Bigg Boss Buzzz: ఇమ్మానుయేల్ బాగోతం బయటపెట్టిన భరణి.. తనుజా వల్లే ఈ పరిస్థితి అంటూ..
Bharani Bigg Boss Buzzz: బిగ్ బాస్ సీజన్ 9లో బిగ్ బాస్ హౌస్ పెద్దగా, నాన్న గా ముద్రవేసున్నారు భరణి శంకర్. అందరితో బాండింగ్ పెంచుకుంటూ రేలంగి మామయ్య మారారు. తన గేమ్ చూసి భరణి టాప్ 5 లో నిలబడతాడని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావించారు. దివ్య ఎంట్రీ తర్వాత భరణి-తనుజ-దివ్య మధ్య చిన్న బాండింగ్‌లతో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఆయన ఏర్పర్చుకున్న బంధాలే బంధనాలు గా మారాయి. దీంతో చివరికి ఆరోవారం అనూహ్యంగా భరణి ఎలిమినేషన్ కావాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా భరణి తన మంచితనం వదలలేదు.
రాము రాథోడ్ వద్దకు వెళ్లి హగ్ చేసి, ప్రేమతో కిస్ ఇచ్చి హౌస్ నుంచి జెంటిల్మెన్ లా బయలుదేరాడు. సంజనాతో కూడా "నాకు నీపై చెడు అభిప్రాయం లేదు" అని క్లారిటీ ఇచ్చాడు. పవన్ పై కూడా హౌస్‌లో ఏవైనా తప్పులు జరిగితే "నీకు మాత్రమే పవన్" అంటూ క్షమాపణ చెప్పాడు. వాస్తవానికి భరణిని సేవ్ చేసే అవకాశం ఇమ్మానుయేల్ చేతిలో ఉంది, కానీ పవర్ అస్త్ర ఉపయోగించి రాము రాథోడ్‌ని సేవ్ చేశాడు. భరణి, ఇమ్మానుయేల్ మధ్య మంచి బాండింగ్ ఉండేది, కానీ ఇమ్మానుయేల్ తనను రాముని సేవ్ చేయడం వల్ల భరణి ఎలిమినేట్ అయ్యాడు. భరణి హౌస్‌లో గేమ్ బాగా ఆడినప్పటికీ, కొన్ని పరిస్థితుల వల్ల బయటకు వెళ్లాల్సి వచ్చింది.

బిగ్‌బాస్ హౌస్ కు గుడ్ బై చెప్పక.. శివాజీ బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి వచ్చారు. ఈ సమయంలో శివాజీ, భరణి మధ్య జరిగిన సంభాషణలు, సార్కాస్టిక్ సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆట ఆడటానికి హౌస్‌లోకి వచ్చిన భరణి, ఇంట్లో అడుగుపెట్టగానే "ఇంటింటి రామాయణం" సీరియల్ మొదలుపెట్టాడంటూ శివాజీ వేసిన కామెంట్లు నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీశాయి.
హౌస్‌లోకి ఎంటర్ అయిన వెంటనే భరణికి శివాజీ స్వాగతం పలికాడు. "ఆటాడటానికి వచ్చాడు కానీ సీరియల్ మొదలుపెట్టాడు" అంటూ పంచ్ వేశాడు. చేతిలో స్వీట్స్ తీసుకుని "ఇదీ నీకోసం... ఇదీ నీ అమ్మాయికోసం..." అంటూ ఒక్కొక్కటీ భరణికి ఇచ్చాడు. భరణి కూడా నవ్వుతూ తీసుకున్నాడు కానీ శివాజీ అంతటితో ఆగలేదు. "ఇది ఎవరికో చెప్పు, అదీ ఎవరికో చెప్పు" అంటూ వరుసగా వెటకారాలు కొనసాగించాడు.
తర్వాత ఎపిసోడ్ కాస్త సీరియస్ మోడ్‌లోకి వెళ్లింది. 'కుటుంబం అన్నగారి కుటుంబం'అని శివాజీ పాట పాడగా.. ' ఈ బాండింగ్స్ నా గేమ్ పై ఎఫెక్ట్ పడ్డాయని భావించలేదు'అని భరణి రిప్లే ఇచ్చారు. "భరణి, నువ్వు గేమ్ ఆడను అంటున్నారు. కానీ గేమ్ ఆడలేదు... బాండింగ్స్‌లో ఇరుక్కుపోయావ్. ఈ కలుపుకోవటం, సెంటిమెంట్స్ అవసరమా ఈ హౌస్‌లో?" అంటూ శివాజీ ప్రశ్నించాడు. దీనికి భరణి తడబడకుండా స్పందిస్తూ, "నేను కలుపుకోలేదు కదండీ... పర్టికులర్‌గా ఇద్దరి దగ్గరా అయితే నేను ఆగిపోలేదు" అని క్లారిటీ ఇచ్చాడు.
