Bhanumathi May 5th Episode : నిజం దాచిన వేదవతి.. దేవకన్యలా భానుమతి, పార్థులో రగులుతున్న కోర్కెలు

భానుమతి భోజనం చేసేందుకు కూర్చోగా.. పార్ధు తిన్న తర్వాతే నువ్వు తినాలని చెప్పి అరటి ఆకులో భోజనం వడ్డించమని చెబుతుంది బలరామ్ తల్లి. ఎంగిలి విస్తరిలో తినడం ఎవరికైనా కష్టమే కాబట్టి ఒకపక్క భోజనం చేసి ఆ విషయాన్ని భానుమతికి చెబుతాడు పార్ధు. నీలో ఉత్సాహం కనిపించడం లేదని బలరామ్‌తో అంటుంది వేదవతి. నేను తలదించుకున్నానని ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది కానీ నన్ను పోలీస్ స్టేషన్‌కు పంపించిన అమ్మాయి అడ్రస్ తెలిస్తే చాలని అంటాడు బలరామ్.

ఇదంతా భానుమతి జాతకం వల్లే జరిగిందని తల్లి నానామాటలు అనడంతో బలరామ్ మండిపడతాడు. ఆ సమయంలో తనను గుచ్చిగుచ్చి చూస్తున్న వేదవతిని చూసిన భానుమతి టెన్షన్ పడుతుంది. అత్తారింట్లో జాగ్రత్తగా ఉండమని భానుమతికి చెప్పి వెళ్లిపోతుంది ప్రమీల. ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న భానుమతి దగ్గరికి వేదవతి వచ్చి పెళ్లి ఎందుకు ఆపావని నిలదీసేసరికి భాను షాక్ అవుతుంది. ఇంత మంచి కుటుంబానికి కోడలయ్యే అదృష్టాన్ని ఎందుకు కాదనుకున్నావని ప్రశ్నిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 5వ తేదీ ఎపిసోడ్‌ 49లో ఏం జరిగిందంటే?

Bhanumathi Serial May 5th 2025 Episode 49 Here is Today s full story

నీ స్వార్ధం కోసం ఈ కుటుంబం చేత కన్నీరు పెట్టించావని భానుమతికి క్లాస్ పీకుతుంది వేదవతి. నేను ఏది కావాలని చేయలేదని భానుమతి చెప్పడంతో, ఏదో నిస్సహాయ పరిస్ధితి నిన్ను అలా చేయించిందని వేదవతి అంటుంది. ఏదో బలమైన కోరిక నిన్ను తప్పు చేయడానికి ఊసిగొల్పిందని, అదృష్టమనేది రోజూ ఇంటి తలుపు తట్టదని.. దానిని మన జీవితంలోకి ఆహ్వానించకపోతే ఆ అదృష్టం మళ్లీ మన జీవితంలోకి రాదని చెబుతుంది. నువ్వు ఆ అదృష్టాన్ని కాలదన్నుకున్నా.. అది ఇంకా నీ కొంగుకే ముడిపడి ఉందని, దానిని విప్పి విసిరిపారేయొద్దని భానుమతికి వేదవతి వార్నింగ్ ఇస్తుంది.

నేను నిజం చెబితే మా వాళ్లకి కాస్త ఊరట కలగొచ్చని , కానీ ఆ తర్వాత నీ జీవితం నాశనమవుతుందని అంటుంది వేదవతి. పార్ధు మనసు బాధపడుతుందని, ఒక జంటను విడదీశామని మళ్లీ ఈ కుటుంబమే బాధపడుతుందని చెబుతుంది. నేను నోరు తెరవడం వల్ల ఇన్ని అనర్ధాలు జరుగుతాయి కాబట్టి నాకు తెలిసిన నిజం నాలోనే సమాధి చేయాలని అనుకుంటున్నానని అంటుంది వేదవతి. దాంతో ఆమెకు భానుమతి చేతులెత్తి మొక్కుతుంది. నీకు దొరికిన ఇంత గొప్ప జీవితాన్ని వృథా చేసుకోవద్దని, రాబోయే మంచి భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని చెబుతుంది వేదవతి.

సత్యనారాయణ వ్రతం ముగియడంతో ఇక ఇంటికి వెళ్తానని బలరామ్‌తో చెబుతుంది వేదవతి. ఎప్పుడో ఒకసారి వస్తావు, నాలుగు రోజులు ఉండమని అడుగుతాడు బలరామ్. ఇంట్లో పరిస్ధితులు నీకు తెలుసు కదా, మరోసారి వీలు చూసుకుని వస్తానని బలరామ్‌కి చెబుతుంది వేదవతి. తర్వాత వేదవతికి పసుపు కుంకుమ పెట్టి పంపిస్తాడు బలరామ్. అన్నయ్య, వాళ్ల అమ్మ ఆశీర్వాదం తీసుకుని వేదవతి బయల్దేరుతుంది.

