Bhanumathi May 2nd Episode : కథలోకి కొత్త క్యారెక్టర్.. భానుమతి గుట్టు తెలుసుకున్న వేదవతి.. షాక్‌లో ప్రమీల

ఉదయాన్నే మెట్ల మీద నిద్రపోతున్న భానుమతిని చూసి ఏం జరిగిందని అడుగుతుంది శారద. బామ్మగారి గురక దెబ్బకి నిద్రపట్టలేదని అంటుంది భానుమతి. ఆ సంగతి మరిచిపోయానన్న శారద.. వ్రతానికి రెడీ అవ్వమని చెబుతుంది. పోలీస్ స్టేషన్ నుంచి బలరామ్ సంతకం కోసం కానిస్టేబుల్ రావడంతో రగిలిపోతాడు. చట్టం ముందు నేనింకా దోషినేనని , ఎంత మరిచిపోదామన్న ఆ అవమానం నన్ను వెంటాడుతూనే ఉందని ఫైర్ అవుతాడు బలరామ్. ఆ అమ్మాయెవరో వీలైనంత త్వరగా కనుక్కోమని పార్ధుకు చెప్పడంతో భువన, భానుమతి, శాంభవిలు వణికిపోతారు.

నీ వల్లే నా కొడుక్కి ఇలాంటి పరిస్ధితి వచ్చిందని బలరామ్ తల్లి .. భానుమతిని సూటిపోటీ మాటలతో బాధపెడుతుంది. వ్రతానికి అత్తగారు స్వయంగా రెడీ చేయడంతో మురిసిపోతుంది భానుమతి. అత్తాకోడళ్లు కలిసి కిందకి దిగి వస్తుండగా ప్రమీల చూసి సంబరపడిపోతుంది. మనతో ఇంట్లో వాళ్లు అన్ని పనులు చేయించుకుంటున్నారు కానీ మనకి విలువ ఇవ్వడం లేదని రగిలిపోతుంది భువన. పనిమనిషి స్వాతిని ఎలాగైనా లొంగదీసుకోవాలని చరణ్ ట్రై చేస్తుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 2వ తేదీ ఎపిసోడ్‌ 47లో ఏం జరిగిందంటే?

Bhanumathi Serial May 2nd 2025 Episode 47 Here is Today s full story

బలరామ్ ఇంటికి వేదవచ్చి ఆయనని పిలుస్తుంది. ఆ మాటలతో బలరామ్ బయటికొచ్చి ఎలా ఉన్నావని అడుగుతుంది. ఈ అన్నయ్యని చూడాలని ఎప్పుడూ అనుకోలేదా? అని బలరామ్ ప్రశ్నించగా.. ఇంట్లో పరిస్ధితులన్నీ నీకు తెలుసు కదా అవన్నీ నా చుట్టూ అడ్డుగోడల్లా తయారయ్యానని అంటుంది వేదవతి. అవి దాటుకుని రావాలంటే నేను పెద్ద యుద్ధమే చేయాలని చెబుతుంది. ఇంతకీ కొత్త పెళ్లి కొడుకు ఎక్కడ అని వేదవతీ ప్రశ్నించగా.. పార్ధుని పిలుస్తాడు బలరామ్. వేదవతిని చూసి పార్ధు చాలా సంతోషిస్తాడు. ఇంతకీ నీ పెళ్లాం ఎక్కడ? అని వేదవతి అడగ్గా బస్సమ్మాయి అని పార్ధు గట్టిగా పిలుస్తాడు. అది విని అంతా నవ్వుకుంటారు.

ఆ పేరేంటీ అని వింతగా అడుగుతుంది వేదవతి. భానుమతిని చూడగానే పేరు చాలా బాగుందని, ఇద్దరూ చాలా బాగున్నానని అంటుంది వేదవతి. ఇద్దరూ కలిసి వేదవతి ఆశీర్వాదం తీసుకుంటారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివని నీ పెళ్లిని ఆపడానికి, నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎవరో గట్టిగానే ప్రయత్నించారని భానుమతితో చెబుతుంది వేదవతి. ఆ మాటలతో భానుమతి, భువనలు వణికిపోతారు. కానీ అలాంటివన్నీ దాటుకుని ఇంత గొప్పింటికి కోడలిగా అడుగుపెట్టావని చెబుతుంది వేదవతి.

బావగారు పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు ఈ వేదవతి కూడా చాలా ఎంక్వైరీలు చేయించిందని మనసులో అనుకుంటుంది శక్తి. ఈ పని చేసిందెవరో అప్పుడు దొరకలేదు.. కానీ ఇప్పుడు ఎదురుగా ఉన్నా గుర్తించడం లేదని అనుకుంటుంది. వేదవతి మాటలు విన్న ప్రమీల.. పెళ్లిలో జరిగిందంతా గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఇంతలో తల్లిని వెతుక్కుంటూ వసు వెళ్తుంది. మీ అక్క చేసిన పని గురించి ఇంట్లో వాళ్లకి తెలిస్తే మనల్ని వాళ్లు మాటలతో వదిలేయరని, పాతేస్తారని అంటుంది. అవన్నీ వీళ్లకు ఎలా తెలుస్తాయని వసు అడుగుతుంది. నిజం నిప్పులాంటిదని, అరచేతిలో నిప్పుని పెట్టుకుని దాయలేమని అంటుంది ప్రమీల. ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటపడిపోతుందని చెబుతుంది. ఈ మాటలు విన్న వేదవతి షాక్ అవుతుంది.

