Bhanumathi March 11th Episode: పార్ధు పెళ్లి చూపులు చెడగొట్టిన శాంభవి.. భానుమతి కోసం పార్ధు ఫైట్
డాక్టర్ కావాలని, తల్లి ప్రమీలని బాగా చూసుకోవాలని కష్టపడి చదువుతుంది భానుమతి. అయితే అతని తండ్రి కోటి మాత్రం భార్య సంపాదించిన సొమ్ములు లాక్కొని తాగుతూ ఉంటాడు. భానుమతి ఫీజు కోసం దాచిన డబ్బును ప్రమీల నుంచి కాజేసి తాగడానికి పరిగెడతాడు. తన తండ్రి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిని వెంటాడతాడు పార్ధు.
అతని వద్ద పత్రాలపై సంతకాలు చేయించుకుని వెళ్తుండగా బస్సు కోసం పరిగెడుతున్న భానుమతిని చూస్తాడు. వేగంగా వెళ్లి బస్సుకి తన జీపును అడ్డుగా పెట్టడంతో భానుమతి అతనికి థ్యాంక్స్ చెబుతాడు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దని పార్ధుని తండ్రి మందలిస్తాడు. ఆ పత్రాలను తల్లికి ఇవ్వమని చెప్పగా ఆమెని కోపంగా చూసి వెళ్లిపోతాడు పార్ధు. కొడుకుకి పెళ్లి చూపుల ఏర్పాట్లు చేసి తన చెల్లెలు శాంభవిని పిలిపిస్తాడు బలరామ్.

భువన ఎక్కడ అని శాంభవిని అడుగుతాడు బలరామ్. ఆడపిల్ల కదా అన్నయ్య నాలాగా గుండె దీటవు చేసుకోవడానికి టైం పడుతుందని.. నేను నచ్చచెప్పి తీసుకొస్తానని చెబుతుంది శాంభవి. కుర్చీలో దర్జాగా ఉన్న బలరామ్‌ని చూసి శక్తి కుళ్లుకుంటుంది. ఇంతలో ఆమె భర్త వచ్చి ఎందుకు అలా చూస్తున్నావని అడుగుతాడు. ఆ కుర్చీలో మిమ్మల్ని ఎప్పుడు చూస్తానా అని ఆలోచిస్తున్నానని శక్తి ఆన్సర్ ఇస్తుంది. అలాంటి కుర్చీలో కూర్చోవాలంటే వారసత్వమే కాదని పెద్దరికం కూడా ఉండాలని అంటాడు. ఇంతలో ఆమె కూతురు వచ్చి అమ్మ ఏం ఆలోచించినా పక్కాగా ఉంటుందని నా ఫుల్ సపోర్ట్ నీకేనని చెబుతుంది.
ఫోనులో పార్ధు ఫోటో చూస్తూ ఏడుస్తుంటుంది భువన. అందరూ వచ్చారు నువ్వు కూడా రా అని శాంభవి వచ్చి చెబుతుంది. నేను బావ పక్కన ఉండాలని అనుకుంటుంటే నువ్వు వేరే అమ్మాయిని సెలెక్ట్ చేస్తావా అని తల్లిపై మండిపడుతుంది భువన. పెళ్లిచూపులకు పార్ధు రెడీ అయి, నేనూ సూరి నా కారులో వస్తామని చెబుతాడు. పెళ్లి చూపులకు వెళ్లిన తర్వాత పెళ్లికూతురు అందరికీ కాఫీ ఇస్తూ పార్ధుని చూసి ఇష్టపడుతుంది. అనంతరం అమ్మాయి నచ్చిందా అని పంతులుగారు పార్థుని అడుగుతాడు. మీకు నచ్చితే నాకేం అభ్యంతరం లేదని చెప్పగా.. పార్ధు సరేనని అంటాడు.
పెళ్లికూతురు దగ్గరికి శాంభవి వచ్చి ఎక్కడి వరకు చదువుకున్నావని అడుగుతుంది. డిగ్రీ వరకు చదువుకున్నానని అంటుంది పెళ్లికూతురు. డిగ్రీ వరకు చదువుకున్న నువ్వు మా పార్ధుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావంటే చాలా సంతోషంగా ఉందని చెబుతుంది. మా పార్థు ఏం చదువుకోలేదని శాంభవి చెప్పడంతో పెళ్లికూతురు షాక్ అవుతుంది. ఇంతలో వాళ్ల అమ్మానాన్నలని పిలిచి మీతో మాట్లాడాలని చెబుతుంది. అనంతరం అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి మీ అబ్బాయి ఎంత వరకు చదువుకున్నారని అడుగుతారు. ఆ మాటలతో బలరామ్ సహా అంతా షాక్ అవుతారు. బాగా చదువుకున్న మా అమ్మాయిని.. ఏం చదువుకోని మీ అమ్మాయికి ఇవ్వడానికి మేం సిద్ధంగా లేమని చెబుతారు అమ్మాయి తల్లిదండ్రులు.
మావాడి గురించి తెలుసుకోకుండా పెళ్లిచూపులకు ఎందుకు రమ్మన్నారని మండిపడతాడు బలరామ్. మీ అబ్బాయంటే బాగా చదువుకుని ఉంటాడని అనుకున్నామని.. ఇలా ఏమాత్రం చదువుకోకుండా ఉంటాడని అనుకోలేదని చెబుతాడు అమ్మాయి తండ్రి. ఇంటికి పిలిచి ఇంత అవమానిస్తారా అంటూ బలరామ్ మండిపడతాడు. చదువుకోలేదన్న విషయం దాచి మీరు మోసం చేయలేదా అని అమ్మాయి తండ్రి రివర్స్ అవుతాడు. తన తండ్రిని అవమానించేసరికి పార్థు కోపంతో రగిలిపోతూ ఆయన మీదకి వెళ్తాడు. దీంతో కోప్పడిన పెళ్లికూతురు .. చదువు అనేది లేదు కాబట్టే మీరు ఇలా తయారయ్యారని మండిపడుతుంది. చదువు సంస్కారం ఏమాత్రం లేని మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోనని తేల్చి చెబుతుంది.
