ర‌క్తి క‌ట్టించేనా..విర‌క్తి పుట్టించేనా..!!

By Staff

Recommended Video

Big Boss season 2 Telugu : People Criticizes Big Boss About Celebrities

ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభమైన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 2ప‌ట్ల స‌గ‌టు ప్రేక్ష‌కుడు పెద‌వి విరుస్తున్నాడు. కంటెస్టెంట్ల ఎంపిక ద‌గ్గ‌ర‌నుంచి హోస్టుగా వ్య‌వ‌హ‌ర‌నిస్తున్న హీరో నాని వ‌ర‌కు కాస్త అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తం వంద రోజుల షోని జూనియ‌ర్ ఎన్టీఆర్ లా నాని ర‌క్తి క‌ట్టించ‌గ‌ల‌డా.. పోటీదారులు అందుకు స‌హ‌క‌రిస్తారా.. అన్న సందేహాల‌ను వ్య‌క్తంచేస్తున్నారు ప్రేక్ష‌కులు. సీస‌న్2 లో ఎక్కువ మంది ఎవ‌రో, ఏంటో తెలియ‌క‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు అయోమ‌యానికి గురౌతున్న‌ట్టు తెలుస్తోంది.

అంతా కొత్త‌వారే..నిరాశ‌ప‌రిచిన కంటెస్టెంట్ల ఎంపిక‌..

అంతా కొత్త‌వారే..నిరాశ‌ప‌రిచిన కంటెస్టెంట్ల ఎంపిక‌..

ఎంతో అట్ట‌హాసంగా, ఎన్నో అంచ‌నాల‌తో ప్రారంభ‌మైన బిగ్ బాస్2 రియాలిటీ షో ప‌ట్ల ప్రేక్ష‌కుల ఆసక్తి మొద‌టి రోజే స‌న్న‌గిల్లింది. ముఖ్యంగా షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఐదారుగురు త‌ప్ప మిగిలిన‌వారిది ఏరంగమో, ఎందులో నిష్ణాతులో ఎవ‌రికి తెలియ‌దు. వారి మొహాలు కూడా అంత‌గా చూసిన దాఖ‌లాలు లేవు. కొత్త‌గా ఎంట్రీ ఇచ్చిన వారు ప‌రిచ‌య కార్య‌క్ర‌మంలోనే విసుగు పుట్టించారంటే సీజన్ మొత్తం వారిని భ‌రించాలా అని స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఆలోచిస్తున్న‌తెలుస్తోంది. అస‌లు బిగ్ బాస్2 సీజన్ కంటెస్టెంట్స్ కూర్పు కూడా స‌రిగా లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

పెద్ద‌గా జ‌నాల‌కు తెలియ‌ని సెలబ్రిటీలు

పెద్ద‌గా జ‌నాల‌కు తెలియ‌ని సెలబ్రిటీలు

గీతామాధురి, అమీత్, త‌నిష్క్, యాంక‌ర్ శ్యామ‌ల‌, టీవీ9లో అడ‌పాద‌డ‌పా క‌నిపించే దీప్తి, టీవీ ఆర్టిష్టు కౌష‌ల్ త‌ప్ప మిగిలిన వారెవ్వ‌రూ పెద్ద‌గా జ‌నాల‌కు తెలియ‌దు. తేజ‌స్వి, సామ్రాట్ లాంటి వాళ్లకు గుర్తింపు ఉన్నా అంత‌గా రిజిస్ట‌ర్ అయ్యే ప‌ర్స‌నాలిటీస్ కాదు. మిగిలిన వారంద‌రూ ఎవ‌రికి వారు తాము ప్ర‌తిభావంతుల‌మ‌ని రుజువు చేసుకోవ‌డానికి, ముందు బిగ్ బాస్ హౌస్ లోకి రావ‌డానికి త‌మ‌కున్నఅర్హ‌త‌ను చాటుకోవ‌డానికి చేసే ప్ర‌య‌త్నాల‌ను స‌గ‌టు ప్రేక్ష‌కుడు భ‌రించాల్సి ఉంది.

అస‌హ‌నానికి గురిచేస్తారా...

అస‌హ‌నానికి గురిచేస్తారా...

ముఖ్యంగా బాబు గోగినేని ని ఎందుకు ఎంపిక చేసారో ఎవ‌రికి అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌. స‌హ‌జంగా హేతువాది ఐన బాబు గోగినేని బిగ్ బాస్ విధించే శ‌ర‌తుల ప‌ట్ల హౌస్ లో తిరుగుబాటు గ‌ళం విప్పినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. హౌస్ లో బాబు గోగినేని మాట్ల‌డుతున్న భాష‌, ఉపయోగిస్తున్న ప‌ద ప్ర‌యోగం ప‌క్క కంటెస్టుల‌కు పూర్తిగా అర్థం అయ్యే స‌రికి బిగ్ బాస్2 సీజన్అయిపోతుంద‌నే సందేహాలు కూడా క‌లుగుతున్నాయి.