భానుమతి వీళ్లకి గోతులు తీస్తే.. బలరామ్ గారి కుటుంబం మాత్రం ఆమెను చాలా గొప్పగా చూసుకుంటోందని అంటుంది. ఆ రోజు పెళ్లి ఆపడానికి పోలీసులకు ఫోన్ చేసింది? బలరామ్ గారు అంత అవమానం ఎదుర్కోవడానికి కారణం భానుమతేనని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని వసుతో అంటుంది ప్రమీల. ఈరోజు వీళ్లంతా మీ అక్కని ఎంత గొప్పగా చూసుకుంటున్నారో? నిజం బయటపడిన రోజున మీ అక్కని అంత నీచంగా చూస్తారని అంటుంది. ఈరోజు వీళ్లంతా ఎంత అభిమానిస్తున్నారో? నిజం తెలిసిన రోజు అంత అవమానిస్తారని అంటుంది ప్రమీల. అందుకే భానుమతి జీవితం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో? ఏ మలుపు తన జీవితం ముగింపుకు తీసుకెళ్తుందోనని నాకు భయంగా ఉందని చెబుతుంది ప్రమీల.

నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోవద్దని అలాంటిదేమీ జరగదని తల్లితో అంటుంది వసు. కాబోయే మామగారింటికి కొత్త కోడలు నిప్పు పెట్టిందన్న మాట అని అనుకుంటుంది వేదవతి. మంచి మనుషుల్ని నడి వీధిలోకి లాగేసిందని భానుమతి మీద రగిలిపోతుంది. తర్వాత బలరామ్ కుటుంబ సభ్యులు .. పార్ధు- భానుమతిలతో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తారు. పూజ మధ్యలో భానుమతి కునుకు పాట్లు తీస్తుండటంతో అంతా ఆమెను చూస్తారు. కాసేపటికీ పార్ధు భుజంపై వాలిపోతుంది భానుమతి.

అది చూసిన బలరామ్ తల్లి.. పూజలు చేసేది నిద్రపోవడానికా? పుణ్యం సంపాదించడానికా? అని మండిపడుతుంది. నువ్వు సైలెంట్‌గా ఉండు నేను లేపుతాను కదా అని అంటాడు పార్ధు. పార్ధు మాటలతో భానుమతి ఉలిక్కిపడి అందరికీ క్షమాపణలు చెబుతుంది. భానుమతిని ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నారని.. కానీ గాజు బొమ్మ పగిలితే మిగిలే ముక్కలు వీళ్ల గుండెల్లో గుచ్చుకుంటాయని అనుకుంటుంది వేదవతి. కోడల్ని చూసి మురిసిపోతున్నారని కానీ ఇదే కోడలు వీళ్ల జీవితంలో ఒక ప్రళయం సృష్టించిందని తెలిస్తే వీళ్లంతా ఏమైపోతారోనని బాధపడుతుంది.

పూజ పూర్తయిన తర్వాత దంపతులంతా పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. భానుమతిని ఆశీర్వదించిన వేదవతి.. ఈరోజు ఈ కుటుంబం చాలా సంతోషంగా ఉందని, అది అలాగే ఉండాలంటే ఈ ఇంటి కోడలి మీద చాలా బాధ్యత ఉంటుందని చెబుతుంది. కోడలి నడవడిక బాగుంటేనే ఆ కుటుంబం ఎప్పుడూ నవ్వుతుంటుందని చెబుతుంది. అలాంటి నిజాయితీ గల కోడలే ఈ కుటుంబంలోకి అడుగుపెట్టిందని నేను అనుకుంటున్నానని అంటుంది.కోడలు కుటుంబానికి వెన్నెముకలా ఉండాలని, వెన్నుపోటు పోడిచేలా ఉండకూడదని వేదవతి అనడంతో అంతా షాక్ అవుతారు.

వేదవతి మాటలతో ప్రమీలకు అనుమానం వస్తుంది. తను ఇంకా చిన్నపిల్ల అని నువ్వు చెప్పే మాటలు అర్ధం కావని వేదవతితో అంటాడు బలరామ్. కొందరు చూడటానికి చిన్నపిల్లల్లా ఉంటారని కానీ వారు పెద్ద పెద్ద విషయాల్ని కూడా అర్ధం చేసుకుంటారని చెబుతుంది వేదవతి. భానుమతి చిన్నపిల్లే అయినా అన్ని అర్ధం చేసుకుంటుందని అంటుంది. నువ్వు చెప్పింది నిజమేనని.. ఏం చెప్పినా చాలా త్వరగానే అర్ధం చేసుకుంటుందని చెబుతుంది శారద. పూజ ముగిసింది కదా ఇక భోజన ఏర్పాట్లు చేయమని అంటుంది బలరామ్ తల్లి.

పార్ధుని వెతుక్కుంటూ వచ్చిన కోటి.. బయటికి వెళ్తున్నట్లు చెప్పడంతో పార్ధు సరేనంటాడు. కోటిని పిలిచిన పార్ధు అతనిని వెనక్కి పిలిచి డబ్బులిస్తాడు. కొంచెం తక్కువ తాగండి నాన్నకి తెలిస్తే బాగుండదని అంటాడు. మందు కోసమే మీ మావగారు చాలా పర్ఫార్మ్ చేస్తున్నారని సూరి సెటైర్లు వేస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Read more about: bhanumathi sai kiran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X