Bhanumathi March 19th Episode: కోటి ముందు భానుమతి కిడ్నాప్ .. ప్రియురాలిని రక్షించిన పార్ధు
పార్ధు పక్కన రాములోరిని తీసుకొస్తున్న భానుమతిని చూసి భువన - శాంభవి రగిలిపోతారు. బలరామ్ చేతుల మీదుగా కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతుంది. నెల రోజుల లోపు నా కొడుకుకి తగ్గ పిల్లని చూసి పెళ్లి చేయాలని దేవుడిని మొక్కుకుంటాడు బలరామ్. కళ్యాణానికి వచ్చిన అతిథులందరికీ పార్దు, భానుమతిలు వడ్డిస్తూ లడ్డూని సగం సగం చేసుకుని తింటారు. ఇదంతా చూసిన శారద ఎంతో సంతోషిస్తుంది.
కళ్యాణానికి వచ్చిన తన ఫ్రెండ్‌ని శక్తి కొడుకు ఏడిపిస్తుండటంతో ఆమెకు వార్నింగ్ ఇస్తుంది భానుమతి. పేకాటలో మొత్తం ఓడిపోయి డబ్బులు ఇవ్వకుండా పారిపోతాడు కోటి. వాడిని వెతుక్కుంటూ ఓ వ్యక్తి రావడంతో కోటిగాడు వెళ్లి బలరామ్ కారుపై పడతాడు. వీడు పనికిమాలిన వాడిలా ఉన్నాడని పక్కకి నెట్టేయమంటాడు బలరామ్. దీంతో పార్ధు కోపంగా కోటి మీదక వెళ్తుండగా సూరి అడ్డుకుని, ఆ తాగుబోతు బస్సు అమ్మాయి తండ్రి అని చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 19వ తేదీ ఎపిసోడ్ 9లో ఏం జరిగిందంటే?

భానుమతి ఆ తాగుబోతు కూతురని తెలుసుకున్న పార్ధు తన ప్రేమను, పెళ్లిని నాన్న ఒప్పుకుంటాడా? లేదా? అని సూరితో చెప్పుకుని బాధపడతాడు. నువ్వు పెళ్లి చేసుకునేది ఆ పిల్లను కానీ, ఆ పిల్ల తండ్రిని కాదు కదా అంటాడు సూరి. పరిస్ధితి అర్ధం చేసుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడావంటే కొట్టేస్తానని అంటాడు పార్ధు. నువ్వు పొలంలో విత్తనాలు వేయకుండానే పంట చేతికి రావడం గురించి ఆలోచిస్తున్నావని అంటాడు సూరి. నీ ప్రేమ గురించి ఇప్పటి వరకు ఆ బస్సు అమ్మాయికి చెప్పలేదు? ఆ బస్సు అమ్మాయి కూడా తిరిగి నిన్ను ప్రేమిస్తుందో లేదో కూడా తెలియదు అని చెబుతాడు.
ఇదేం తేలకుండా మీ నాన్నకి చెప్పడం గురించి ఆలోచిస్తున్నావా అని ప్రశ్నిస్తాడు. ముందు నీ ప్రేమ గురించి ఆ బస్సు అమ్మాయికి చెప్పు.. ఒప్పుకుంటే అప్పుడు మీ నాన్న గురించి ఆలోచించు అని చెబుతాడు సూరి. ముందు నీ ప్రేమ గురించి ఆ బస్సు అమ్మాయికి ఎలా చెప్పాలో అది ఆలోచించు అంటాడు. ఆ బస్సు అమ్మాయి నన్ను సైలెంట్‌గా ప్రేమిస్తోందని అది చెప్పాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అని మనసులో అనుకుంటాడు పార్ధు.
పార్ధు పెళ్లి గురించి, చేసిన శపథం గురించి ఆలోచిస్తూ ఉంటాడు బలరామ్. ఇంతలో శారద వచ్చి ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారని అడుగుతుంది. పిల్లలకు ఏం కావాలో , ఏమిస్తే వాళ్లు సంతోషంగా ఉంటారో మీకు తెలుసు అని అంటుంది శారద. ఏం కావాలో వాడికి తెలుసు, తెచ్చి ఇవ్వగలిగే స్తోమత కూడా మనకు ఉంది.. కానీ వాళ్లకి కావాల్సింది మనకు దొరకాలి కదా అని అంటాడు బలరామ్. మన పార్ధుకి ఏం తక్కువ అని శారద ప్రశ్నించగా.. పార్ధుకి తగిన అమ్మాయిని వెతకడం, కొంచెం కష్టమే అనిపిస్తుందని బాధపడతాడు.
మీ కష్టాన్ని అర్ధం చేసుకున్నాడో ఏమో, పార్ధునే ఒక అమ్మాయిని చూసుకున్నాడని అంటుంది శారద. ఆ మాటలతో బలరామ్ షాక్ అవుతాడు. సీతారాముల కళ్యాణానికి వచ్చి తన సీతను తానే వెతుక్కున్నాడని అంటుంది. గుడిలో ఒకమ్మాయిని చూసి పార్ధునే ఇష్టపడ్డాడని చెబుతుంది. ఆ అమ్మాయి ఎవరో తెలియదని.. కానీ మీరు కూడా చూశారని అంటుంది శారద. సీతారాముల కళ్యాణంలో గుడి తరపున కూర్చొంది కదా అని గుర్తుచేస్తుంది. కళ్యాణంలో భానుమతిని గుర్తుచేసుకున్న బలరామ్.. నిజంగా చూడచక్కగా ఉందని అంటాడు.
