Bhanumathi May 8th Episode : పనిమనిషిలా భానుమతి.. కోడలికి అండగా శారద, కుమిలిపోతున్న పార్ధు
ఫస్ట్ నైట్ ఎలా జరిగిందని ఇంట్లోవాళ్లు అడిగితే ఏం చెప్పాలో భానుమతికి పార్ధు ముందే ట్రైనింగ్ ఇస్తాడు. నువ్వు ఇక పార్ధుని మరిచిపోమ్మని భువనతో శాంభవి అంటుంది. పార్ధు బావే నా భర్త, ఈ జన్మలో బావని మరిచిపోనని తేల్చి చెబుతుంది భువన. భానుమతి కొడుకుతో భానుమతి ఫోటోకి దండం పెట్టిస్తానని.. భానుమతి ప్లేస్‌లోకి నేను వస్తానని చెప్పడంతో శాంభవి కంగారు పడుతుంది. భానుమతిని ఫస్ట్ నైట్ ఎలా జరిగిందని శారద అడగ్గా పార్ధు ఏం చెప్పాడో అదే చెబుతుంది భాను.
పనిపిల్ల స్వాతి నడుమును పట్టుకున్న చరణ్ ఆమెను లొంగదీసుకోవాలని అనుకుంటాడు. కానీ ఇవేవీ కుదరవని అంతా పెళ్లయ్యాకేనని చెబుతుంది స్వాతి. అప్పు తీసుకున్న కోటయ్య అనే వ్యక్తి అసభ్యంగా మాట్లాడటంతో అతనికి గట్టి వార్నింగ్ ఇస్తాడు పార్ధు. మేం దేన్నయినా క్షమిస్తాం కానీ మోసాన్ని భరించలేమని చెబుతాడు. ఆ మాటలతో భానుమతి వణికిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 8వ తేదీ ఎపిసోడ్ 52లో ఏం జరిగిందంటే?

కోటయ్యపై పార్ధు కోపం చూసిన భానుమతి, శక్తిలు వణికిపోతారు. నేను కూడా ఒక విధంగా ఈ కుటుంబాన్ని మోసం చేస్తున్నానని.. వీళ్ల అవమానానికి కారణం నేనే అనే నిజాన్ని దాస్తున్నానని అనుకుంటుంది భానుమతి. ఆ నిజం బయటపడిన రోజున ప్రేమిస్తున్న ఈ మనుషులే నా పతనం కోరుకుంటారని, అభిమానిస్తున్న ఈ వ్యక్తులే నా అంతం కళ్లజూస్తారని బాధపడుతుంది. ఉదయాన్నే వసు చదువుకుంటూ ఉండగా.. కాసేపు నాతో కబుర్లు చెప్పొచ్చు కదా అని అడుగుతుంది కుమారి. నాకు అంత టైం లేదు.. నేను చదువుకోవాలని వసు చెప్పడంతో.. మీ అక్క కూడా నీలాగే చదువుకుంటాను, చక్రం తిప్పుతాను అన్నదని గుర్తుచేస్తుంది కుమారి.
చివరికి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయిందని, రేపు నీ సంగతి కూడా అంతేనని అంటుంది కుమారి. ఈ మాత్రం దానికి ఆ పుస్తకాలెందుకు, ఆ పాఠాలెందుకు అని ప్రశ్నిస్తుంది కుమారి. ఆ మాటలు విన్న ప్రమీల మండిపడుతుంది. చదువుకునే పిల్లలతో ఇలాగేనా మాట్లాడేది అని ప్రశ్నిస్తుంది. భానుమతిని కూడా ఇలాగే చదవిస్తానని చంకలు గుద్దుకున్నావ్, ఆఖరికి అత్తారింటికి సాగనంపావని గుర్తుచేస్తుంది కుమారి. అత్తాకోడళ్ల గొడవ విన్న కోటి లోపలికి వచ్చి ఇద్దరిపై అరుస్తాడు.
కూతురికి పెళ్లి చేసి పంపించావ్ సరిపోయింది.. మరి సారే కూడా పంపించాలని కోటితో అంటుంది ప్రమీల. బలరామ్ కుటుంబం ముందు మనమెంత? వాళ్లకు మనం పంపించే సారే ఎంత అని అడుగుతాడు కోటి. వాళ్ల ఆస్తికి మనం సరితూగకపోవచ్చు కానీ మన ఆత్మాభిమానం నిలబెట్టుకోవాలని అంటుంది ప్రమీల. అరకోర సారే తీసుకెళ్తే ఆ తర్వాత అవమానాల పాలవుతామని హెచ్చరిస్తుంది కుమారి. మనం గొప్పగొప్ప కానుకలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ పద్ధతి ప్రకారం వెళ్లాలి కదా అని చెబుతుంది ప్రమీల. నువ్వేం చేస్తావో నాకు తెలియదు 25 వేలు కావాలని కోటితో చెబుతుంది ప్రమీల. ఆ మాటలతో కోటి ఉలిక్కిపడతాడు. నేను చీటి పాడానని, కానీ డబ్బులు రావడానికి టైం పడుతుందని బాధపడుతుంది ప్రమీల.
