twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    5 years of BB: యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన కమెడియన్

    |

    సోషల్ మీడియా వెబ్‌సైట్ ట్విట్టర్‌లో జూన్ 20 శనివారం అనూహ్యంగా #5YearsOfBB అనే ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. తెలుగు వారంతా ఈ ట్యాగ్ చూసి ఆశ్చర్యపోయారు. BB అంటే మనకు గుర్తొచ్చేది బాహుబలి. అయితే బాహుబలి రిలీజ్ డేట్ ఈ రోజు కాదు కదా.. బాహుబలి రిలీజై ఐదేళ్లు కాలేదు కాదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక అసలు విషయానికి వస్తే BB అంటే భువన్ బామ్. ఓ సాధారణ యువకుడు యూట్యూబ్ సెన్సేషన్‌గా మారిన తీరుకు ఈ రోజు ఓ సాక్ష్యంగా మిగిలింది.

    ఢిల్లీకి చెందిన భువన్ బామ్ అనే యువకుడు కమెడియన్, సాంగ్ రైటర్, సింగర్‌గా సుపరిచితుడు. 2015లో జూన్ 20వ తేదీన తన సొంత యూట్యూబ్ ఛానెల్ BB కి వైన్స్‌ను ప్రారంభించారు. తనదైన శైలిలో యూత్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, మ్యూజిక్ సంబంధించిన వీడియోలు పోస్టు చేసి విశేషంగా నెటిజన్లను ఆకట్టుకొన్నారు. 2018లో యూట్యూబ్‌లో కొటి మంది సబ్‌స్క్రైబర్లను సాధింంచిన తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించారు.

    Bhuvan Bams BB Ki Vines completed 5 years of youtube career

    యూట్యూబ్‌లో భువన్ బామ్ చేసిన బంచోదాస్, సమీర్ ఫుడ్డి, టిటూ మామ, మిస్టర్ హోలా క్యారెక్టర్లు విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఆయన చేసిన వీడియోలకు భారీగా వ్యూస్ లభించాయి. అంతాకాకుండా తేరీ మేరీ కహానీ, సాంగ్ హూ తెరే, సఫర్, రఘుజార్, అజ్నబీ లాంటి మ్యూజిక్ వీడియోలు రూపొందించారు. అలనాటి హీరోయిన్ దివ్య దత్‌తో రూపొందించిన ప్లస్ మైనస్ షార్ట్ ఫిలిం‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. 2018లో భువన్ ప్రారంభించిన డిజిటల్ సిరీస్ టిటూ టాక్స్‌లో షారుక్ ఖాన్ తొలి గెస్టుగా కనిపించడం విశేషంగా చెప్పుకోవచ్చు.

    English summary
    Bhuvan Bam's BB Ki Vines completed 5 years of youtube career: Bam became the first Indian individual YouTube content creator to cross 10 million subscribers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X