Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిగ్ బాస్ 4లో నాగార్జున హీరోయిన్ ఫిక్స్.. ఈ సారి గ్లామర్ డోస్ మామూలుగా ఉండదు!
బిగ్ బాస్ షో ఎప్పుడు మొదలవుతుందో గాని బ్యాక్ గ్రౌండ్ వర్క్ అయితే గట్టిగానే జరుగుతోంది. కరోనా కారణంగా సీరియల్ షూటింగ్స్ ఆగిపోయిన్నప్పటికి రియాలిటీ షోలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. ఎప్పటిలానే కంటిన్యూ అవుతున్నాయి. ఇక బిగ్ బాస్ 4 హోస్ట్ నాగార్జున అని ఒక క్లారిటీకి అయితే వచ్చినట్లు తెలుస్తోంది. నాలుగవ సీజన్ లో మునుపెన్నడు లేని విధంగా స్టార్ సెలబ్రెటీస్ ని దింపనున్నారు. ముఖ్యంగా ఒక హీరోయిన్ దాదాపు ఫిక్స్ అయినట్లు సమాచారం.
Recommended Video
గత ఏడాది నుంచే..
గడిచిన మూడు సీజన్స్ కి వచ్చిన రేటింగ్స్ ప్రకారం బిగ్ బాస్ షోకి ఫ్యాన్స్ అయితే గట్టిగానే ఉన్నారని ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకే స్టార్ మా నిర్వహకులు బిగ్ బాస్ 4వ సిజన్ కోసం గత ఏడాది నుంచే ఆలోచించడం స్టార్ట్ చేశారు. గత కొన్ని నెలల నుంచే బిగ్ బాస్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. లిస్ట్ ఇదేనంటూ వివిధ రకాల కథనాలు వెలువడుతున్నాయి.
ఆ హీరోయిన్ ఫిక్స్..
గత నెల రోజుల నుంచి రియాలిటీ షోకి సంబంధించిన ప్లాన్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ కరోనా సమయంలో బిగ్ బాస్ 4ని గ్రాండ్ గా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. ఇక కంటెస్టెంట్ లిస్ట్ లో పూనమ్ బజ్వా అనే హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. గతంలో ఈ బ్యూటీ నాగార్జున బాస్ సినిమాలో నటించింది. అనంతరం పరుగు సినిమాలో ఒక సపోర్టింగ్ రోల్ లో కూడా నటించింది.
బిగ్ బాస్ హాట్ బ్యూటీస్..
అలాగే మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.యమిని భాస్కర్, హంస నందిని శ్రద్దా దాస్, వంటి హాట్ బ్యూటీలు షోకు గ్లామర్ డోస్ తెనున్నట్లు తెలుస్తోంది. జనాలు చాలా వరకు ఇంట్లోనే ఉంటారు కాబట్టి తప్పకుండా షో గత మూడు సీజన్ల కంటే సీజన్ 4 ఎక్కువ స్థాయిలో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే స్టార్ సెలబ్రెటీస్ ని హౌజ్ లోకి లాగాలని చూస్తున్నారు.
నో చెప్పే ఛాన్స్ లేదు..
స్టార్స్ కూడా షూటింగ్స్ లేకపోవడంతో బిగ్ బాస్ 4లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జనాల్లో క్రేజ్ తో పాటు మంచి ఆదాయం అంధించే పని దొరుకుంది కాబట్టి ఈ విషయంపై పెద్దగా నో చెప్పే ఛాన్స్ లేదు. పూనమ్ బజ్వాని అయితే స్టార్ మా నిర్వాహకులు ఇటీవల సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగతా వారి గురించి ఇంకా తెలియాల్సి ఉంది.