Bhanumathi March 18th Episode: కోటిని నెట్టేయమన్న బలరామ్.. నిజం తెలుసుకున్న పార్ధు
భానుమతి - పార్ధులు మాట్లాడుకుంటూ ఉండగా శాంభవి - భువనలు చూస్తారు. ఇంతలో అమ్మ చైన్ కనిపించకపోవడంతో పార్ధు బాధపడతాడు. సూరి, భానుమతి, పార్ధులు చైన్ కోసం వెతుకుతుండగా కొబ్బరిచిప్ప తింటూ కనిపిస్తూ భానుమతికి కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి నీలదీయగా చైన్ తీసి ఇచ్చేస్తుంది. చైన్ కోసం బాధపడుతున్న పార్ధు దగ్గరికి వెళ్లి అది ఇవ్వడంతో అతను చాలా సంతోషిస్తాడు.
తన చైన్ దొరకడంతో దేవుడికి టెంకాయ కొడతానని మొక్కుకున్నానని భానుమతిని తీసుకుని వెళ్తాడు పార్ధు. వీరిద్దరిని శారద చూసి సంతోషిస్తుంది. ఊరి పెద్ద మనిషి ఒకరు వచ్చి పార్ధుని గుర్తుపట్టి పక్కనే ఉన్న భానుమతిని ఎవరు అని అడగ్గా నా మరదలు అని చెబుతాడు పార్ధు. సీతారాముల విగ్రహాలు తీసుకెళ్లడానికి గ్రామ పెద్ద కూతురు లేకపోవడంతో భానుమతి సాయం తీసుకుంటాడు పార్ధు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 18వ తేదీ ఎపిసోడ్ 8లో ఏం జరిగిందంటే?

పార్ధు పక్కన రాములోరి విగ్రహం పట్టుకున్న భానుమతిని చూసి భువన రగిలిపోతుంది. అనంతరం పార్ధు, భానుమతిలు ఊరేగింపుగా సీతారాముల విగ్రహాలను కళ్యాణవేదిక వద్దకు తీసుకొస్తారు. అనంతరం పార్ధు , భానుమతి ఎదురెదురుగా కూర్చొని కళ్యాణం జరిపిస్తారు. వీరిద్దరిని శారద చూసుకుని మురిసిపోతుంది. కళ్యాణాన్ని విజయవంతంగా జరిపించారని, మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పమని పంతులుగారు బలరామ్‌కు చెబుతాడు. నెల రోజుల్లో నా కొడుక్కి పెళ్లి చేస్తానని శపథం చేశానని, నా కొడుక్కి మంచి అమ్మాయి భార్యగా వచ్చేలా చేయమని రాములోరిని వేడుకుంటాడు బలరామ్.
అలాగే నేను కోరుకున్న బస్సు అమ్మాయితో నా పెళ్లి జరగాలని, అందుకు నా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవాలని కోరుకుంటాడు పార్ధు. ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను నీట్ ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటుంది భానుమతి. కళ్యాణం అనంతరం పార్ధు, భానుమతి ఇద్దరూ కలిసి భోజనాలు వడ్డిస్తారు. వాళ్లని చూసి భువన, శాంభవిలు రగిలిపోతారు. ఇంతలో లడ్డూని తినాలని భానుమతిని బలవంతం చేస్తాడు పార్ధు. దీనిని చూసిన శాంభవి, పార్ధులు షాక్ అవుతారు. శారద తన భర్త ఎక్కడో చూస్తాడని టెన్షన్ పడతారు. అనంతరం లడ్డూని చెరిసగం పంచుకుని తింటారు పార్ధు - భానుమతి.
ఇంతలో భానుమతి మెడలో మూడు ముళ్లు వేసినట్లుగా కలగంటాడు పార్ధు. సూరి వచ్చి నాన్న గారు పిలుస్తున్నారని చెప్పడంతో లోపలికి వెళ్తాడు పార్ధు. ఊరి పెద్దలంతా బలరామ్ దగ్గరికి వచ్చి.. ఆ కాలంలోకి వెళ్లి సీతారాముల కళ్యాణం చూసినట్లుగా అనిపించిందని, అంత ఘనంగా జరిపించారని మెచ్చుకుంటారు. ఈ మాటలు విన్న శక్తి.. ఇంతకన్నా ఘనంగా మనం కూడా సీతారాముల కళ్యాణం జరిపించే రోజు వస్తుందని భర్తతో అంటుంది. ముందు నీ కొడుకు కళ్యాణం చేసుకునేలా ఉన్నాడని చెప్పి అటు తిప్పి చూపించగా ఆమె కొడుకు ఎవరో అమ్మాయిని ఫోటో తీస్తూ కనిపిస్తాడు. దీంతో మండిపడ్డ శక్తి కొడుకు దగ్గరికి వెళ్లి ఫోను లాక్కుంటుంది.
