Bhanumathi May 6th Episode : పార్థుని టచ్ చేయొద్దన్న భానుమతి , ఫస్ట్ నైట్ ఫెయిల్.. ప్రమీలలో టెన్షన్

నువ్వే పోలీసులకు ఫోన్ చేసి పెళ్లి ఆపావని నేను ఇంట్లో చెబితే నీ జీవితం ఏమవుతుందో ఆలోచించావా? అని భానుమతిని ప్రశ్నిస్తుంది వేదవతి. ఆ మాటలతో భానుమతి భయపడుతుంది. కానీ నేను అలాంటి పని చేయనని దీని వల్ల పార్ధు బాధపడతాడని, ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశామని తిరిగి ఈ కుటుంబమే బాధపడుతుందని అంటుంది వేదవతి. ఈ నిజం నాలోనే సమాధి చేస్తానని చెప్పడంతో వేదవతికి చేతులెత్తి మొక్కుతుంది భానుమతి.

భానుమతి - పార్ధుల ఫస్ట్ నైట్ కోసం అన్ని సిద్ధం చేస్తుంది బలరామ్ ఫ్యామిలీ. భానుమతిని ముస్తాబు చేస్తూ భర్తతో, కుటుంబంతో ఎలా ఉండాలో చెబుతుంది శారద. పార్ధు గదిలోకి వెళ్తున్న భానుమతిని చూసి రగిలిపోతుంది భువన. తెల్లచీరలో, పాల గ్లాసుతో దేవకన్యలా మెరిసిపోతున్న భానుమతిని చూసి పొంగిపోతాడు పార్ధు. కానీ ఆమెతో ఎలా గడపాలో తెలియక టెన్షన్ పడతాడు. నీకు ఏం ఇష్టమని చెప్పడంతో అమ్మానాన్న, కవితలంటే చాలా ఇష్టమని భాను చెప్పడంతో నాకు కూడా ఇష్టమని పార్ధు కూడా అంటాడు. దీంతో భానుమతి కబుర్లు చెబుతుండటంతో పార్ధు డిజప్పాయింట్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 6వ తేదీ ఎపిసోడ్‌ 50లో ఏం జరిగిందంటే?

Bhanumathi Serial May 6th 2025 Episode 50 Here is Today s full story

భానుమతి కవితలు చెబుతుండటంతో పార్ధు నిద్రపోతాడు. భానుమతి మంచం మీద కాకుండా నేలపై పడుకుంటుంది. మధ్యలో లేచిన పార్ధు.. కింద పడుకున్న భానుమతిని చూసి లేపుతాడు. ఉలిక్కిపడిన భానుమతి.. బంగారం లాంటి నిద్రను పాడు చేశావని మండిపడుతుంది. మంచం మీద పడుకోమని చెప్పడంతో మనిద్దరం ఒకే మంచం మీద పడుకోవచ్చా అని అమాయకంగా అడుగుతుంది. మనిద్దరం ఇప్పుడు భార్యాభర్తలమని, ఒకే గదిలో , ఒకే మంచం మీద పడుకోవాలని చెబుతాడు పార్ధు. నువ్వు పడుకోకపోతే నేను కూడా కిందే పడుకుంటానని వార్నింగ్ ఇవ్వడంతో భానుమతి సరేనని అంటుంది.

మా చెల్లిలాగా మీరు కూడా మీద కాలు వేయ్యరు కదా అని ప్రశ్నిస్తుంది భానుమతి. ఆ మాటలతో సిగ్గుపడ్డ పార్ధు.. భార్యాభర్తలు కాళ్లు చేతులు వేసుకుని పడుకున్నా పర్లేదని చెబుతాడు. నాకు కాళ్లు చేతులు వేస్తే అస్సలు నిద్రపట్టదని భానుమతి చెప్పడంతో పార్ధు షాక్ అవుతాడు. పార్ధుకి గుడ్‌నైట్ చెప్పి పడుకుంటుంది భానుమతి. భార్యనే చూస్తూ తను కూడా నిద్రపోతాడు. ఉదయాన్నే భగవంతుడికి దీపం వెలిగించిన ప్రమీల.. నా కూతురు ఆ గొప్పింటికి కోడలిగా వెళ్లిందని, అక్కడ అలవాట్లు, పద్ధతులు అన్నీ వేరని అది సంతోషంగా ఉండేలా చూడమని దండం పెట్టుకుంది ప్రమీల.

ఆమె మాటలు విన్న కోటి.. ఇంకా నీ కూతురు గురించి నువ్వు భయపడుతున్నావా? అని ప్రశ్నిస్తుంది. పెళ్లి వద్దు అనుకుంటూనే మెడలో తాళి కట్టించుకుందని, అలాంటిది మళ్లీ అక్కడ ఎలాంటి అనర్ధాలు సృష్టిస్తుందోనని భయపడుతుంది ప్రమీల. బెల్లం రుచి మరిగిన చీమకి, ధనం రుచి మరిగిన మనిషికి ఇంకా ఆశ పెరుగుతుందని అంటాడు కోటి. ఒకసారి వాటికి అలవాటు పడ్డాక వాటి నుంచి బయటపడలేరని చెబుతాడు. భానుమతి కూడా మెడలు, మిద్దెల్లో ఉండే సుఖానికి అలవాటు పడ్డాక ఇక ఎప్పటికీ వాటిని వదిలి వెళ్లాలనే ఆలోచనే రాదని అంటాడు. అందువల్ల నీకూతురు గురించి నువ్వు బెంగ పెట్టుకోవద్దని చెబుతాడు కోటి.

