Bigg Boss Telugu 7: భోలె భార్య ఎంట్రీ అదిరిందిగా.. ఇష్ట పడదాం.. కష్ట పడదాం.. కప్పు కొడదాం!
Bhole Shavali Wife in Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా పదో వారంలో భాగంగా జరుగుతున్న సంఘటనలు అయితే బిగ్ బాస్ ప్రియులు ఆనంద భాష్పాలు కార్చేలా చేస్తోంది. ఈ వారం బిగ్ బాస్ ఇంట్లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ను పంపిస్తుండడంతో ఫుల్లుగా ఎమోషన్స్ పండుతున్నాయి. ముందుగా అందరికీ షాకిచ్చే విధంగా వచ్చిన శివాజి కొడుకు, ఆ తర్వాతే అర్జున్ అంబటి భార్య, అశ్విని శ్రీ తల్లిలు సోమవారం రోజు ఎపిసోడ్ లో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక రెండో రోజులో భాగంగా ఇప్పటికి మూడు ప్రోమోలు విడుదల అయ్యాయి. అందులో మొదటి ప్రోమోలో గౌతమ్ కృష్ణ తల్లి రాగా, రెండో ప్రోమోలో ప్రియాంక జైన్ కు కాబోయే భర్త శివ కుమార్ లు కనిపించారు.
ఇక తాజాగా విడుదల అయిన మూడో ప్రోమోలో భోలె షవాళి భార్య సీమ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఓ గదిలో భోలె మ్యూజిక్ వాయిస్తుండగా... అంతా ఫుల్లుగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈక్రమంలోనే మెయిన్ గేట్ నుంచి భోలె భార్య సీమ ఇంట్లోకి అడుగు పెట్టారు. అది చూసిన భోలె పరిగెట్టుకుంటూ వచ్చి మరీ భార్యను కౌగిలించుకున్నారు. ఇక ఆ తర్వాత ఇంట్లోని సభ్యుల అందరినీ పరిచయం చేసిన అతడు.. ఇల్లంతా తిరిగి చూపించాడు. ప్రతీ ప్లేస్ ను ఆమెకు దగ్గరుండి మరీ చూపించాడు. ఈక్రమంలోనే ఆమెకు కుటుంబ సభ్యులు తినమని చపాతీ ఇవ్వగా.. ఆమె తింటూ భర్తకు తినిపించింది.

అలాగే ప్రియాంక్ జైన్, శోభా శెట్టి, అర్జున్ అంబటి.. అలా మిగాత హౌస్ మేట్లకు కూడా తనిపించినట్లు మనం ప్రోమోలో చూడవచ్చు. శోభాశెట్టి అయితే మరో మడుగు ముందుకేసి సీమను హగ్ చేసుకుంది. ఇక ఆ తర్వాత భోలె షవాళి, ఆయన భార్య సీమ ఒంటరిగా బెడ్రూంలో కూర్చొని మాట్లాడుకున్నారు. మూడో వారం, నాలుగో వారం మీరు చాలా బాగా ఆడారని చెప్పగా.. భోలె కూడా అవునని చెప్పాడు. ఎంటర్ టైన్ మెంట్ మీరు మరింత ఎక్కువగా ఇవ్వాలని సీమ భర్తకు సూచించింది. స్పందించిన భోలె.. సరైన సమాధానం కూడా చెప్పాడు.
ముఖ్యంగా పాట బిడ్డగా వచ్చాను.. పాటగా వచ్చిన, పాటగానే పోతానని అన్నాడు. అందుకు భార్య సీమ కూడా అవునని చెప్పింది. ఇక అలా చాలా సేపు మాట్లాడుకున్న తర్వాత భోలె షవాళి ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. భార్యను పక్కన పెట్టుకొనే కంటతడి పెట్టాడు. భార్య సీమ ఊరుకోబెట్టే ప్రయత్నం కూడా చేసింది. కానీ ఆయన తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఈక్రమంలోనే బిగ్ బాస్.. సీమ ఇక మీరు ఈ ఇంటిని వదిలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాడు. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ గార్డెన్ ఏరియాకు వచ్చేశారు.
అక్కడే భోలె షవాళి భార్య కోసం చాలానే పాటలు పాడుతూ డ్యాన్స్ చేశాడు. అప్పటికే బిగ్ బాస్ ఇంట్లో వర్షం పడుతుండగా.. గొడుగులు పట్టుకొని మరీ భోలె, సీమలు కనిపించారు. ఈ సందర్భంగానే భోలె షవాళి మాట్లాడుతూ.. నేను మీ అందరికీ రుణపడి ఉన్నానని చెప్పగా.. అంతా ఏ భోలె అంటూ అరిచారు. ఇక ఆతర్వాత నువ్వు కప్పు కొట్టు అని నన్ను కోరుకోవాల్సిన అవసరం లేదు తెలుసా అని భార్యకు చెప్పి.. ఆ దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్లకే ఇస్తాడని వేదాంతం చెప్పాడు. ఇక ఆ తర్వాత ఇష్టపడదాం.. కష్ట పడదాం.. కప్పు కొడదాం అంటూ చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