కానీ శివాజీ మాత్రం వదిలిపెట్టలేదు. 'ఎక్కడ ఏం చేస్తే తనుజా ఫీల్ అవుతుందో.. మరోవైపు దివ్య ఫీల్ అవుతుందోనని గేమ్ ఆడలేదు' అని షాకింగ్ కామెంట్స్ చేశారు. 'నేను ఎవరి దగ్గరా ఆగిపోలేదు'అని భరణి రియాక్ట్ అవ్వగా.. "ఆగిపోకపోతే ఇవాళ నువ్వు బయటకి ఎందుకు వచ్చావ్? భరణి అన్న మాటలకి బయట ఊరుకుంటాడా?" అంటూ మరోసారి టీజ్ చేశాడు.
భరణి తన వాదనను కొనసాగిస్తూ, "నిలబడాల్సిన చోట మాట్లాడాల్సిన చోట గట్టిగానే మాట్లాడాను. ఆడిపోనని అనడం సరికాదు" అని కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు, శివాజీ "పవరాస్త్ర ను ఇమ్మానుయేల్ మీకు ఎందుకు వాడలేదు?" అని అడిగితే, "అది ఇమ్మానుయేల్ గేమ్ ప్లాన్" అని స్పష్టంగా చెప్పాడు భరణి. 'సంజనా నామినేట్ సమయంలో మీరు చాలా గట్టి గట్టిగా నేను సక్రిఫైజ్ చేస్తేనే ఇక్కడ ఉన్నావ్.. అంటూ ఎందుకు అరిచావ్.. రియల్ భరణి బయటకు వచ్చాడా?'అని ప్రశ్నించగా.. 'అక్కడి పరిస్థితులు వేరు.. నాకు ఉరికనే బీపీ లేస్తుంది. నేను స్టార్ టెంపర్'అని అసలు విషయాన్ని చెప్పారు భరణి
ఇక మరో సీన్‌లో సోషల్ మీడియాలో ఒక కామెంట్‌ని చదివి చూపించాడు శివాజీ. "ఎందుకంత సెంటిమెంట్? సింపథీ కోసమా?" అని కామెంట్‌లో రాయగా, భరణి తడబడకుండా "ఎవరన్నా వచ్చి నాకు బాధ చెప్పేవారు తప్ప, నేను బాధ చెప్పుకోవడానికి అక్కడ మనిషి ఎవరూ లేరు" అని చెప్పాడు. ఈ సమాధానం మాత్రం చాలా మందిని టచ్ చేసింది.
అయితే, మొత్తం ప్రోమోలో శివాజీ మాటలు పూర్తిగా భరణి మీదే ఉండడం, అతని బాండ్స్‌పై వెటకారంగా మాట్లాడడం, గేమ్ ఆడలేదని వ్యాఖ్యానించడం మాత్రం ప్రేక్షకులకు నచ్చలేదు. ఎందుకంటే భరణి చాలా టాస్కుల్లో పాల్గొని, అందరిలో మించి తన పెర్ఫార్మెన్స్ చూపించాడు. చాలా టాస్కుల్లో గెలిచాడు కూడా. కానీ ఆ అంశాన్ని పక్కనపెట్టి, "భరణి గేమ్ ఆడలేదు" అని కామెంట్ చేయడం కొంతమందికి శివాజీ డబుల్ స్టాండర్డ్‌గా అనిపించింది.
సోషల్ మీడియాలో కూడా విభిన్న కామెంట్స్ వస్తున్నాయి. కొందరు "శివాజీ కామెడీగా అన్నాడు" అంటుంటే, మరికొందరు "ఇది సరదా పేరుతో అవమానమే" అంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్ బిగ్‌బాస్ హౌస్‌లో మరోసారి టెన్షన్ వాతావరణాన్ని తీసుకువచ్చింది. శివాజీ చేసిన కామెంట్లు వినోదాన్ని ఇచ్చినా, భరణి మనసులో మాత్రం కొంత బాధ మిగిలిపోయినట్టే అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