ఫస్ట్ నైట్ రోజున తాను ఇచ్చిన గిఫ్ట్‌ని భానుమతి ఓపెన్ చేసి చూడకపోవడంతో పార్ధు బాధపడతాడు. బస్సు అమ్మాయికి బహుమతులంటే ఇష్టం లేదా? లేదంటే నేను ఏం ఇచ్చానో తెలుసుకోవాలన్న ఆసక్తి లేదా అనుకుంటాడు. ఇంతలో భానుమతి లోపలికి వచ్చి బాధపడుతూ కనిపిస్తుంది. ఏం జరిగిందో చెప్పమని భానుమతిని పార్ధు అడగ్గా.. ఏం జరగలేదని అంటుంది భానుమతి. రెండు షర్ట్స్ తీసుకొచ్చి వీటిలో నేను ఏం వేసుకోనని భానుమతిని అడుగుతాడు పార్ధు. మీకు ఏది ఇష్టమో అదే వేసుకోండి అని ఆమె రిప్లయ్ ఇస్తుంది.
ఇంతకాలం నా ఇష్టప్రకారం వెళ్లానని, ఇకపై నువ్వు చెప్పినట్లు నడుచుకుంటానని అడుగుతాడు పార్ధు. ఆ రెండు షర్ట్స్ కన్నా మీరు వేసుకున్న షర్టే బాగుందని అంటుంది భానుమతి. ఎవరైనా తప్పు చేస్తే మీకు అంత కోపం వస్తుందా? అని భానుమతి అడగ్గా.. ఒకరి తప్పువల్ల ఇంకొకరు బలైతే ఇంకా కోపం వస్తుందని చెబుతాడు పార్ధు. కొన్ని తప్పులు కొందరి జీవితాల్లో చిచ్చుపెడతాయని వాటిని క్షమించకూడదని చెబుతాడు పార్ధు. తప్పు ఒప్పుకోవడానికి నేను సిద్ధపడినా క్షమించడానికి వీళ్లు లేరని అనుకుంటుంది భానుమతి.
ఇంతలో కాంచన అనే పెద్దావిడ బలరామ్ ఇంటికి వచ్చి హడావుడి చేస్తుంది. పార్ధు పెళ్లా ఎక్కడ కనిపించడం లేదని అడుగుతుంది. ఆ వెంటనే భువన రావడంతో పార్ధు పెళ్లాం చాలా బాగుందని మెచ్చుకుంటుంది. చిన్నప్పటి నుంచి బావ బావ అనే దానివి.. చివరికి బావనే ముడి వేసుకున్నావని అనడంతో భువన మురిసిపోతుంది. భువనని కోడలిగా చేసుకుని చాలా మంచిపని చేసుకున్నారని బలరామ్- శారదలతో అనడంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. భువన - పార్ధు ఒకరికోసం ఒకరు పుట్టినట్లుగా ఉంటారని అంటుంది.
ఇంతలో భానుమతి రావడంతో ఆమెను చూసి పనిమనిషి అనుకుని మంచినీళ్లు తీసుకురమ్మంటుంది కాంచన. ఆ మాటలతో బలరామ్ కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. భానుమతి లోపలికి వెళ్తుండగా శారద మండిపడుతుంది. భానుమతి మంచినీళ్లు తీసుకుని రాగా.. పనిమనిషిని బాగానే కంట్రోల్‌లో పెట్టారని కాంచన అనడంతో భాను సహా అంతా షాక్ అవుతారు. దాంతో శారద రగిలిపోతుంది. తను పని అమ్మాయి కాదని, పార్ధు భార్య, ఈ ఇంటి కోడలని కోపంగా చెబుతుంది శారద. ఆ మాటలు విన్న కాంచన షాకై అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
కాంచన మాటలతో బాధపడుతున్న భానుమతిని శారద ఓదారుస్తుంది. కాంచన మాటల్లో తప్పు లేదని, ఒక ఇంటి పరువు ఆ ఇంటి కోడలు ఉండే పద్ధతిపై ఆధారపడి ఉంటుందని చెబుతుంది బలరామ్ తల్లి. ఈ వేషంలో ఇలాగే తిరిగితే అందరూ పనిమనిషే అనుకుంటారని చెప్పడంతో మీకు ఎలా కావాలో ఆ అమ్మాయిని అలా రెడీ చేయమని బలరామ్ చెబుతాడు. ఇంతలో చరణ్ లోపలికి రావడంతో పనిపిల్ల స్వాతి పిలుస్తుంది. కనీసం ముద్దయినా ఇవ్వమని చరణ్ అడగ్గా.. పెళ్లయ్యే వరకు ఆగాల్సిందేనని అంటుంది చరణ్.
బలరామ్ మాటలతో కోప్పడిన ఆమె తల్లి వెంటనే శారదను తీసుకెళ్లి నగలను ఇస్తుంది. యజమానికి , పనివాడికి తేడా తెలియాలని చెబుతుంది. ఈరోజు నీ కోడలిని మన బంధువులు పనిమనిషి అనుకున్నారని, నీ కోడలిలో హుందాతనం తగ్గిందని అంటుంది. అది తగ్గకుండా ఉండాలంటే ఈ బంగారం దాని ఒంటి మీద ఉండాలని చెబుతుంది పెద్దావిడ. ఇన్నిరోజులు భానుమతి ఉన్న వాతావరణం, పరిస్ధితులు వేరని ఆ మాత్రం దానికే కోపం తెచ్చుకోవద్దని చెబుతుంది. అది తెలుసుకునేసరికి ఇంటిపరువు వీధిలో నిలబడుతుందని అంటుంది బలరామ్ తల్లి. ఆ మాటలు విన్న పార్ధు చాలా బాధపడతాడు. అతనిని చూసిన శారద లోపలికి పిలుస్తుంది. నీ పెళ్లాన్ని తీసుకుని రమ్మని పార్ధుతో చెబుతుంది పెద్దావిడ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











