Bhanumathi March 17th Episode: భానుమతి చేతుల్లో భువనకి అవమానం.. రగిలిపోతోన్న శాంభవి

పిల్లలు పొట్లకాయ విసిరి పాము పాము అని అరవడంతో భయం వేసి పార్ధు, భానుమతిలు ఒకరికొకరు పట్టుకుంటారు. ఇదంతా చూసిన సూరి వచ్చి ఏంటి సంగతి అనే అడిగేసరికి పార్ధు సిగ్గుపడతాడు. వీరి మాటలను భువని విని వెంటనే శాంభవితో చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. పార్ధు పెళ్లి గురించి బాధపడుతున్న బలరామ్ దగ్గరికి ఓ ఫోటో తీసుకొచ్చి బాగా చదువుకున్న అమ్మాయి అని చెబుతాడు విశ్వనాథం. బాగా చదువుకున్న అమ్మాయిలు నా కొడుకుని హీనంగా చూస్తున్నారని చెబుతాడు బలరామ్.

సీతారాముల కళ్యాణానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు తీసుకుని వస్తున్న బలరామ్‌ని తాగిన మైకంలో కోటిగాడు తగలడంతో స్వామి వారి పూజా సామాగ్రి కిందపడిపోతుండగా పార్ధు పట్టుకుంటాడు. మా నాన్ననే గుద్దుతావా అంటూ కోటిని పార్ధు కొట్టబోతుండగా బలరామ్ ఆపుతాడు. కళ్యాణానికి వచ్చిన ఆడపిల్లల్లో ఒక్కరు కూడా పార్ధుకి సెట్ కాలేదని బలరామ్ బాధపడతాడు. ఇంతలో పార్ధు, భానుమతి పక్కపక్కనే నిలబడి రాములవారికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఈలోగా స్వామి వారికి తీసుకొస్తున్న పూలదండ వారి మెడలో పడుతుంది. ఇదంతా శారద, భువన, శాంభవి చూస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 17వ తేదీ ఎపిసోడ్ 7లో ఏం జరిగిందంటే?

Bhanumathi Serial Today s Episode 7 March 17th 2025 Here is full story

నేను తీసుకొచ్చిన కాషాయంతో మీ జలుబు పోయిందా అని పార్ధుని అడుగుతుంది భానుమతి. వీరిద్దరిని శాంభవి - భువనలు చూస్తారు. రాత్రి బావ కలవడానికి వచ్చింది ఈ అమ్మాయేనా అని తల్లిని అడుగుతుంది భువన. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తున్నట్లుగా ఉందని అనుమాన పడుతుంది శాంభవి. దీని సంగతి చెబుతానంటూ భువన ఆవేశపడుతుండగా శాంభవి అడ్డుకుంటుంది. పార్ధు ఇష్టపడుతున్నాడని తెలిస్తే ఈ అమ్మాయినే ఇచ్చి మీ మావయ్య పెళ్లి చేస్తాడని వార్నింగ్ ఇస్తుంది శాంభవి.

ఇంతలో అమ్మ చైన్ కనిపించకపోయేసరికి పార్ధు బాధపడతాడు. ఇక్కడే ఎక్కడో పడి ఉంటుంది కంగారు పడొద్దని చెబుతుంది భానుమతి. ఇంతలో సూకి కూడా విషయం చెప్పడంతో ఇద్దరూ కలిసి చైన్ వెతుకుతారు. ఇంతలో కుమారి కొబ్బరి చిప్ప తింటూ భానుమతికి కనిపిస్తుంది. అయితే నాయనమ్మ మీద భానుమతికి అనుమానం వచ్చి నిలదీస్తుంది. నాకు ఏ చైన్ దొరకలేదని అంటుంది కుమారి. ఆ జీపు అబ్బాయి చైన్ కొట్టేసిందని వసుకి చెబుతుంది కుమారి. నేను ఏది కొట్టేయలేదని దానంతట అదే దొరికిందని చెప్పి చైన్ ఇచ్చేస్తుంది.

చైన్‌తో పాటు భానుమతి దేవుడి దగ్గర పెట్టమని ఇచ్చిన పెన్ కూడా దొరకడంతో కుమారి మీద మండిపడుతుంది. బయటివాళ్లవే కాకుండా మన వస్తువుల్ని కూడా కొట్టేస్తున్నావా అని ఫైర్ అవుతుంది. ఇది ఆ జీపు అబ్బాయి చైన్ అని ఇది వాళ్ల అమ్మ జ్ఞాపకంగా దాచుకున్నాడని అంటుంది భానుమతి. తాగడానికి బయటికి వచ్చిన బలరామ్ పెద్ద కొడుకుని పిల్లలు పట్టుకుంటారు. చైన్ దొరక్క బాధపడుతున్న పార్ధు దగ్గరికి వస్తుంది భానుమతి. చైన్ దొరికేదాకా వెతకాలి కదా? ఆపేశారేంటీ అని అడుగుతుంది . ఇంతమందిలో అది ఎప్పుడో ఎవరికో దొరికి ఉంటుందని చెబుతాడు.

దొరక్కపోతే ఏముంది? ఇంకొకటి కొనుక్కోవచ్చు అని భానుమతి చెబుతుంది. దానిని మా అమ్మ జ్ఞాపకంగా దాచుకున్నానని.. రోజు రాత్రి మా అమ్మ ఫోటో దగ్గర పెట్టి, పొద్దున్నే దీపం వెలిగించి మెడలో వేసుకుంటానని చెబుతాడు. అది నాతో ఉంటే మా అమ్మ నాతో ఉన్నట్లేనని అనుకుంటానని అంటాడు. మీ అమ్మగారు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లేదని చెప్పి పార్ధుకి చైన్‌ని ఇస్తుంది భానుమతి. దానిని చూసి పార్ధు ఎంతో సంతోషిస్తాడు. దాంతో భానుమతి చేయి పట్టుకుని చాలా థ్యాంక్స్ చెబుతాడు. వీరిద్దరిని శారద, శాంభవి, భువన చూస్తారు.