సంస్కారం, సాంప్రదాయం అన్ని కలగలిపిన పిల్లలా ఉందని అంటుంది శారద. ఆ అమ్మాయిని పార్ధు ఇష్టపడ్డాడని నీకెలా తెలుసు అని బలరామ్ ప్రశ్నిస్తాడు. ఆ అమ్మాయిని చూడగానే పార్ధులో ఏదో ఆనందం కనిపించేదని చెబుతుంది శారద. బాగానే గమనించావని శారదని మెచ్చుకుంటాడు బలరామ్. పార్ధు ఆ అమ్మాయిని ఇష్టపడితే, ఆ అమ్మాయి కూడా పార్ధుకి అన్ని రకాలుగా సరిజోడి అనిపిస్తే ఆ అమ్మాయినే ఇచ్చి పార్ధు పెళ్లి చేయిస్తానని అంటాడు బలరామ్. ముందు ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలని.. ఆలస్యం చేయడం కరెక్ట్ కాదని అంటుంది శారద.
కోటిగాడు, భానుమతి కూరగాయలు తీసుకుని వస్తుండగా కొందరు కారులో వచ్చి వాళ్లని అడ్డగిస్తారు. నా దగ్గర తీసుకున్న లక్ష రూపాయలు ఇవ్వమని ఓ వ్యక్తి కోటిని బెదిరిస్తాడు. ఊరు నిండా ఇంకెన్ని అప్పులు చేస్తావని మండిపడుతుంది భానుమతి. మీ ఇద్దరి పంచాయతీ తర్వాత ముందు నా అప్పు తీర్చమని ఆ వ్యక్తి వార్నింగ్ ఇస్తాడు. ముందు వీడిని కారెక్కించడని తన మనుషులకు చెబుతాడు. దాంతో భానుమతి కంగారు పడి, మా నాన్నని వదిలేయమని బ్రతిమలాడుతుంది.
కోటిగాడిని వదిలేసి ముందు దీనిని ఎక్కించండి అంటాడు. ఈ గొడవని అటుగా వెళ్తున్న పార్ధు చూసి రౌడీలతో గొడవ పడతాడు. అప్పు ఇచ్చేవాడికి వసూలు చేసుకునే అధికారం లేదా అని అడుగుతాడు ఆ రౌడీ. ఆ అధికారం నీకున్నా అడితే పద్ధతి ఇది కాదని అంటాడు సూరి. వీడిని అడిగి అలిసిపోయామని కోటిగాడి గురించి చెబుతాడు. వాడు ఇవ్వకపోతే మీరిస్తారా? లక్షరూపాయలు అని అడుగుతాడు. దాంతో సూరిని పిలిచి డబ్బు తీసుకొచ్చి ఇస్తాడు.
సమస్య మాదని పరిష్కారం కూడా మేం చూసుకుంటామని, ఇలా సాయం చేసి మీకు రుణపడేలా చేయొద్దని బతిమలాడుతుంది భానుమతి. వరమిచ్చే వాళ్లని వద్దని ఆపకూడదని కోటిగాడు మండిపడతాడు. మా సమస్యలో మీరెందుకు తలదూర్చొద్దని చెబుతుంది భానుమతి. ఒకరి సమస్యల్లో మరొకరు ఆదుకోవాలని.. అయినా ఇలాంటి వాళ్ల చేతిలో అవమానపడటం కంటే నా లాంటి వాళ్ల దగ్గర సాయం తీసుకోవడమే మంచిదని అంటాడు పార్ధు. భానుమతి ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ఆ రౌడీకి అప్పు కట్టేస్తాడు పార్ధు. ఇంకెప్పుడూ ఈ కుటుంబం జోలికి రావొద్దని వార్నింగ్ ఇస్తాడు.
థ్యాంక్స్ అనేది చాలా చిన్నపదమని.. కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటామని అంటుంది భానుమతి. ప్రపోజ్ చేద్దామని వచ్చి ఫైట్ చేశానని సూరితో అంటాడు పార్ధు. ఇదంతా దూరం నుంచి శాంభవి చూస్తుంది. పార్ధు సాయం చేసే వరకు వచ్చాడంటే ఆ అమ్మాయి మీద ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్లేనని , దానిని ఇక్కడే కట్ చేయాలని అనుకుంటుంది. ఇంటి దగ్గర కుమారి తొక్కుడు బిల్ల ఆడుకుంటుంది. ఇంటి బయట చీరలు అమ్ముకునే వ్యక్తికి చీరలు కనిపించక టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో భానుమతి వచ్చి అతనెవరు అని అడగ్గా.. ఇందాకటి నుంచి నాకు సైట్ కొడుతున్నాడని అంటుంది కుమారి.
దాంతో భానుమతికి డౌట్ వచ్చి ఆ చీరలు అమ్ముకునే వ్యక్తిని పిలిచి ఏమైంది? ఎందుకలా వెతుకుతున్నావ్? అని అప్రశ్నిస్తుంది. నేను బయటి నుంచి లోపలికి వచ్చేసరికి చీరలు కనిపించడం లేదని చెబుతాడు. అయితే నువ్వు ఆ పక్కన వెతుకు, నేను ఈ పక్కన వెతుకుతానని అంటుంది కుమారి. దాంతో అసలు ఆ చీరలు ఎక్కడ దాచావ్ చెప్పు అని అడుగుతుంది భానుమతి. మీ అమ్మకి మంచి చీరలు లేవని నేనే కొట్టేశానని అంటుంది కుమారి. చీరలు తీసుకుని చీరలమ్మే వ్యక్తికి ఇచ్చి ఇంకోసారి ఇటువైపు రాకు, కొనేవాళ్ల కన్నా కొట్టేసేవాళ్లే ఎక్కువుంటారని చెబుతుంది భానుమతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











