Bhanumathi March 10th Episode: డాక్టర్ కల కోసం భానుమతి కష్టాలు.. తండ్రి జోలికొస్తే నరికేస్తానన్న పార్ధు
ఆలయానికి వచ్చిన భానుమతి తాను డాక్టర్ కావాలని కోరుకుంటుంది. ఇంతలో ఆమె చెల్లెలు వచ్చి ఆటపట్టిస్తుంది. అమ్మను బాగా చూసుకోవాలని చెబుతుండగా.. భానుమతి తల్లి ప్రమీల పొయ్యి దగ్గర వంటలు చేస్తూ దగ్గుతుంది. ఇంతలో ఒకామె వచ్చి నీ మొగుడే చక్కగా ఉంటే నీకు ఈ బాధలు ఉండేవా అని నానామాటలు అంటుంది. అంత కష్టపడినా తక్కువ డబ్బులు ఇవ్వడంతో ప్రమీత బాధపడుతుంది. ఇంతలో ఆమె అత్తగారు నోటితో బూర ఊదుకుంటూ రోడ్ల వెంట పరుగులు తీస్తుంది. రోడ్డు మీద వెళ్తుండగా ఓ చోట ఎండుమిర్చి కనిపించడంతో వాటిని కొట్టేస్తుంది. ఇదంతా భానుమతి చూసి మండిపడుతుంది. ఆమెను నానామాటలు అని ఇంటికి తీసుకొస్తుంది.
ఇంటికి వచ్చేసరికి ప్రమీల గుమ్మ దగ్గర కూర్చొని బాధపడుతుంది. ఎంత కష్టపడ్డా కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదని అంటుంది. నా కాలి మీద నేను నిలబడి నిన్ను బాగా చూసుకుంటానని అంటుంది. నీకున్న బాధ్యత మీ నాన్నకి ఉంటే మనికి ఈ కష్టం ఉండేది కాదని చెబుతుంది ప్రమీల. ఎక్కడో తాగి పడిపోయాడోనని అంటుండగా భానుమతి భర్త కోటి .. చెరువు దగ్గర మందు తాగుతూ ఉంటాడు. దీంతో అప్పులు ఇచ్చినవాళ్లు వాడిని వెతుక్కుంటూ రావడంతో పారిపోయి ఇంటికి వస్తాడు.

నా కొడుకు ఇంటికే రాలేదంటూ గుండెపోటు డ్రామా ఆడుతుంది ప్రమీల అత్త. నన్ను కాపాడావని అంటూ తల్లిని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతలో ప్రమీల కొంగులో దాచిన డబ్బుని కొట్టుకుని వెళ్లిపోతాడు కోటిగాడు. దాంతో ప్రమీల, భానుమతి బాధపడతారు. ఇలాంటి వాడి కూతురికి ఎలాంటి సంబంధాలు వస్తాయోనని ప్రమీల బాధపడుతుండగా.. దానికి నా కొడుకు యువరాజు లాంటి వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడని అంటుంది కుమారి.
ఇంతలో ఓ వ్యక్తిని తరుముకుంటూ వస్తాడు పార్ధు. మా నాన్న నీకిచ్చిన అప్పుని కట్టకుండా ఎలా వదిలేస్తానని అంటాడు . మా నాన్న బలరామ్ పత్రం కూడా రాయకుండా అప్పు ఇస్తే చెప్పిన టైమ్‌కి డబ్బులు ఇవ్వవా అంటూ మండిపడుతూ పత్రాల మీద సంతకం పెట్టించుకుంటాడు. మా నాన్నని ఎవరైనా మోసం చేయాలని అనుకున్నా, ఆయనకు అవమానం జరిగినా వదిలిపెట్టనని అంటాడు పార్థు. బస్సు కోసం వచ్చేసరికి వెళ్లిపోవడంతో భానుమతి పరిగెడుతూ ఉంటుంది. దీంతో ఆమెను పార్థు దూరం నుంచి చూస్తాడు.
ఆ వెంటనే కారుని వేగంగా తీసుకెళ్లి బస్సుకు అడ్డంగా పెడతాడు పార్ధు. బస్సెక్కిన తర్వాత పార్ధుకి థ్యాంక్స్ చెబుతుంది భానుమతి. ఆ వెంటనే పార్ధు ఫ్రెండ్ వచ్చి అర్జెంట్‌గా ఇంటికెళ్లాలని చెబుతాడు. నీకు ఈ రోజు మళ్లీ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని అంటాడు. ఇంట్లో పేపర్ చదువుతున్న బలరామ్ దగ్గరికి వచ్చి పత్రాలు రాయించుకున్నానని చెబుతాడు. ఇలాంటి వాళ్లని కొడుతూనే ఉంటావా అంటూ పార్ధుపై మండిపడతాడు బలరామ్. ఎవడైనా నీ మీద పగ పెంచుకుని నిన్ను ఏదైనా చేస్తే భరించలేనని అంటాడు.

వాడు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదని.. కానీ వాడు మిమ్మల్ని మోసం చేశాడని అలాంటి వాడిని వదిలిపెట్టనని అంటాడు పార్థు. మీకు కష్టం , నష్టం కలిగించే వాళ్లు ఎవరైనా సరే వదిలిపెట్టనని చెబుతాడు. ఆ పత్రాలు తీసుకెళ్లి మీ అమ్మకి ఇవ్వమని అంటాడు బలరామ్. కానీ తల్లి శారదని కోపంగా చూసి పత్రాలు అక్కడ పెట్టేసి వెళ్తాడు పార్ధు. వాడు ఎవ్వరితోనూ గొడవ పడకుండా ఆపేందుకే కదా నిన్న వాడితో పంపించింది అని సూరిపై మండిపడతాడు బలరామ్.
ఇంతలో వాళ్ల అమ్మ గుడి నుంచి వచ్చి పార్థుకి ఈ సంబంధం ఖాయం కావాలని గుడిలో అర్చన చేయించానని అంటుంది. ఇంతలో శాంభవిని పిలిపించి నా మేనకోడలు ఎక్కడ అని అడుగుతాడు బలరామ్. నేనంటే గుండె ధైర్యం చేసుకుని వచ్చానని అది ఆడపిల్ల కాబట్టి రాలేకపోయిందని చెబుతుంది. శాంభవి కూతురు ఫోనులో పార్ధు ఫోటో చూసుకుంటూ బాధపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