పార్ధు శోభనానికి ఏర్పాట్లు చేసి గదిని బాగా అలంకరిస్తుంది బలరామ్ కుటుంబం. భానుమతిని అందంగా రెడీ చేసి ఆమెకు దిష్టి చుక్క పెడుతుంది శారద. బెడ్‌రూంలో టెన్షన్ పడుతుంటాడు పార్ధు. మొదటి రాత్రి జీవితంలో గుర్తుండిపోయేలా ఉండాలని, నాకెంటి ఇంత టెన్షన్‌గా ఉందని అనుకుంటాడు. అమ్మాయి టెన్షన్ పడాలి కానీ.. అబ్బాయిలు టెన్షన్ పడటమేంటీ అని అనుకుంటాడు పార్ధు.

మొదటి రాత్రి మీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజని భానుమతితో చెబుతుంది శారద. మూడు ముళ్లతో మొగుడు పెళ్లాలు సగం కలుస్తారని, మొదటి రాత్రితో పూర్తిగా ఏకమవుతారని అంటుంది. మగాడు కాస్త మొరటుగా ఉన్నా, ఆడది ఆనందంగా సర్దుకుపోవాలని చెబుతుంది శారద. ఈ కాలం పిల్లలకి ఏది చెప్పాల్సిన అవసరం లేదని, భానుమతి లాంటి వాళ్లకి లోకజ్ఞానం ఎక్కువేనని అంటుంది. మనం చెప్పకపోయినా వాళ్లే సర్దుకుపోతారని చెబుతుంది శక్తి. నా గురించి ఏం తెలుసని ఈమె ఇలా చెబుతుందని మనసులో అనుకుంటుంది భానుమతి.

భానుమతి నీకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్నట్లు అలా మాట్లాడుతున్నావేంటీ? అని శక్తిని అడుగుతుంది శారద. కొందరినీ అర్ధం చేసుకోవడానికి ఏళ్ల పాటు సహవాసం చేయాల్సిన అవసరం లేదని అంటుంది శక్తి. ఆ మాటలతో భానుమతి టెన్షన్ పడుతుండటాన్ని శారద గమనిస్తుంది. ఫస్ట్ నైట్ అనేది ప్రతి ఆడపిల్ల జీవితంలో జరిగేదేనని, పార్ధు ఇప్పుడు నీ భర్తని అంటుంది. భానుమతిపై బోల్డెంత ప్రేమను చూపించాలని సిగ్గు పడుతుంటాడు పార్ధు. బెడ్‌రూమ్‌లోకి వెళ్తుండగా బలరామ్ తల్లి, జయంతి, చిత్రలు భానుమతికి ఎదురొస్తారు. ఆడపిల్ల పరిస్ధితులకు తగినట్లుగా, భర్తకు అనుగుణంగా తనను తాను మలచుకోవాలని చెబుతుంది శారద.

అలిసిపోయి వచ్చిన భర్తతో ప్రేమగా ఉండు.. ఆదరించిన కుటుంబంతో బాధ్యతగా మెలుగు, ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటే ఏ సమస్యా రాదని అంటుంది శారద. ఒక్కసారి లోపలికి వెళ్తే జీవితానికి సరిపడా జ్ఞానం అదే వస్తుందని చెబుతుంది బలరామ్ తల్లి. ఇక సూక్తులు , సందేశాలు ఆపేసి దానిని లోపలికి పంపించమని మండిపడుతుంది. భానుమతి గదిలోకి వెళ్లడంతో ఇదంతా చూసిన శాంభవి, భువనలు రగిలిపోతారు. తెల్లచీర, పాల గ్లాసులో భానుమతిని చూసిన పార్ధు ముచ్చటపడతాడు. తలుపు గొళ్లెం పెట్టలేకపోవడంతో పార్ధు ఆమెకు హెల్ప్ చేస్తాడు.

అందరి ముందు నన్ను ఏవండి అని పిలువు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నన్ను జీపు అబ్బాయి అని పిలవమని చెబుతాడు పార్ధు. పాలు మొత్తం తాగేసిన భానుమతిని చూసి పార్ధు షాక్ అవుతాడు. ఆ పాలు మనం చెరిసగం తాగాలని చెప్పడంతో ఇంకో గ్లాస్ తీసుకొస్తానని అంటుంది భానుమతి. భార్య కోసం కొన్న బహుమతిని ఇచ్చి తర్వాత చూడమని చెబుతాడు పార్ధు. నీకు బాగా ఏం ఇష్టమంటే అమ్మ, కవితలు ఇష్టమని చెబుతుంది భానుమతి.

నాకు కూడా కవితలు ఇష్టమని పార్ధు చెప్పడంతో నా దగ్గర బోల్డెన్నీ కవితల పుస్తకాలు, కథల పుస్తకాలు ఉన్నాయని చెబుతుంది భానుమతి. ఆ వెంటనే బీరువాలో దాచిన కవితల పుస్తకాలు తీసుకొచ్చి వాటిని చదివి వినిపిస్తుంది. ఫస్ట్ నైట్ వేస్ట్ అయిపోతుందని, తన కలలన్నీ కల్లలు అవుతాయని బాధపడుతుంటాడు పార్ధు. కవితలు చెబుతున్న భానుమతిని చూసి పార్ధు చిరాకు పడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Read more about: bhanumathi sai kiran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X