Bhanumathi March 14th Episode: రాములోరి కళ్యాణం ఆపడానికి శాంభవి ప్లాన్.. భానుమతి ప్రేమలో పార్ధు
కోటిగాడు చేసిన అప్పు తీర్చడానికి నెల రోజులు గడువు ఇస్తారు పెద్ద మనుషులు. పార్థు పెళ్లి కోసం సీతారాముల కళ్యాణం జరిపించాలని బలరామ్ అనుకుంటాడు బలరామ్. దీంతో శాంభవి - భువనలు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటారు. ఇంట్లో మేనకోడలిని పెట్టుకుని బయటి సంబంధాలు చూస్తున్నారని చెబుతుంది శాంభవి. భువనను చిన్నప్పటి నుంచి నేనే పెంచానని తనపై నాకు అలాంటి ఉద్దేశం లేదని చెబుతాడు పార్ధు. భువనికి మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తానని చెప్పి శాంభవిని లోపలికి పంపిస్తాడు బలరామ్.
బలరామ్ మొదటి భార్య ఫోటో వద్ద శారద దీపం వెలిగించబోతుండగా పార్ధు వచ్చి ఆమెపై మండిపడతాడు. నువ్వు మా నాన్నకి భార్యవి మాత్రమే నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెబుతాడు. రాత్రి ఒంటరిగా బాధపడుతున్న బలరామ్ దగ్గరికి శారద వచ్చి పార్ధు పెళ్లి గురించి మాట్లాడుతుంది. భానుమతి చదువుకుంటూ ఉండగా కోటి వచ్చి నువ్వు చదవడానికి వీల్లేదని కూతురి చేతిలో ఉన్న పుస్తకాలు లాక్కొంటాడు. బలరామ్ కుటుంబం సీతారాముల కళ్యాణం జరిపించడానికి మధురపూడి వస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 14వ తేదీ ఎపిసోడ్ 5లో ఏం జరిగిందంటే?

సీతారాముల కళ్యాణంలో వాడికి తగిన పిల్లని చూద్దామని అంటారు బలరామ్ బంధువులు. తండ్రి మీద ఈగ వాలనివ్వడని.. ఆయనను ఎవరైనా ఏమైనా అంటే కొట్టి వస్తున్నాడని చెబుతుంది శారద. వాడు నిన్ను ఇప్పటికైనా అమ్మ అని పిలుస్తున్నాడా అని ప్రశ్నిస్తుంది పిన్నిగారు. ఆ మాటలతో శారద - బలరామ్‌లు బాధపడతారు. చిన్న వయసులోనే వాడి మనసులో ఎవరో విష బీజం నాటారని.. సవతి తల్లి అంటే ఎప్పటికీ తల్లి కాలేదని నూరు పోశారని, వాళ్లు బాగుపడరని అంటుంది పిన్నిగారు. ఆ మాటలు విన్న శక్తి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో శాంభవికి ఏదో డౌట్ వచ్చి బయటికెళ్లి అడుగుతుంది.
మా అన్నయ్యని చూస్తుంటే ఈ పల్లెటూరిలో ఎవరో చదువురాని అమ్మాయిని చూసి పార్ధుతో పెళ్లి చేసేలా ఉన్నాడని శక్తితో చెబుతుంది. ఈ విషయంలో నాకు సాయం చేస్తే జీవితాంతం నీకు రుణపడి ఉంటానని అంటుంది. నేను ఏదో ఒక ప్రయత్నం చేసి పార్ధుకి, భువనికి పెళ్లి చేస్తానని మాట ఇస్తుంది శక్తి. ఇంతలో శక్తి కూతురు, కొడుకు వచ్చి మనం పార్ధుకి చదువురాని పిల్ల కోడలిగా రావాలని కోరుకుంటుంటే, మీ అత్తయ్య భువనని ఇచ్చి పెళ్లి చేయడానికి నా సాయం అడుగుతోందని అంటుంది శక్తి. భువనని ఇచ్చి పార్ధుకి పెళ్లి జరిపిస్తే ఈ తల్లికూతుళ్ల పెత్తనం పెరిగిపోతుందని చెబుతుంది.
వయసు పెరిగిపోవడంతో నాకు ఓపిక లేదని.. మనకి ఎప్పుడూ వంటలు చేసే ప్రమీలతో వంటలు చేయిస్తున్నానని చెబుతుంది పిన్నిగారు. చాలా బాగుంటాయి.. చాలా బాగా చేస్తుందని అంటుంది. ఉదయాన్నే ప్రమీల కష్టపడి వంటలు చేస్తుంటే కుమారి వ్యాయామం చేస్తుంది. ఇంతలో పండ్ల బండి రావడంతో వాడికి మట్కా కొట్టి అరటిపళ్లు కొట్టేస్తుంది. దీనిని భానుమతి చూసి కొట్టేసిన అరటి పండ్లు అక్కడే పెడుతుంది. ఇన్ని వంటలు చేశావ్ ఎవరి కోసమని ప్రమీలను భానుమతి అడగ్గా.. విశ్వనాథం గారికి అని చెప్పి వాళ్లింటిలో ఇవ్వమని అంటుంది.
