Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్‌లో గంతకు తగ్గ బొంత... వీళ్లు ఎక్కడ దొరికార్రా బాబూ!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకూ ఇంట్రెస్ట్ గా సాగుతోంది. ఇక 6వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 7వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ షోలో మొదట 14మంది ఎంటర్ అవ్వగా.. ఐదో వారంలో మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ అయ్యారు. అయితే ఆ ఎంట్రీస్ లో ఓ ఇద్దరు మాత్రం హోస్ లో వింతగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్లు ఎవరో కాదు.. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తూ... పేరు తెచ్చుకుంటున్న అశ్విని శ్రీ, ఎన్నో సినిమాలకు పాటలకు మ్యూజిక్ అందించిన బోలే షవాలి. వీరు హౌస్ లో వింతగా ప్రవర్తిస్తున్నారు. దీంతో నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....
బిగ్ బాస్ హౌస్ లో 14 మంది ఎంటర్ అయ్యారు. ఇక అందులో మొదటి ఐదు వారాలు కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదో వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీస్ ద్వారా ఐదుగురు ఇంట్లోకి అడుగుపెట్టారు. అందులో అర్జున్ అంబటి, అశ్విని శ్రీ, బోలే షవాలి, నయని పవని, పూజా మూర్తి ఉన్నారు. ఇక హౌస్ లో వీళ్లు ఎంటర్ అయ్యాక ఆరో వారంలో నయని పవని ఎలిమినేట్ అయిపోయింది. దీంతో నెటిజన్స్ కూడా షాక్ అయ్యారు.

ఆ విషయం పక్కన పెడితే.. హౌస్ లో అడుగుపెట్టిన బోలే షవాలి, అశ్విని శ్రీలు మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. తనకు తాను పాట బిడ్డ అనుకుంటూ... బోలే షవాలి అయితే హోస్ లో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. సమయం, సందర్భం లేకుండా ఏవో మాట్లాడుతూ ఉంటారు. హౌస్ లో ఈయన్ని ఎవరైనా మందలించాలన్న కూడా భయపడిపోతున్నారు. ఇక బోలే ఎవరి దగ్గరికి వచ్చినా కూడా.. వచ్చాడ్రా బాబు.. అంటూ మొహం తిప్పేసుకుంటున్నారు.
ఇక అశ్విని శ్రీ విషయానికి వస్తే... ఆమె లోకం వేరని చెప్పాలి. ఎందుకు ఏడుస్తుందో తెలియదు.. ఎందుకు నవ్వుతుందో తెలియదు.. ఈమె ప్రవర్తనపై కూడా బాగా ట్రోలింగ్ వస్తుంది. ఇక దీనికి తోడు పాట బిడ్డ ఈమెతో కలిపే పులిహోర మాత్రం... వామ్మో చూసే వాడికి ఇరిటేషన్ పక్కా. అశ్విని శ్రీ బయటకు వచ్చాక.. ఆమె హీరోయిన్ అయితే.. పాట బిడ్డ బోలే హీరో అంటూ బోలే ఏవో మాటలు మాట్లాడారు.
ఇక అశ్వినితో పులిహోర కలుపుతూ... పిచ్చి పిచ్చిగా నచ్చావ్.. అంటూ బోలే కామెంట్స్ చేశాడు. దానికి ఆమె సిగ్గుపడుతూ రీసివ్ చేసుకోవడం.. జనాలకు మాత్రం ఛీ ఛీ అనే ఫీలింగ్ కలుగుతోంది. ఇక బోలే షవాలి.. బయట ప్రశాంత్ కు ఉన్న సింపతీ లీక్ చేయడం... కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు నెట్టింట బోలే షవాలి, అశ్విని శ్రీలే ఎక్కువగా ట్రోలింగ్ కు గురవుతున్నారు.

ఇక నిన్నటి నామినేషన్స్ లో కూడా హౌస్ లో ప్రతి ఒక్కరు బోలే షవాలి, అశ్విని శ్రీలనే టార్గెట్ చేశారు. వచ్చిన వారంతా బోలే తమతో కరెక్టుగా కమ్యూనికేట్ కాలేకపోతున్నారంటూ.. నామినేట్ చేశారు. ఇక దానికి బోలే.. స్వాగతం అంటూ అందరి చేత కుండ బద్దలు కొట్టించుకున్నాడు. ఇక అశ్విని మాత్రం నామినేట్ చేసిన వారితో గొడవకు దిగింది. అందులో కూడా అర్థం ఉండదు అనుకోండి... ఇక మొత్తానికి బోలే షవాలి, అశ్విని శ్రీలను చూస్తే... వీళ్లను బిగ్ బాస్ ఎక్కడి నుంచి పట్టుకువచ్చార్రా బాబు అనే ఫిలింగ్ ప్రేక్షకులకు కలుగుతోంది.


Click it and Unblock the Notifications











