Bhanumathi March 13h Episode: కోటిని విడిపించిన ప్రమీల.. సవతి తల్లిని బాధపెట్టిన పార్ధు

నీట్ ఎగ్జామ్ కోసం తెచ్చుకున్న పుస్తకాలను తండ్రి తాగడం కోసం ఎత్తికెళ్లిపోయాడని తెలుసుకున్న భానుమతి బాధపడుతుంది. పుస్తకాలు కొనడం కోసం కావాల్సిన డబ్బు లేక కంటతడి పెడుతుంది. ఉదయాన్నే పంతులుగారిని పిలిపిస్తుంది బలరామ్ తల్లి. ఎందుకని బలరామ్ అడగ్గా.. వీడికి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కావడం లేదని కొన్ని దుష్టగ్రహాలు అడ్డుకుంటున్నాయని చెబుతుంది. పంతులుగారు పార్ధు జాతకం చూసి కొన్ని దోషాలు ఉన్నాయని అవి పోవాలంటే సీతారాముల కళ్యాణం చేయించాలని చెబుతాడు.

పార్ధు దగ్గరికి భువన వచ్చి పొద్దున్నే తనను షాపింగ్ తీసుకెళ్లమని మారం చేయడంతో సరేనంటాడు. ఉదయాన్నే పుస్తకాలు కొనుక్కోవడానికి షాప్‌కి వస్తుంది భానుమతి. అయితే ఆమెను మరోసారి ఆకతాయిలు ఏడిపించడంతో రోడ్డు మీదున్న పార్థుని పిలుస్తుంది. ఈమె నా మరదలని మరోసారి భానుమతి జోలికొస్తే కాళ్లు విరగ్గొడతానని అంటాడు పార్ధు. చేసిన అప్పులు కట్టకపోవడంతో కోటిని ఊళ్లో పెద్ద మనుషులు చెట్టుకు కట్టేసి కొడతారు. ప్రమీల ముఖం చూసి అప్పు తీర్చడానికి నెల రోజులు గడువు ఇస్తారు పెద్ద మనుషులు . ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 13వ తేదీ .. ఎపిసోడ్ 4లో ఏం జరిగిందంటే..

Bhanumathi Serial Today s Episode 4 March 13th 2025 Here is full story

ప్రమీల బతిమలాడేసరికి అప్పులు తీర్చడానికి 30 రోజులు గడువు ఇస్తారు పెద్ద మనుషులు. ఈ నెల లోపు అప్పు తీరిస్తే సరేసరి.. లేదంటే ఇంటిని వేలం వేసి పంచాయతీ వాళ్లే అప్పు తీరుస్తారని తేల్చిచెబుతారు. ఇది పంచాయతీ తీర్మానమని, గడువు దాటితే ఇల్లు జప్తు చేయాలని చెబుతారు పంచాయతీ వాళ్లు. పంచాయతీ పెద్దలు చెప్పారు కాబట్టి ఇప్పుడు వదిలేస్తున్నామని చెప్పి అప్పుల వాళ్లు వెళ్లిపోతారు. రెండు గంటలు కట్టేశారని, ఒళ్లంతా హూనం అయిపోయిందని ఒక క్వార్టర్ వేయాలని అంటాడు కోటి. దాంతో కోటి కట్లు విప్పేసి తాగడానికి డబ్బులు ఇస్తుంది కుమారి. ఇంత జరిగినా తాగడానికి డబ్బులు ఇస్తున్నావా? నువ్వు తల్లివి? వీడొక కొడుకు అని మండిపడుతుంది ప్రమీల. సాయంత్రం అయిపోతుంది వెళ్లి త్వరగా తాగమని అంటుంది కుమారి.

సీతారాముల కళ్యాణం జరిపిస్తే నా మనవడి పెళ్లికి ఏ ఆటంకం ఉండదని అంటుంది బలరామ్ తల్లి. ఇంతలో శాంభవి, భువనలు తమ లగేజీ తీసుకుని బయటికొస్తారు. ఎంత నా వాళ్లు అని మీ పంచన పడివున్నా.. నన్ను నా కూతురిని పరాయివాళ్లలాగే చూస్తున్నారని మండిపడుతుంది శాంభవి. నిన్ను అలా చూసింది ఎవరు? అని బలరామ్ అడిగేసరికి అది నువ్వేనని అంటుంది. ఆ మాటలతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఇంట్లోనే మేనకోడలిని పెట్టుకుని ఇంకా బయటి సంబంధాలే చూస్తున్నారని మండిపడుతుంది శాంభవి. దీనిని కోడలిగా చేసుకునే ఉద్దేశం మీకు లేదని అర్ధమైందని అంటుంది.

ఎవరో బయటివాళ్ల కోసం ప్రయత్నించి వాళ్ల చేతుల్లో అవమానాలు పడుతున్నారు తప్ప నా కూతురిని పార్ధుకిచ్చి చేయాలనే నిర్ణయం మాత్రం మీరు తీసుకోవడం లేదని శాంభవి అంటుంది. వీరిద్దరి పెళ్లితోనైనా నా పుట్టింటితో నా బంధం మరింత బలపడుతుందని అనుకున్నానని.. కానీ అది ఎప్పటికీ జరగదని అర్ధమైందని చెబుతుంది శాంభవి. వాళ్లని ఆగమని చెప్పి భువనకి మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తానని అంటాడు బలరామ్. నాకేమీ అక్కర్లేదని మేం వెళ్లిపోతామని అంటుంది శాంభవి.

