సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్న ‘బిగ్ బాస్ తెలుగు 3’
బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో విజయవంతం కావడంతో... త్వరలో మూడో సీజన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్ నాని హోస్ట్ చేశారు. త్వరలో ప్రారంభం కాబోతున్న మూడో సీజన్ ద్వారా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున రంగంలోకి దిగుతున్నారు.
ఇప్పటికే నాగార్జునపై చిత్రీకరించిన ప్రోమోను స్టార్ మాటీవీ వారు విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. బిగ్ బాస్ షోకు ఇప్పటి వరకు యువత ఆదరణ ఎక్కువగా ఉంది. ఈ షో వైపు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకర్షించడానికే నాగార్జునతో షో హోస్ట్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు 3
‘బిగ్ బాస్ తెలుగు 3' ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే విషయం ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు. జులై 21న మొదలయ్యే అవకాశం ఉందని టాక్. ఇందులో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరనే విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. షో ప్రారంభం రోజు మాత్రమే వీరి వివరాలు వెల్లడికానున్నాయి.

సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్న రూమర్లు
అయితే బిగ్ బాస్ 3కి సంబంధించిన రూమర్లు కొందరు సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నాయి. తాము ఈ షోలో పాల్గొనడం లేదని చెప్పినా సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఆగడం లేదు. ప్రతి రోజు తమకు ఈ విషయమై ఫోన్లు వస్తున్నాయని, వాటితో చాలా ఇబ్బంది పడుతున్నామని కొందరు వాపోతున్నారు.

ప్రచారంలో ఉన్న పేర్లు ఇవే
యాంకర్ శ్రీముఖి, తీన్ మార్ న్యూస్ సావిత్రి, హీరో తరుణ్, డ్యాన్స్ మాస్టర్ రఘు, సింగర్ హేమచంద్ర, శ్రీరెడ్డి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ ఉదయభాను, హీరో వరుణ్ సందేశ్, వైవా హర్ష, యాంకర్ లాస్య,
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, 'మహాతల్లి' ఫేమ్ జాహ్నవి తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో నిజం ఎంత? అనేది షో ప్రారంభం అయితే తప్ప చెప్పలేం.

ఖండించిన సెలబ్రిటీలు
తాము బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నామనే రూమర్లను ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు ఖండించారు. యాంకర్ లాస్య ఇటీవల ఓ వీడియో విడుదల చేస్తూ తాను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు. తనకు రెండున్నర నెలల బాబు ఉన్నాడని, వాడిని చూసుకోవడంలోనే బిజీగా ఉన్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











