twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనోభావాలు దెబ్బతీస్తున్నారని టీవీ షో పై ముస్లింల కేసు

    By Srikanya
    |

    హైదరాబాద్‌: కలర్స్‌ టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న టెలివిజన్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ (సీజన్‌7)ను నిషేధించేలా ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. జన్నత్‌ (స్వర్గం), జహన్నుమ్‌ (నరకం) పేరిటి ముస్లింల మనోభావాలను దెబ్బతీసేవిధంగా కార్యక్రమాన్ని రూపొందించారని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ ఫసీయుద్దీన్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు.

    ఇందులో ప్రతివాదులుగా బిగ్‌బాస్‌ షోకు అతిథేయిగా వ్యవహరిస్తున్న ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌తో పాటు బిగ్‌బాస్‌ సీజన్‌-7 టీవీ షో దర్శక, నిర్మాత సంస్థ ఎన్‌డోమోల్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ను, బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పోరేషన్‌, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

    ఇక గతంలోనూ బిగ్ బాస్ 4 రియాల్టీ షోలో అసభ్యత చోటు చేసుకుందనే ఆరోపణపై ఉత్తరప్రదేశ్ కోర్టులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై కేసు నమోదైంది. ఆ రియాల్టీ షో నిర్మాత, దర్శకుడు, కొంత మంది పోటీదారులపై కూడా కేసు నమోదైనట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లా కోర్టులో వారిపై ఈ కేసు నమోదైంది.

    Big Boss-7 in Hell, PIL filed against it in Andhra Pradesh High Court

    అలీగఢ్ కు చెందిన అనూప్ కౌశిక్ అనే న్యాయవాది చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆ కేసును దాఖలు చేశారు. అనూప్ కుమార్ బిగ్ బాస్ పై ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ రియాల్టీ షోను ప్రసారం చేస్తున్న చానెల్ మేనేజింగ్ డైరెక్టర్, షో దర్శక నిర్మాతలపై ఫిర్యాదు చేసినట్లు అనూప్ కౌశిక్ చెప్పారు.

    English summary
    A case is been filed in AP High Court against the telecast of Biggboss-7 and its host Salman Khan. According to sources Mohammed Fasihuddin Ayan has filed a petition in AP High court as PIL stating it is hurting the sentiments of the Muslim community not only of State but the whole country and world. It is stated that the program is depicting Jannat and Dozaq in world (heaven & Hell normally referred by Muslims) in its serial which is unacceptable to Muslims thus asked the honourable court to intervene and stop the program immidiately and take action against its host Salman Khan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X