ఉదయాన్నే బలరామ్‌కి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది శారద. భానుమతి ఇంకా నిద్రలేవకపోవడంతో బలరామ్ తల్లి రగిలిపోతుంటుంది. పెళ్లి కార్యక్రమాలతో అలిసిపోయారని శారద నచ్చజెప్పాలని చూస్తుంది. పొద్దెక్కేవరకు పడుకుంటే ఇంటికే అరిష్టమని అంటుంది. వాడు మగాడు లేవలేడు.. ఈ పిల్లకి ఏమైందని నిలదీస్తుంది బలరామ్ తల్లి. కొత్తగా కోడలనే బాధ్యత తన భుజాల మీదకి వచ్చిందని కాస్తయినా గుర్తుండాలి కదా అని అంటుంది. అందరి కంటే ముందే లేచి ఇంటి పనులన్నీ మొదలు పెట్టాలి కదా అని చెబుతుంది బలరామ్ తల్లి.

ఆ అమ్మాయికి ఈ ఇల్లు, ఈ ఇంట్లో వాళ్లు కాస్త అలవాటు పడాలి కదా అని నచ్చచెబుతుంది శారద. అత్తారింటికి వెళితే పనులు చేయాలని భానుమతికి పుట్టింట్లో చెప్పలేదా అని బలరామ్ తల్లి రగిలిపోతుంది. అతి గారాభం చేసి కోడలిని నెత్తిన పెట్టుకోవద్దని వార్నింగ్ ఇస్తుంది. భానుమతిని లేపాల్సిందిగా శక్తి, శాంభవిలను పంపిస్తుంది.వాళ్లిద్దరూ డోర్ కొట్టి పిలుస్తుండగా కంగారుగా నిద్రలేస్తాడు పార్ధు.. అయితే భానుమతి తాళి, పార్థు చైన్‌కి చిక్కుకుంటుంది. బస్సు అమ్మాయికి మెలకువ వస్తే నేను ఏదో చేయబోయానని అపార్ధం చేసుకుంటుందని టెన్షన్ పడతాడు.

నా కూతురు జీవితాన్ని భానుమతి లాక్కుందని బాధపడుతుందంటే ఇలాంటి పనికిమాలిన పనులన్నీ నాతో చేయిస్తారా? అంటూ శాంభవి రగిలిపోతుంది. ఎలాగోలా భానుమతి తాళిని తప్పిస్తాడు పార్ధు. భార్యను చూసుకుని మురిసిపోతాడు. స్నానం చేసి భానుమతిని నిద్రలేపి స్నానం చేసి రమ్మని చెబుతాడు పార్ధు. భానుమతి స్నానం చేస్తూ తెలియక షవర్ ఆన్ చేయడంతో అది ఎలా ఆపాలో తెలియక కేకలు పెడుతుంది. దాంతో భయపడ్డ పార్ధు లోపలికి వెళ్లి ఆమెను గట్టిగా పట్టుకుంటాడు.

ఇంట్లో వాళ్లు శోభనం ఎలా జరిగిందని అడిగితే ఏమని సమాధానం చెప్పాలని టెన్షన్ పడతాడు పార్ధు. సిగ్గుపడుతున్నట్లుగా నటించి తల ఆడించమని భానుమతికి ట్రైనింగ్ ఇస్తాడు. ఏంటీ భానుమతి రాత్రంతా సవ్యంగా జరిగిందా అని శక్తిలా అడగమంటాడు. భానుమతి అచ్చం అలాగే అడుగుతుంది. ఆ వెంటనే పార్ధు సిగ్గుపడుతూ, జుట్టూ సరిచేసుకుంటూ, గోళ్లు గిల్లుకుంటూ, నేలపై కాలితో రాస్తుంటాడు. నేను చేసినట్లుగా చేయమని భానుమతితో చెబుతాడు పార్ధు. ఇలాంటివన్నీ నాకు తెలియదని నేను చేయనని తెగేసి చెబుతుంది భానుమతి.

అయినప్పటికీ పార్ధు వదిలిపెట్టకుండా భానుమతితో చేయిస్తాడు. ఏంటీ భానుమతి రాత్రంతా సవ్యంగా జరిగిందా? అని శక్తి అడిగినట్లుగా అడుగుతాడు. దానికి ఊ.. అంటూ తలాడిస్తుంది భానుమతి. అలా కాదు నేను చెప్పినట్లు చేయమని అంటాడు. కాస్త తలదించు, కొంచెం సిగ్గుపడు, కొంచెం నవ్వు, ఇప్పుడు సరేనని తలాడించు అని అంటాడు. ఆమె అలాగే చేయడంతో కాస్త రిలీఫ్ అవుతాడు పార్ధు. దయచేసి ఇలాగే చేసి కాస్త పుణ్యం కట్టుకోమ్మా అని భానుమతిని బ్రతిమలాడతాడు. దానికి ఆమె సరేనని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Read more about: bhanumathi sai kiran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X