వెళ్లిపోతున్న శాంభవి, భువనలని పిలిచి ఆగమంటాడు పార్ధు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఒకేచోట పెరిగామని, నేను దీనిని ఎత్తుకుని ఆడించానని అంటాడు. అత్త కూతురే అయినా ఇప్పటికీ భువన నా మరదలు లాగా అనిపించదని చెబుతాడు. అందుకే తనను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదని తేల్చి చెబుతాడు. వాడికి మనసులో లేనప్పుడు మనం బలవంతంగా ఎలా కట్టబెడతామని అంటుంది బలరామ్ తల్లి. వాడికి ఇష్టం లేని పెళ్లి నేను ఏది చేయనని బలరామ్ కూడా చెబుతాడు. జరిగిందేదో జరిగింది మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని అంటుంది తల్లి. మధురపూడిలో రామాలయం దగ్గరికి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేయమని పార్ధుకి చెబుతాడు బలరామ్. నేను అక్కడికి రానని శాంభవి చెప్పగా.. ఎవరొచ్చినా , రాకపోయినా కళ్యాణం ఆగదని అంటాడు.

నీట్ కోసం కష్టపడి చదువుకుంటుంది భానుమతి. ఇంతలో తాగుతూ ఇంటికొస్తాడు కోటి. ఎందుకొచ్చాడు, ఇంకా ఏం ఎత్తుకెళ్లి తాగుదామని అనుకుంటున్నాడని మండిపడుతుంది ప్రమీల. చదువు లేదు , ఏం లేదు అంటూ భాను చేతుల్లో ఉన్న పుస్తకాలు లాక్కొవడానికి కోటి ప్రయత్నిస్తాడు. దాంతో ప్రమీల భర్తని అడ్డుకుని విసిరికొడుతుంది. నాన్న నన్ను చదుకోనిచ్చేలా లేడని, నీట్ ఎగ్జామ్ రాయాలి, డాక్టర్‌ని కావాలి అని అంటుంది భానుమతి. ఆ దేవుడు నీకో దారి చూపిస్తాడని.. ఎవరు అడ్డుకున్నా చదువు మాత్రం ఆపొద్దని చెబుతుంది ప్రమీల.

ఒంటరిగా బలరామ్ బాధపడుతుండగా శారద వచ్చి ఈ కాలంలో మనస్థాయికి సరితూగే ఏ కుటుంబంలోనూ చదువుకోని అమ్మాయిలు ఉండని అంటుంది. అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారే ఉంటారని చెబుతుంది. చదువుకున్న అమ్మాయే అయినా పర్లేదని అంటావా అని అడుగుతాడు బలరామ్. వాడు బాగుండాలని, వాడి జీవితం బాగుండాలని .. గతం మరిచిపోయావా అని చెబుతాడు బలరామ్.

ఉదయాన్నే బలరామ్ మొదటి భార్య ఫోటో దగ్గర శారద దీపం వెలిగిస్తుండగా పార్ధు చూసి ఆగమంటాడు. నువ్వు మా నాన్నకి తల్లికి మాత్రమే , నాకెప్పుడూ తల్లివి కాలేవని మండిపడతాడు. నాకు, మా అమ్మకి సంబంధించిన విషయంలో జోక్యం చేసుకోవద్దు అని తేల్చిచెబుతాడు పార్ధు. ఇదంతా బలరామ్ దూరం నుంచి చూసి బాధపడతాడు . పార్ధుని ఆగమని చెప్పగా.. మీరు ఈ ఒక్క విషయం తప్ప మీరు ఏదైనా చెప్పొచ్చు అని వెళ్లిపోతాడు .

కుటంబం మొత్తం సీతారామ కళ్యాణం జరిపించడానికి మధురపూడి బయల్దేరతారు. ఇన్ని రోజులు ఈ ఊరు ఎందుకు రాలేదా అని బాధగా ఉందని అంటాడు పార్ధు. మీ నాన్న ఈ వూళ్లో పిల్లని చూసి సంబంధం ఖాయం చేస్తే ఇది మీ అత్తగారి ఊరు అవుతుందేమో అని చెబుతాడు సూరి. కాసేపు దిగి పొలాలు చూద్దామా అని అంటాడు పార్ధు. ఇవన్నీ మన పొలాలే అని చూద్దామని చెప్పి దిగుతారు . పొలం గట్లపై నడుస్తుండగా ఎవరో బావ అని పిలిచినట్లుగా ఉందని అంటాడు పార్ధు. ఇంతలో వాళ్లకి పామును పట్టుకుంటూ భానుమతి కనిపిస్తుంది. పాముని చూడగానే పార్ధు భయపడి పారిపోతాడు.

ఇంతలో పాముని పట్టుకుని పొలంలో వదిలేస్తుంది భానుమతి. ఇంతలో పార్ధుని చూసి జీపు అబ్బాయి అని గుర్తుపడుతుంది. మీరేంటి ఇక్కడ అని అడుగుతుండగా అబ్బాయిలతో మాట్లాడితే అమ్మ తిడుతుందని భానుమతిని తీసుకుని వెళ్లిపోతుంది వసు. మధురపూడిలో వాళ్ల బాబాయి ఇంటికి బలరామ్ కుటుంబం వస్తుంది . అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Read more about: bhanumathi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X