బిగ్ బాస్ 2: రహస్యంగా జరిగిపోయింది.. వాళ్లిద్దరూ అవుటేనా, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా!
Recommended Video

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 షో ప్రారంభమైపోయింది. భారీ అంచనాలతో మొదలైన బిగ్ బాస్ 2 ను నెమ్మదిగా ఆసక్తి పెంచుతోంది. కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ హౌస్ లో ఒదిగిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. తొలి వారాంతంలో ఇద్దరి ఎలిమినేషన్ కు రంగం సిద్ధం అవుతోంది. కాగా రెండవరోజు జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సంజన ఇప్పటికి జైల్లోనే ఉండడం విశేషం. ఇద్దరిని ఎలిమినేటి చేసేందుకు బిగ్ బాస్ జరిపిన తతంగం అందరిని ఆశ్చర్య పరిచింది.

అందరి ఆసక్తి అతడిపైనే
మిగిలిన సెలెబ్రిటీలందరికన్నా హేతువాది బాబు గోగినేనిపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొని ఉంది. ఏ విషయాన్ని అయినా ఆయన సైంటిఫిక్ గా, మానవీయ కోణంలో ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడంతో ఆసక్తి నెలకొంది.

సందర్భానుసారంగా
సందర్భానుసారంగా వ్యవహరిస్తూ బాబు బోగినేని బిగ్ బాస్ లో ఆసక్తి పెంచుతున్నారు. ఇక అనుకున్న విధంగానే గీతా మాధురి, తేజస్వి వంటి సెలెబ్రిటీలు కూడా ఆసక్తి రేపే విధంగా వ్యవహరిస్తున్నారు.

జైల్లో ఉన్న భామ
సంజన జైల్లో ఉండడంతో ఆమెపై ప్రత్యకమైన ఫోకస్ ఉంది. ఆమెతో పాటు జైల్లో ఉన్న మరో వ్యక్తి నాయుడుకు జైలు నుంచి విముక్తి కలిగింది. కంటెస్టెంట్స్ అధిక భాగం నాయుడుకు సపోర్ట్ చేయడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.

స్పూనుతో బకెట్ నింపాడు
ఇక బిగ్ బాస్ హీరో తనీష్ కు ఆసక్తికరమైనటాస్క్ ఇచ్చాడు. స్పూనుతో బకెట్ నింపాలని ఆదేశించాడు. ఆ టాస్క్ ని తనీష్ విజయవంతంగా పూర్తి చేసాడు. కౌశల్ కు సంజనని జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చే అవకాశం వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని కౌశల్ తన వద్దే ఉంచుకున్నాడు.

ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు
ఇక అత్యంత ఆసక్తికరమైన ఎలిమినేషన్ ప్రక్రియని బిగ్ బాస్ ప్రారంభించాడు. ఒక్కొక్కరిని సీక్రెట్ గా ఓ రూమ్ లోకి పిలిచి మరీ విచారణ జరిపాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపడానికి మీరు ఎవరి పేర్లు ప్రతిపాదిస్తారు అని ఒక్కక్కొరిని రహస్యంగా పిలిచి అడిగాడు.

వాళ్లిద్దరూ అవుటేనా
ఈ ప్రక్రియలో ఎక్కువ మంది దీప్తి సునైనా, గణేష్, కిరీటి , కౌశల్, సంజన పేర్లు ప్రతిపాదించారు. వీరిలో దీప్తి సునైనా, గణేష్ కి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నట్లు అర్థం అవుతోంది. సునైనా, గణేష్ సరిగా తమలో కలిసిపోవడం లేదని ఇతర సభ్యులు బిగ్ బాస్ కు చెప్పారు. ఇక కిరీటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడనే అభిప్రాయం అందరిలో ఉంది.

వీకెండ్ లోనే
ఈ వీకెండ్ లోనే బిగ్ బాస్ ఇద్దరి సభ్యులని ఎలిమినేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి బిగ్ బాస్ 2 నెమ్మదిగా ఆసక్తి పెంచుతోంది.


Click it and Unblock the Notifications