ఇలాంటి వాడిని ఏ ఆడపిల్లా పెళ్లి చేసుకోదని పెళ్లి కూతురు తండ్రి చెప్పడంతో బలరామ్ మండిపడతాడు. నెలతిరిగే సరికి అందం, తెలివితేటలు, సంస్కారం అన్ని ఉన్న అమ్మాయితో పెళ్లి జరిపిస్తానని బలరామ్ సవాల్ విసురుతాడు. పెళ్లి చూపుతల్లో తనకు జరిగిన అవమానాన్ని తలచుకుంటూ భానుమతి చదువుకుంటున్న కాలేజ్ వద్దకి వస్తాడు పార్థు. ఇంతలో భానుమతిని నలుగురు పోకిరి వెధవలు ఏడిపిస్తుండగా చూసిన పార్ధు వాళ్లని చితకబాదుతాడు. నా మీదే చేయి వేస్తావా అంటే పోకిరిలని చాచికొట్టి పార్థుకి థ్యాంక్స్ చెబుతుంది భానుమతి. మిమ్మల్ని కొట్టింది మా బావ అని రేపు మళ్లీ నా మీద అటాక్ చేయాలని చూస్తే చంపేస్తాడు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది భానుమతి.
కొడుక్కి జరిగిన అవమానంతో బలరామ్ రగిలిపోతాడు. పెళ్లిళ్ల బ్రోకర్లని ఇంటికి పిలిపించి పెళ్లికూతుళ్లని వెతకమని చెబుతాడు. అయితే వాళ్లంతా చదువుకున్న అమ్మాయిల ఫోటోలు చూపించడంతో చదువుకున్న అమ్మాయిలు వద్దు అని తేల్చిపారేస్తాడు బలరామ్. అందరూ వాడు ఎంత చదువుకున్నాడో చూశారు కానీ వాడి మనసును మాత్రం అర్ధం చేసుకోలేదని బాధపడతాడు బలరామ్. ఇంతలో పార్ధు వచ్చి నేను అసలు పెళ్లే చేసుకోనని , నా కోసం సంబంధాలు చూడటం ఆపేయమని చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
నా వల్ల మీకు అవమానాలు జరగడం నేను చూస్తూ ఉండలేకపోతున్నానని .. నా కోసం మీరు ఎక్కడా తగ్గకూడదని అంటాడు పార్ధు. ఆస్తులను పెంచే కొడుకుని కాదు.. తండ్రి గౌరవాన్ని పెంచే కొడుకుని కన్నానని గర్వంగా ఉందని అంటాడు బలరామ్. మేం ఉన్నంత కాలం నిన్ను చూసుకుంటామని, తర్వాత ఎవరు చూసుకుంటారని ప్రశ్నిస్తాడు బలరామ్. ఈసారి నేను చూసే సంబంధం నిన్ను నెత్తిన పెట్టుకుని చూసేలా ఉంటుందని చెబుతాడు. ఇంతలో శక్తి బయటికి వెళ్లి నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందని తన కొడుకుతో చెబుతుంది.
మీ అన్నయ్య చదువుకోకపోవడానికి కారణం నేనే అని అంటుంది. ఏ సవతి తల్లి కూడా నీకు కన్నతల్లి కాలేదని.. మీ నాన్న విరిచేసి ఈ ఇంట్లో అడుగుపెట్టిందని బలరామ్ రెండో భార్య గురించి పార్ధుకి చిన్నప్పుడు చెడుగా చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తుంది శక్తి. నువ్వు స్కూలుకి వెళితే నిన్ను మీ నాన్న నుంచి దూరం చేస్తుందని భయపెడుతుంది శక్తి. సవితి తల్లి మీద ద్వేషం పెంచానని, ఈ ఇంటి వారసుడిగా నిన్ను కూర్చోబెట్టాలని నిన్ను బాగా చదివించానని అంటుంది. ఇప్పుడు చదువులేని పార్థుని పెళ్లి చేసుకోవడానికి ఏ పిల్ల ముందుకు రాదు, వాడికి పెళ్లే కాదు, అప్పుడు వారసుడే పుట్టడని దాంతో నీకు, నీ పిల్లలకే ఈ ఇంటి వారసత్వం దక్కుతుందని చెబుతుంది శక్తి.
పరీక్ష రాసి ఇంటికి ఆనందంగా వస్తున్న భానుమతికి తన చెల్లెలు వసు కనిపిస్తుంది. పరీక్షలు రాసేశానని ఇంకో నెల రోజులు కష్టపడితే డాక్టర్ భానుమతి ఎంబీబీఎస్ అని అంటుంది. ఇంటికి వచ్చేసరికి కుమారి కుర్చీలో కూర్చొని కళ్లపై దోసకాయ పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటుంది. కళ్ల మీద పెట్టుకోవాల్సింది కూర దోసకాయ కాదని.. కీర దోసకాయని చెబుతుంది భానుమతి. లోపలికి వచ్చి చూసేసరికి పుస్తకాలు కనిపించకపోవడంతో భానుమతి కంగారు పడుతుంది. దీని పరీక్షలన్నీ అయిపోయాయి కదా అని ఆ పుస్తకాలను అమ్మేసుకుంటానని చెప్పి తీసుకెళ్లాడని కుమారి చెబుతుంది. ఆ మాటలతో భానుమతి, ప్రమీల షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











