బిగ్ బాస్ 9వరోజు హైలెట్స్: మహారాణిగా అదరగొట్టిన టీవీ 9 యాంకర్, బురదలో గేమ్స్!
Recommended Video

బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ 9వ రోజు ఆసక్తికరంగా సాగింది. ఇంటి సభ్యులకు బిగ్ బాస్ 'ఎవడ్రా రాజ్యాన్ని గెలిచేది?' అనే టాస్క్ అప్పగించగా అందరూ కలిసి అదిరిపోయే ఎంటర్టెన్మెంట్ అందించారు. ఈ టాస్క్‌లో భాగంగా మహా రాజు పాత్రలో నూతన్ నాయుడు నటించగా, రాణి పాత్రలో టీవీ9 యాంకర్ దీప్తి నల్లమోతు, మంత్రి పాత్రలో గీతా మాధురి, యువరాణి పాత్రలో నందినీ రాయ్ నటించారు. ఇతర ఇంటి సభ్యులు గ్రామస్తుల వేషాలు వేశారు. ఈ సందర్భంగా మహారాజు, మహారాణి, యువరాణిలను అలరించడానికి గ్రామస్తులు వివిధ ఆటల్లో పోటీ పడ్డారు.

బురదలో గేమ్స్..
రాజుగారి ఫ్యామిలీని మెప్పించడంలో భాగంగా ఇంటి సభ్యులు బురదలో రకరకాల గేమ్స్ నిర్వహించారు. ఈ గేమ్స్ రాజుగారి ఫ్యామిలీని మాత్రమే కాదు, ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ‘ఎవడ్రా రాజ్యాన్ని గెలిచేది?' టాస్క్ మంచి వినోదాన్ని పంచిందని చెప్పక తప్పదు.

సీరియస్ మూడ్ నుండి ఫన్నీ మూడ్ వైపు
మొన్నటి వరకు బిగ్ బాస్ ఇంట్లో కుట్రలు, కుతంత్రాలు, గొడవలు లాంటి సంఘటనలతో ప్రేక్షకులు విసుగెత్తిపోయారు. పరిస్థితి ఇలాగే ఉంటే వ్యూవర్ షిప్ తగ్గే అవకాశం ఉండటంతో ప్రేక్షకులను నవ్వించడంలో భాగంగానే బిగ్ బాస్ ఈ బురదలో గేమ్స్ ఆడించినట్లు తెలుస్తోంది. దీంతో షో సీరియస్ మూడ్ నుండి ఫన్నీ మూడ్ వైపు వెళ్లింది.

టీవీ 9 యాంకర్ హైలెట్ పెర్ఫార్మెన్స్
‘ఎవడ్రా రాజ్యాన్ని గెలిచేది?' టాస్క్‌లో మహారాణి పాత్ర పోషించిన టీవీ9 యాంకర్ దీప్తి నల్లమోతు తనదైన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

వివాదాస్పదంగా మారిన సంజన వ్యవహారం
తొలి వారం బిగ్ బాస్ ఇంటి నుండి సంజనను ఎలిమినేట్ చేసిన సంగతి తెలిసిందే. సంజన వ్యవహారం వివాదాస్పదం అయింది. ఇంటి నుండి బయటకు వచ్చిన ఆమె షో నిర్వాహకులపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా తనను కావాలనే బయటకు పంపించారని ఆమె ఆరోపించారు.


Click it and Unblock the Notifications