పార్ధు పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు బలరామ్.. నువ్వేం కంగారు పడొద్దని నెల తిరిగేసరికి మంచి సంబంధం దొరుకుతుందని చెబుతాడు విశ్వం. ఇంతలో భోజనం తీసుకుని విశ్వనాథం ఇంటికి వస్తారు ప్రమీల , భానుమతి. వాళ్లని చూసిన శక్తి, ఆమె కూతురు లోపలికి నేరుగా వచ్చేస్తారా వెనుక గేటు నుంచి వెళ్లమనడంతో పాటు మా చెప్పుల పక్కన మీవీ వదులుతారా అంటూ మండిపడతారు. దానికి బాధపడిన భానుమతి .. శక్తి, ఆమె కూతురు వేసుకున్న చెప్పుల్ని మిగతా వాటిలో కలిపేస్తారు.
ఇంతలో పార్ధు గొంతు వినిపించడంతో పక్కకి వెళ్లి చూస్తుంది భానుమతి. పాము అంటే నాకు భయం లేదని నన్ను చూసి అది పారిపోయిందని పిల్లలతో చెబుతాడు పార్ధు. ఆ వెంటనే పాము పాము అని అరుస్తుంది భానుమతి .. దాంతో పార్ధు భయపడి అటు ఇటు పరుగులు తీస్తాడు. భోజనాలు చేసి వస్తున్న బలరామ్- శారదలకి ప్రమీలని పరిచయం చేస్తుంది పిన్నిగారు. పార్ధును భానుమతి జ్ఞాపకాలు వెంటాడుతూ ఉండగా.. తనలో తాను సిగ్గుపడుతుంటాడు.
ఇంతలో పార్ధు దగ్గరికి సూరి వచ్చి మేం ముగ్గురం మందు కొడుతున్నామని.. డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. ఎప్పుడూ మందేనా? నా గురించి పట్టించుకోవా? అని ఫైర్ అవుతాడు పార్ధు. బస్సు అమ్మాయి ఈ ఊరిలోనే ఉంది.. ఆ అమ్మాయి అడ్రస్ నాకు కావాలి అని తేల్చిచెబుతాడు. ఇంతలో బావా బావా అంటూ భువన రావడంతో పార్ధు దాక్కొంటాడు. సూరి చేతిలో పార్ధు డబ్బులు పెట్టడంతో పార్ధు బయటికి వెళ్లిపోయాడని భువనతో చెబుతాడు.
భానుమతి, వసులతో పాటు పాటలు పాడుకుంటూ వస్తుంది కుమారి. ఇంతలో ఆమెకు పల్లీలు కనిపించడంతో వాటిని కొట్టేస్తుంది. కుమారి నడకలో తేడా గమనించిన భానుమతి ఆమెపై డౌట్ పడుతుంది. వసు క్యాన్ తీసుకుని చూడగా అది చాలా బరువుగా ఉంటుంది. దారిలో చింతకాయలు, శనక్కాయలు కోసుకుని దాచుకున్నానని చెబుతుంది కుమారి. దాంతో చెరుకు గడ తీసుకుని నాయనమ్మ వెంటపడుతుంది వసు. ఇంతలో మరోసారి పార్ధు కనిపించడంతో ఆట పట్టిస్తుంది భానుమతి. దాంతో పొలంలో పడిపోతాడు పార్ధు. ఆ వెంటనే పార్ధు, సూరిలు పొలం దగ్గర బట్టలు శుభ్రం చేసుకుంటారు.
కోటి మందు తాగుతుండగా కుమారి బట్టలు అడ్డు పెడుతుంది. ఇది చూసిన ప్రమీలా మండిపడుతుంది. నెల రోజుల్లో అప్పు కట్టకపోతే మనం ఉండటానికి ఈ నీడ కూడా ఉండదన్న బాధ లేదా అని కోటికి గడ్డి పెడుతుంది. ఎందుకు ఇంటికి ఆలస్యంగా వచ్చావని తల్లిని అడుగుతుంది భానుమతి. విశ్వనాథం గారి ఇంటికి వచ్చిన అబ్బాయి బురదలో పడటంతో జలుబు చేసిందని, అక్కడే ఉండి మిరియాల రసం కావాలంటే పెట్టానని చెబుతుంది ప్రమీల. అది పార్ధునే అని తెలుసుకున్న భానుమతి బాధపడుతుంది.
పార్ధు తుమ్ముతూ బాధపడుతుండగా భానుమతి వస్తుంది. జీపు అబ్బాయి అని , బావా అని పిలుపు వినిపించడంతో పార్ధు కంగారుపడి అటు ఇటూ చూస్తాడు. ఇంతలో బయట భానుమతి కనిపిస్తుంది. నేను బాగా ఏడిపించానని.. మీరు బురదలో పడతారని అనుకోలేదని పార్ధుకి సారీ చెబుతుంది. ఏదో కాషాయం తీసుకొచ్చి తాగమని ఇస్తుంది భానుమతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











