బిగ్ బాస్: షాకింగ్ సీక్రెట్.. ఆమెకు వారానికి 30 లక్షలు, ఇంత డిమాండ్ ఎందుకంటే!
బిగ్ బాస్.. ప్రస్తుతం ఇండియాలో తిరుగులేని రియాలిటీ షోగా మారిపోయింది. అన్ని భాషల్లో ఆడియన్స్ నుంచి ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. దీనితో నిర్వాహకులు సీజన్ సీజన్ కు మార్పులు చేస్తూ భారీ స్థాయిలో షోని నిర్వహిస్తున్నారు. టిఆర్పి రేటింగులు అదిరిపోతుండడంతో ఖర్చుకు వెనకాడకుండా బిగ్ బాస్ నిర్వహిస్తున్నారు. తాజగా బిగ్ బాస్ హిందీ 12వ సీజన్ ప్రారంభమైంది. కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ని జంటలుగా ఎంపిక చేయడం విశేషం. సభ్యుల రెమ్యునరేషన్ వివరాలు షాకింగ్ గా ఉన్నాయి.

టీవీ క్వీన్
బాలీవుడ్ లేడి కమెడియన్ భారతి సింగ్ టివి క్వీన్ గా మారిపోయింది. పలు టీవీషో లలో భారతి సింగ్ పెర్ఫామ్ చేస్తోంది. బుల్లితెరపై భారతి సింగ్ కనిపించే షోలకు విపరీతమైన డిమాండ్ ఉంది.

జంటగా కలసి
బిగ్ బాస్ హిందీ 12 వ సీజన్ ని విన్నూత్నంగా ప్లాన్ చేశారు. ఇంటి సభ్యులు ఈ షోలో జంటలుగా పాల్గొనబోతున్నారు. ఇటీవలే బిగ్ బాస్ 12 గోవాలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ షోలో భారతి సింగ్, ఆమె భర్త హార్ష్ కలసి పాల్గొనబోతున్నారు.

షాకింగ్ రెమ్యునరేషన్
ఈ షోలో భారతి సింగ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారతి సింగ్, హార్ష్ దంపతులు వారానికి 50 లక్షల పారితోషకం డిమాండ్ చేశారట. బుల్లి తెరపై భారతికి ఉన్న క్రేజ్ దృష్ట్యా వారికి అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్వాహకులు అంగీకరించినట్లు తెలుస్తోంది. భారతి సింగ్ వారానికి 30 లక్షలు, ఆమె భర్త హార్స్ 20 లక్షలు అందుకోబోతున్నారట.

ఇప్పటివరకు వారిద్దరే
బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటులు ఇద్దరే. దీపికా కాకర్ వారానికి 16 లక్షల రెమ్యునరేషన్ అందుకోగా, హీనా ఖాన్ 8 లక్షల పారితోషకం అందుకుంది. కానీ భారతీ సింగ్ 30 లక్షలు అందుకుంటూ కొత్త చరిత్ర సృష్టించింది.


Click it and Unblock the Notifications











