Bhanumathi March 12th Episode: కూతురి కల చిదిమేసిన తండ్రి.. భానుమతికి అండగా పార్థు

బావ పక్కన నేనుండాలి కానీ ఎవరో ఉండటం ఏంటని తల్లితో అంటుంది శాంభవి కూతురు. టైం వచ్చే వరకు వెయిట్ చేయాలని చెప్పి కూతురిని పెళ్లి చూపులకు తీసుకెళ్తుంది శాంభవి. బలరామ్ ఆస్తి, ఐశ్వర్యం, హోదా అన్నీ మీకు రావాలని భర్తతో చెబుతుంది శక్తి. పెళ్లిచూపులకు వెళ్లగా అమ్మాయి పార్థుకి బాగా నచ్చుతుంది. ఇంతలో శాంభవి వెళ్లి పార్థు చదువుకోలేదని అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటావా అని అంటుంది. దాంతో అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు పార్ధుని, బలరామ్‌ని దారుణంగా అవమానిస్తారు.

నా కొడుక్కి నెల తిరిగేసరికి అందం, సంస్కారం, తెలివితేటలు ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని సవాల్ చేస్తాడు బలరామ్. ఇంటికొచ్చి పెళ్లిళ్ల బ్రోకర్లతో మంచి సంబంధాలు వెతికిస్తాడు. పెళ్లిచూపుల నుంచి తిరిగొస్తుండగా కాలేజీ వద్ద భానుమతిని కొందరు ఆకతాయిలు ఏడిపిస్తుంటారు. దీంతో వాళ్లని పార్ధు చితకబాదుతాడు. మిమ్మల్ని కొట్టింది మా బావని మళ్లీ నా జోలికి వస్తే చంపేస్తాడని వార్నింగ్ ఇచ్చి పార్థుకి థ్యాంక్స్ చెబుతుంది భానుమతి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 12వ తేదీ .. ఎపిసోడ్ 3లో ఏం జరిగిందంటే..

Bhanumathi Serial Today s Episode 3 March 12th 2025 Here is full story

ఇంటికొచ్చిన భానుమతికి తన పుస్తకాలు కనిపించవు. దీంతో కుమారిని ప్రమీల నిలదీస్తుంది. ఇందాక నా కొడుకొచ్చి ఎలాగూ దీని చదువు అయిపోయింది కాబట్టి పుస్తకాలు అమ్ముకుంటానని తీసుకెళ్లాడని చెబుతుంది కుమారి. డాక్టర్ కావాలన్న నా కల సమాధి అయిపోయిందని భానుమతి బాధపడుతుంది. తన వద్ద ఉన్న డబ్బులు, కిడ్డి బ్యాంక్ అంతా చూసినా పుస్తకాలకు సరిపోకపోవడంతో భానుమతి తల్లిని పట్టుకుని ఏడుస్తుంది.

పార్ధు దగ్గరికి భువన వచ్చి పొద్దున్నే తనను షాపింగ్ తీసుకెళ్లమని మారం చేయడంతో సరేనంటాడు. ఉదయాన్నే పుస్తకాలు కొనుక్కోవడానికి షాప్‌కి వస్తుంది భానుమతి. అయితే ఆమెను మరోసారి ఆకతాయిలు ఏడిపించడంతో రోడ్డు మీదున్న పార్థుని పిలుస్తుంది. ఈమె నా మరదలని మరోసారి భానుమతి జోలికొస్తే కాళ్లు విరగ్గొడతానని అంటాడు పార్ధు. చేసిన అప్పులు కట్టకపోవడంతో కోటిని ఊళ్లో పెద్ద మనుషులు చెట్టుకు కట్టేసి కొడతారు. ప్రమీల ముఖం చూసి అప్పు తీర్చడానికి నెల రోజులు గడువు ఇస్తారు పెద్ద మనుషులు .

More from Filmibeat

Read more about: sai kiran bhanumathi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X