కామ‌న్ మాన్ల రూపంలో

కామ‌న్ మాన్ల రూపంలో

కామ‌న్ మాన్ల రూపంలో వచ్చిన ముగ్గురు కంటెస్టెంట్లు ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ఏ మేర‌కు ప‌రీక్ష‌పెడ‌తారో చూడాలి. తెలంగాణ రాప్ సింగ‌ర్ గా వ‌చ్చి విచిత్ర కుమార్ లా కనిపించిన రోల్ రిడా ఎంత సంయ‌మ‌నం పాటిస్తే ప్రేక్ష‌కులు అంత స‌హ‌నంగా బిగ్ బాస్ షో చూసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ సీస‌న్1 మిగిల్చిన మ‌ధురానుభూతుల‌ను దృష్టిలో పెట్టుకుని ప్రేక్ష‌కుల పెద్ద యెత్తున బిగ్ బాస్2 కోసం ఎదురు చూసారు.

బిగ్ బాస్ సీస‌న్1 కి గొప్ప విజ‌యాన్ని ఇచ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్...

బిగ్ బాస్ సీస‌న్1 కి గొప్ప విజ‌యాన్ని ఇచ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్...

బిగ్ బాస్1 సీజన్లో యాంక‌ర్ గా హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్రేక్ష‌కులను సంతృప్తి ప‌ర‌చ‌డంలో, షోను గంభీరంగా న‌డ‌ప‌డంలో త‌నైదైన మార్క్ చూపించారు. పూర్తి కార్య‌క్ర‌మాన్ని త‌న‌దైన శైలితో ర‌క్తి క‌ట్టించారు. ఎన్టీఆర్ బిగ్ బాస్ వేదిక మీద హుందాత‌నాన్ని, చ‌తుర‌త‌ను, చ‌మ‌త్కారాన్ని, గారాబాన్ని, చ‌క్క‌ని హావ‌భావాన్ని, హాస్యాన్ని, ఉత్కంఠ‌త‌ను రేకెత్తించారు. ముఖ్యంగా షో ఎంత స్నేహ పూర్వ‌క, సామ‌ర‌స్య వాతార‌ణంలో నడిపించారో అంతే స్థాయిలో ఉత్సుక‌త క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించారు.

అంత హుందాగా

అంత హుందాగా

న‌టుడు నాని చేస్తున్న యాంక‌రింగ్ మాత్రం అంత హుందాగా అనిపించ‌డం లేదు. నేచురల్ స్టార్ నాని యాంక‌రింగ్ అన్ నేచురల్‌గా ఉన్న‌ట్టు క‌న‌బ‌డుతోంది. కంటెస్టెంట్లు కూడా నానిని డామినేట్ చేయ‌కుండా ఉండేలా చాలా వ‌ర‌కు జాగ్ర‌త్త ప‌డిన‌ట్టు తెలుస్తోంది. అందుకే ఎంపిక చేసిన కంటెస్టెంట్లు కూడా ఐదారుగురు త‌ప్పితే పెద్ద‌గా లైమ్ లైట్ లో లేని వారినే ఎంపిక చేసినట్లు స్ప‌ష్ట‌మౌతోంది.

సీస‌న్1 క‌న్నా బిన్నంగా ఉండేలా క్రుషి చేస్తేనే ఆద‌ర‌ణ‌...

సీస‌న్1 క‌న్నా బిన్నంగా ఉండేలా క్రుషి చేస్తేనే ఆద‌ర‌ణ‌...

బిగ్ బాస్ సీస‌న్1 ని సంచ‌ల‌న విజ‌యంగా మార్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్ కి ధీటుగా బిగ్ బాస్ 2 ని మ‌రో సంచ‌ల‌న విజయంగా నాని తీర్చిదిద్ద‌గ‌ల‌డా అనే అంశం పైన మాత్రం సందేహాలు నెల‌కొన్నాయి. నాని ఎంపిక చేసుకున్న ఇంటి స‌భ్యుల కూర్పు కూడా ఆక‌ట్టుకునేలా క‌నిపించ‌డం లేదు. బంపర్ హిట్ ఐన ఒక టీవి షో కి కొన‌సాగింపుగా వ‌స్తున్న అదే కార్య‌క్ర‌మంలో అంత‌కు రెట్టింపు స్థాయిలో ఉండాలి త‌ప్ప మొద‌టి దాని స్థాయిక‌న్నా త‌గ్గి ఉండ‌కూడ‌దు. ముఖ్యంగా షోని న‌డిపంచే హోస్టు విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

బిగ్ బాస్2 ని సునిశితంగా ప‌రిశీలిస్తే..

బిగ్ బాస్2 ని సునిశితంగా ప‌రిశీలిస్తే..

మొత్తంగా బిగ్ బాస్2 ని సునిశితంగా ప‌రిశీలిస్తే.. బిగ్ బాస్2 నిర్వ‌హిస్తున్న నాని షో మొద‌ట‌గా ప్రేక్ష‌క‌ల ముందుకు వ‌చ్చి.. ఆత‌ర్వాత స‌మూల మార్పులు చేసి నాని షో కన్నా వంద‌రెట్లు ఎక్కువ కిక్కుతో జూనియ‌ర్ ఎన్టీఆర్ షో వ‌చ్చిన‌ట్టు ప్రేక్ష‌కులు నిర్ధారించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఫైన‌ల్ గా చెప్పాలంటే హోస్టు విష‌యంలో కావ‌చ్చు, కంటెస్టెంట్ల విష‌యంలో కావ‌చ్చు బిగ్ బాస్1 సీజన్ ముందు బిగ్ బాస్2 సీజన్ పేలవంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X