కళ్యాణం మొదలవుతోందని త్వరగా వెళ్దామని అంటుంది భానుమతి. అది చేయించేది మేమేనని అంటాడు పార్ధు. దాంతో ఇద్దరూ కలిసి ఆలయంలోకి వెళ్తారు. చైన్ దొరికిందన్న సంగతి తెలియక సూరి ఇంకా వెతుకుతూనే ఉంటాడు. ఇంతలో కుమారి వచ్చి ఏం వెతుకుతున్నావ్ అని అడుగుతుంది. కళ్యాణం దగ్గర పార్థు కనిపించకపోయేసరికి భానుమతి టెన్షన్ పడుతుంది. నా చైన్ దొరికితే టెంకాయ కొడతానని మొక్కుకున్నానని చెబుతాడు. అనంతరం భానుమతిని తీసుకెళ్లి ఇద్దరు కలిసి కొబ్బరికాయ కొడతారు. ఇంతలో వీరిద్దరిని శారద చూస్తుంది. అటుగా శాంభవి వస్తుండటం చూసిన శారద కారులో కొబ్బరికాయలు ఉన్నాయని వాటిని తీసుకొద్దామని చెప్పి పక్కకి తీసుకెళ్తుంది.

ఇంతలో ఓ పెద్దాయన వచ్చి పార్ధుని గుర్తుపట్టి పలకరించి పక్కనే ఉన్న భానుమతి ఎవరు అని అడగ్గా నా మరదలు అనపి చెబుతాడు పార్ధు. ఆ మాటలతో భానుమతి షాక్ అవుతుంది. ఎందుకు అలా చెప్పారని పార్ధు అడగ్గా.. ఆయనది మీ వూరేనని, నువ్వు ఎవరో అబ్బాయితో తిరుగుతున్నావని తప్పుగా అనుకుంటారని అలా చెప్పానని అంటాడు. నాకు మా అమ్మంటే ప్రాణమని.. బతికుంటే ఆమెను దేవతలా చూసుకునేవాడినని చెబుతాడు పార్ధు. ఈ చైన్ నాకు దూరమై ఉంటే నేను ఏమైపోయేవాడినో అని అంటాడు.

నేనెవరో తెలియకుండానే నా కోసం బస్సును ఆపారని.. నా కోసం ఆ పోకిరిగాళ్లని కొట్టారని, నేను ఎంత ఏడిపించినా మీరేం అనలేదని అంటుంది పార్ధు. ఇంతలో సూరి వచ్చి దేవుడి విగ్రహాలు తీసుకురావాలని చెప్పి పార్ధు మెడలో చైన్ చూస్తాడు. భువన ఫోన్ మాట్లాడుతుండగా పిల్లలు ఆమెను డిస్ట్రబ్ చేయడంతో వాళ్లపై కోప్పడి పక్కకి తోసేస్తుంది. దీంతో పడిపోతున్న పిల్లలని భానుమతి పట్టుకుంటుంది. పిల్లలను ఎందుకు తోశారని భువనతో గొడవ పడుతుంది , మర్యాదగా పిల్లలకి సారీ చెప్పమంటుంది.

నేనెవరో నీకు తెలుసా? అని భువన కోప్పడగా ఇంతలో పార్ధు అక్కడికొచ్చి సారీ చెప్పమని అంటాడు. నేను అంతా చూశానని తప్పు చేసినప్పుడు సారీ చెప్పమని అంటాడు. ఆ వెంటనే శాంభవి వచ్చి బావా చెప్పిన తర్వాత కూడా అలా చూస్తావేంటీ సారీ చెప్పమని కూతురితో అంటుంది. దీంతో చేసేది లేక భువన పిల్లలకి సారీ చెబుతుంది. మీ నాన్న నీకన్నా స్ట్రిక్టా ఇంత ఖచ్చితంగా ఉన్నావని భానుమతిని అడుగుతాడు. దీంతో మా చెల్లి కనిపించడం లేదు నేను వెళ్లాలని చెప్పి తప్పించుకుంటుంది భానుమతి. పేకాటలో మొత్తం పొగొట్టుకుంటాడు కోటీ.

దేవుడి విగ్రహాలు తీసుకెళ్లడానికి ఊరి పెద్ద భూషణం గారి అమ్మాయి లేదని పంతులుగారు బాధపడుతుంటారు. ఇంతలో పార్ధుకి భానుమతి కనిపించడంతో ఆ అమ్మాయే తీసుకెళ్లాలా? లేక ఇంకెవరైనా తీసుకెళ్లాలా? అని అడుగుతాడు. మంచి మనసున్న వారు ఎవరైనా తీసుకెళ్లొచ్చు అని పంతులుగారు చెబుతారు. వెంటనే భానుమతిని పిలిచి కళ్యాణ మండపంలోకి రాములోరి విగ్రహాన్ని నువ్వు తీసుకొస్తావా అని పార్ధుఅడగ్గా.. అంతకన్నా అదృష్టమా ఖచ్చితంగా తీసుకెళ్తానని అంటుంది భానుమతి. సీతారాములు మమ్మల్ని కలిపారని.. ఈ బస్సు అమ్మాయే నాకు భార్యగా వస్తుందని సూరితో అంటాడు పార్ధు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Read more about: bhanumathi sai kiran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X