twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemla Nayak TRP: బుల్లి తెరపై దుమ్మురేపిన డీజే టిల్లు.. దారుణంగా భీమ్లా నాయక్ రేటింగ్

    |

    ఇటీవల కాలంలో స్టార్ హీరోలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ఏదో ఒక రికార్డును క్రియేట్ చేస్తూనే ఉంది. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తరువాత వారి రికార్డులకు సంబంధించిన వార్తలు అభిమానులకు తొందరగానే చేరుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో టెలివిజన్ లో కూడా సినిమాలు ఎలాంటి రిజల్ట్ అందుకున్నాయి అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా థియేటర్ లో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ బుల్లి తెరపై మొదటిసారి మాత్రం టిఆర్పి అందుకోవడంలో తీవ్రంగా నిరాశపరిచింది. డీజే టిల్లు సినిమా కంటే తక్కువగా టీఆర్పీ అందుకోవడం విశేషం. పూర్తి వివరాల్లోకి వెళితే..

    ఆ రూట్లో భారీగా..

    ఆ రూట్లో భారీగా..

    ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రతి రూట్లో కూడా ఒక మార్కెట్ అయితే ఏర్పడింది. థియేట్రికల్ బిజినెస్ తో పాటు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా అతి ముఖ్యమైనది. ఇక శాటిలైట్ రైట్స్ పరంగా కొన్ని పెద్ద సినిమాలు ఊహించిన దాని కంటే ఎక్కువ స్థాయిలో లాభాలు అందిస్తున్నాయి. భీమ్లా నాయక్ కూడా అలానే మంచి లాభాలు అందించింది. త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు అందించగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు.

    అందుకు భిన్నమైన రిజల్ట్..

    అందుకు భిన్నమైన రిజల్ట్..

    ఇక భీమ్లా నాయక్ సినిమాను కూడా నాన్ థియేట్రికల్ గా మంచి లాభాలను అందించింది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఓటీటీ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన తర్వాత ఈ సినిమా గత ఆదివారం స్టార్ మా లో కూడా ప్రసారమైంది. ఇక ఈ ప్రీమియర్స్ కు మొదట భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది అని అనుకున్నారు కానీ అందుకు భిన్నమైన రిజల్ట్ అందుకోవడం విశేషం.

    బాక్సాఫీస్ వద్ద..

    బాక్సాఫీస్ వద్ద..

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన మొట్ట మొదటి బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ పై మొదటి నుంచి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకుంది. కానీ పూర్తిస్థాయిలో మాత్రం అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోయింది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా చాలా తక్కువ కలెక్షన్స్ అందుకుంది.

     డీజే టిల్లు కంటే తక్కువగా..

    డీజే టిల్లు కంటే తక్కువగా..

    ఇప్పుడు టెలివిజన్ ప్రీవియర్స్ లో కూడా అనుకున్నంతగా పాజిటివ్ రిజల్ట్ ఏమీ అందుకోలేకపోయింది. అసలు పవన్ కళ్యాణ్ సినిమా ఈ స్థాయిలో అత్యంత తక్కువగా TRP రేటింగ్స్ అందుకోవడం షాకింగ్ అనే చెప్పాలి. అందులోనూ డీజే టిల్లు సినిమా కంటే తక్కువ టిఆర్పీ రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

    టిఆర్పీ ఎంతంటే..?

    టిఆర్పీ ఎంతంటే..?

    భీమ్లా నాయక్ సినిమా టెలివిజన్ ప్రీమియర్స్ కు 9.06 TRP వచ్చినట్లు తెలుస్తోంది. ఇక పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించింది. ఇక ఈ సినిమా మొదటిసారి టీవీలో వచ్చినప్పుడు భీమ్లా నాయక్ కంటే ఎక్కువ టిఆర్పి అందుకోవడం విశేషం. డీజే టిల్లు టెలివిజన్ ప్రీమియర్స్ కు 10.03 టిఆర్పి రావడం విశేషం.

    English summary
    Bheemla Nayak movie shocking television Premieres TRP
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X