Bigg Boss Telugu 7: షోలో సింగర్ దారుణమైన బూతులు.. ప్రశాంత్ చేసిండు బేం***.. బిగ్ బాస్ ఏం చేశాడంటే!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే బ్రహ్మాండమైన రీతిలో ప్రేక్షకుల స్పందనను దక్కించుకుని తిరుగులేని షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. ఇండియాలోని మిగిలిన భాషల కంటే ఎక్కువ రెస్పాన్స్‌తో దూసుకుపోతోన్న ఇది.. విజయవంతంగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇందులో ఎన్నో ఆసక్తికర సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌లో సింగర్ భోలే బూతు వల్ల వివాదం రేగింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!
బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఉల్టా పుల్టాగా ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గతంలో కంటే ఇందులో ఎక్కువగా గొడవలు కూడా కనిపిస్తున్నాయి. అందులోనూ నామినేషన్స్ టాస్కులో పెద్ద రచ్చే జరుగుతోంది. ఇప్పటికే కొన్ని వారాల్లో కంటెస్టెంట్లు కొట్టుకునేంత పని కూడా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా షోలో బీభత్సమైన గొడవ జరిగింది.

ఏడో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్కులో సింగర్ భోలే షావలిని చాలా మంది కంటెస్టెంట్లు టార్గెట్ చేసి నామినేట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శోభా శెట్టి అతడిని నామినేట్ చేసింది. ఆ సమయంలో అతడిపై చాలా రకాల నిందలు వేసింది. అప్పుడు భోలే మాత్రం 'నీ మీద లవ్వు రావాలి కానీ.. నవ్వు వస్తుంది' అంటూ సెటైరికల్‌గా మాట్లాడాడు.
భోలే మాటలకు శోభా శెట్టి ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. కార్తీక దీపంలో మోనిత కంటే కోపంతో కనిపిస్తూ అతడిని చెడుగుడు ఆడేసింది. ఆ సమయంలో అతడు కూల్ చేస్తున్నట్లుగా మాట్లాడుతూనే సెటైర్లు వేశాడు. అప్పుడు శోభా.. ప్రశాంత్ ఊతపదం 'బరాబర్'ను వాడుతూ మేనరిజం చూపించింది. దీంతో భోలే కూడా తన ఊత పదమైన బూతును వాడి షాకిచ్చాడు.
శోభా శెట్టి మాటలకు భోలే షావలి 'ప్రశాంత్ మిమ్మల్ని బరాబర్ చేసింది బేం**' అంటూ కామెంట్ చేశాడు. అది విన్న ప్రియాంక జైన్ ఒక్కసారిగా అతడిపై విరుచుకుపడింది. దీంతో నామినేషన్ చేసేది శోభా శెట్టినా? ప్రియాంక జైనా? అన్న అనుమానం కలిగింది. అలా ఈ రచ్చ చాలా సేపు సాగింది. ఒక సందర్భంలో భోలే ముఖంపై ప్రియాంక ఉమ్ము కూడా వేసింది.

ఆ తర్వాత ప్రియాంక జైన్ 'బూతులు మాట్లాడుతున్నాడు బిగ్ బాస్. మేము ఇవన్నీ పడడానికి ఇక్కడికి రాలేదు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే నేను నామినేషన్స్ జరగనివ్వను' అంటూ నిలబడింది. దీంతో బిగ్ బాస్ స్పందిస్తూ.. 'భోలే.. హౌస్‌లో బూతులు మాట్లాడటం ఏమాత్రం సహించం.. ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోండి.. ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపేయండి' అన్నాడు.
బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్‌తో భోలే షావలి కామ్ అయ్యాడు. కానీ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ మాత్రం ఇంకా మాట్లాడారు. ఆ తర్వాత అతడి వంతు రావడంతో వాళ్లిద్దరినే నామినేట్ చేశాడు. దీంతో మళ్లీ మళ్లీ గొడవలు జరిగాయి. అప్పుడు భోళే 'నీకు ఎర్రగడ్డే కరెక్ట్' అని శోభాతో అన్నాడు. దీంతో ఈ రచ్చ మళ్లీ పెరిగింది. ఇలా భోలే బూతుకు షోలో పెద్ద వివాదమే చెలరేగింది.


Click it and Unblock the Notifications