విశ్వనాథం దంపతుల దగ్గరికి శారద వెళ్లి మాట్లాడుతుంది. మా రాముడికి ఎంత మంది అమ్మాయిలను తీసుకొచ్చినా నచ్చడం లేదని, నీక్కూడా నచ్చడం లేదా అని అడుగుతాడు విశ్వనాథం. పార్ధుకి ఈ వూరిలో ఒక అమ్మాయి నచ్చిందని శారద చెప్పేసరికి విశ్వనాథం దంపతులు ఎంతో సంతోషిస్తారు. ఎవరు అని అడగ్గా.. శారద అటు ఇటు చూసి ఇక్కడే ఎక్కడో ఉండాలని అంటుంది. ఇంటికి వెళ్లాక నేను ఆయనతో మాట్లాడతానని చెబుతుంది.
పంతులుగారు కరెక్ట్‌గానే చెప్పారని.. సీతారాముల కళ్యాణం జరిగితే పార్ధుకి నచ్చిన అమ్మాయి కూడా దొరికిందని విశ్వనాథం దంపతులు సంతోషిస్తారు. శక్తి కొడుకు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి నీ నెంబర్ ఇవ్వు, నీకు గిఫ్ట్ కొని తీసుకొస్తానని అంటాడు. ఇంతలో భానుమతి వచ్చి గిఫ్ట్ కొని తీసుకొస్తే అమ్మాయిలు పడిపోతారా? అని మండిపడుతుంది. ఇది నీకు అనవసరమని శక్తి కొడుకు మండిపడతాడు. ఈమె నా ఫ్రెండ్ అని నాకెందుకు అనవసరమని ప్రశ్నిస్తుంది భానుమతి. మా ఊరి అమ్మాయిల జోలికి వస్తే మళ్లీ ఈ ఊరిలో అడుగుపెట్టకుండా చేస్తానని వార్నింగ్ ఇస్తుంది భానుమతి.
పేకాటలో ఓడిపోవడంతో డబ్బులు ఇవ్వమని కోటితో గొడవపడతారు పేకాటరాయుళ్లు. డబ్బులు లేనప్పుడు ఎందుకు ఆడావంటూ మండిపడతారు. నా దగ్గర డబ్బులు లేవని కోటిగాడి జేబుల్లో డబ్బుల కోసం వెతుకుతారు. నిక్కరు జేబులో డబ్బులు ఉన్నాయని ఇస్తానని చెప్పి బురిడి కొట్టేసి పారిపోతాడు కోటిగాడు. వాడిని వెంటాడుతూ పేకాటరాయుళ్లు పరుగులు తీయగా కోటిగాడు బలరామ్ కారు మీద పడతాడు. దాంతో కోప్పడిన బలరామ్.. వీడికి తాగి ఎవడో ఒకడిని గుద్ధడం అలవాటైపోయిందని , లాగిపడేయమని చెప్పడంతో పార్ధు ఆవేశంగా వెళ్తాడు.
కోటిగాడిని కొట్టడానికి వెళ్తున్న పార్ధుని ఆపుతాడు సూరి. ఆ తాగుబోతు బస్సు అమ్మాయి తండ్రి అని చెప్పడంతో.. అంత మంచి అమ్మాయికి ఇలాంటి తండ్రా అని బాధపడతాడు పార్ధు. ఇంతలో కోటిగాడు మందుతాగి తనను తరుముతూ వచ్చిన వాడిని కొడతాడు. దాంతో సూరి వెళ్లి వాళ్లిద్దరిని వీడదీస్తాడు. వాడిని సార్ అంటున్నావేంట్రా చెప్పు తీసుకుని కొట్టకుండా అని మండిపడతాడు బలరామ్. ఇలాంటి వాడి కూతురని తెలిస్తే నాన్న బస్సు అమ్మాయిని తక్కువగా చూస్తాడని బాధపడతాడు పార్ధు. ఊరికి బయల్దేరుతుండగా పార్ధుకి భానుమతి కనిపిస్తుంది.
రాత్రి నిద్రపోకుండా కోటిగాడి గురించి ఆలోచిస్తుంటాడు పార్ధు. ఇంతలో సూరి వచ్చి ఎందుకింత టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు. పరువుగా ఉండాలి, ప్రతిష్ట కోసం బతకాలి అంటాడు మా నాన్న.. పనికిమాలిన తనానికి పరాకాష్టలా ఉన్నాడు ఆ బస్సు అమ్మాయి తండ్రి. వీరిద్దరి మధ్య నా ప్రేమ ఏమైపోతుందోనని బాధపడతాడు పార్ధు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











