాడు.
భానుమతి చేపల కూరలో నిజాయితీగా పాస్ కాలేదని, కాపీ కొట్టి పాస్ అయ్యిందని భువన అంటుంది. వంట వచ్చా అని అడిగితే వచ్చు అని అబద్ధం చెప్పి పుట్టింటికి ఫోన్ చేసి కూర వండుతావా? అని మండిపడుతుంది పెద్దావిడ. భానుమతిని చూసి బావగారు మురిసిపోతున్నారని, కానీ ఆమె ఏం నేర్చుకోలేదని అంటుంది శక్తి. ఈ విషయాలేవీ పట్టించుకోవద్దని భోజనం చేయమని బలరామ్ అంటాడు. తన తండ్రి బాధపడటంతో పార్ధు కూడా బాధపడతాడు.
నన్నెంత మోసం చేశావ్, నువ్వు వంట వచ్చిందని అబద్ధం ఆడినందుకు శిక్షగా నీకు వంట వచ్చే వరకు నువ్వు ఒంటిపూట భోజనమే చేయాలని భానుమతికి కౌసల్య శిక్ష విధిస్తుంది. ఆ మాటలతో భానుమతి, పార్ధు షాక్ అవుతారు. డైనింగ్ టేబుల్ మీద కాకుండా కింద మూల కూర్చొని తినమడని అవమానిస్తుంది పెద్దావిడ. అది చూసి శక్తి, శాంభవి, భువనలు సంతోషిస్తారు. భానుమతి పరిస్ధితి చూసి పార్ధు, శారద బాధపడతారు. అయినప్పటికీ కూర చాలా బాగుందని భానుమతి తినేస్తుంది. ఇంతలో ప్రమీల, కుమారిలు బలరామ్ ఇంటికి వస్తారు. వాళ్లు వచ్చేసరికి భానుమతి కింద కూర్చొని తింటూ ఉండటం చూసి బాధపడతారు. అది చూసిన శారద వాళ్ల దగ్గరికి వెళ్లి జరిగింది చెబుతుంది.
మా అత్తగారికి వంట చేయడం వచ్చని భానుమతి అబద్ధం చెప్పిందని మా అత్తగారు దానికి శిక్ష వేశారని అంటుంది శారద. ఏం పర్లేదని, నా కూతురు ఇన్నాళ్లు కింద కూర్చొనే భోజనం చేసిందని పర్లేదని అంటుంది ప్రమీల. భార్యకు తన ముందే అవమానం జరగడంతో పార్ధు బాధపడుతుంటాడు. బెడ్‌రూంలోకి వచ్చిన భార్యని చూసి బామ్మ నిన్ను కింద కూర్చోమన్నందుకు బాధగా లేదా అని అడుగుతాడు పార్ధు. టేబుల్ మీద కూర్చొని తింటే కొంచెం తక్కువ తిన్నానని.. కానీ నేల మీద కడుపు నిండా తినేశానని అంటుంది భానుమతి. ఆ మాటలతో పార్ధు షాక్ అవుతాడు. అమ్మ అవకాయ కలిపి పెట్టాక ఆఖరిలో అన్నం కలుపుకుని తింటే అమృతంలా ఉంటుందని చెబుతుంది భానుమతి. అవకాయ అన్నం తింటోనో లేదోనని బాధతో ఇలా వస్తున్నానని చెప్పడంతో పార్ధు నవ్వేస్తాడు.
అవకాయ పచ్చడి తయారు చేస్తున్న ప్రమీలను ఇలా ఇంటింటికి తిరిగి అవకాయ పచ్చడి పెట్టినందుకు ఎంత తీసుకుంటావని అడుగుతుంది శాంభవి. ఆ మాటలతో ప్రమీల, కుమారి, భానుమతి బాధపడతారు. అయినవాళ్ల ఇంట్లో అభిమానంతో పెడుతున్న పచ్చడికి డబ్బులు ఎలా తీసుకుంటానని అంటుంది ప్రమీల. వేరే వాళ్లకి పచ్చడి పెడితే ఎంత తీసుకుంటావని గుచ్చి గుచ్చి అడుగుతుంది శాంభవి. నా కష్టానికి తగ్గట్టు నేను అడుగుతానని, వాళ్ల ఇష్టానికి తగినట్లు వాళ్లు ఇస్తారని చెబుతుంది ప్రమీల. ఈ రోజుల్లో కష్టాన్ని చూసి వెక్కిరించేవారే కానీ, డబ్బులిచ్చే వాళ్లు లేరని అంటుంది జయంతి.
అయినా ఇలాంటి పనులు చేస్తూ ఇద్దరు పిల్లల్ని, ఏ పని చేయని ఓ తాగుబోతు భర్తని ఇంత దూరం లాక్కొచ్చావని సూటిపోటి మాటలు అంటుంది కౌసల్య. వీళ్లంతా ఎందుకిలా మాట్లాడుతున్నారు? అయినా అమ్మవాళ్లు ఎందుకిలా మాటలు పడుతున్నారని మనసులో అనుకుంటుంది భానుమతి. బయట ఎవరితోనూ ఒక్క మాట పడని అమ్మ నా కోసం ఇన్ని మాటలు పడుతుందని బాధపడుతుంది భానుమతి. నీకు మా అమ్మలాగా అవకాయ పచ్చడి పట్టడం వచ్చా అని శాంభవిని అడుగుతుంది భానుమతి. ఛీ ఛీ అలాంటి పనులు నేనేందుకు చేస్తానని అసహ్యించుకుంటుంది శాంభవి. అవసరమైతే మీ అమ్మలాంటి వాళ్లకి వందో, వెయ్యో ఇచ్చి వాళ్లతోనే పెట్టిస్తానని ప్రమీలను అవమానిస్తుంది.
ఈ మాటలు విన్న శారద.. నువ్వు పచ్చడి పెట్టేవాళ్లనే కాదు, పచ్చడిని కూడా అవమానిస్తున్నావని మండిపడుతుంది. ప్రమీల ఈ ఇంటి వియ్యపురాలని, ఆమెకు విలువ ఇవ్వకపోతే మన పరువే పతనమైపోతుందని అంటుంది. తర్వాత ప్రమీల పచ్చడి పట్టడం పూర్తి చేసి జాడీ తీసుకురమ్మని చెబుతుంది. ఈ ఇంట్లో నా బిడ్డను నానా మాటలు అనేవాళ్లు ఎక్కువయ్యారని బాధపడుతుంది ప్రమీల. వంటగదిలో జాడీ అందకపోవడంతో భానుమతి నానా తంటాలు పడుతుంది. ఇంతలో పార్ధు కనిపించడంతో భర్తకి కన్నుకొట్టి లోపలికి పిలుస్తుంది.
భానుమతి ప్రేమగా పిలిచేసరికి ముద్దు పెడుతుందేమోనిన సంబరపడిపోతాడు పార్ధు. ముద్దుపెట్టమని బుగ్గని ఆమెకు దగ్గరికి తీసుకెళ్లడంతో భానుమతి షాక్ అవుతుంది. త్వరగా జాడీ ఇస్తే నేను వెళ్తానని లేదంటే బామ్మగారు మండిపడతారని అంటుంది. నువ్వు నన్ను లోపలికి పిలిచింది జాడీ కోసమా? అని షాక్ అవుతాడు పార్ధు. జాడీ అందకపోవడంతో పార్ధు నానా తంటాలు పడతాడు. నేను వెళ్లి డైనింగ్ హాల్‌లో కుర్చీ తీసుకుని వస్తానని లోపలికి వెళ్తుండగా భానుమతిని ఆపుతాడు పార్ధు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











