Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌లోకి అప్పుడేమో ప్రియుడు..ఇప్పుడేమో ప్రియురాలు..ఈ జంటకు ఏం అవుద్దో?

బిగ్ బాస్ రియాలిటీ షోకి తెలుగులో ప్రత్యేక ఆదరణ ఉందనే విషయం తెలిసిందే. అందుకే వరుస పెట్టి సీజన్లతో కొనసాగిస్తున్నారు నిర్వాహకులు. ఇక ఇప్పటికే ఆరు సీజన్స్ విజయవంతగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. త్వరలో ఏడవ సీజన్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో రోజుకో వార్త బిగ్ బాస్ షో గురించి లీక్ అవుతూ వస్తుంది. ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. బిగ్ బాస్ 4 లో అలరించిన కంటెస్టెంట్ ప్రియురాలు.. ఇప్పుడు బిగ్ బాస్ 7లో అలరించనుంది. ఆ వివరాల్లోకి వెళితే...

బుల్లితెరపై ఎన్ని షోలు వచ్చినా... బిగ్ బాస్ రియాలిటీ షోకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రతి సంతవ్సరం ఈ సీజన్ కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఇక ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కు కూడా హోస్ట్ గా నాగార్జునే వ్యవహరించనున్నట్లు తేలిపోయింది. మొదట బాలకృష్ణ, రానా పేర్లు వినిపించగా.. ఇక నాగార్జునే మళ్లీ హోస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది.

Big Boss fame Mehboob Shaikh Lover Swetha Naidu confirmed For Bigg Boss Telugu 7 ContestantS News Goes Viral

ఇక బిగ్ బాస్ షో లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఫలానా వాళ్లు అంటూ రోజుకో పేరు బయటకు వస్తోంది. ఇక ఇప్పుడు మరో పేరు కూడా వినిపిస్తుంది. అది ఎవరో కాదు.. బిగ్ బాస్ సీజన్ 4లో అలరించిన కంటెస్టెంట్ ప్రియురాలు. అదేనండి.. బిగ్ బాస్ 6 సీజన్ లో మెహబూబ్ షేక్ అందరికీ గుర్తుండే ఉంటుంది. యూట్యూబర్ అయిన మెహబూబ్.. ఆయన గర్లఫ్రెండ్ శ్వేత నాయుడు ఈ సీజన్ లో సందడి చేయనుంది.

యూట్యూబ్‌, టిక్‌టాక్‌ వీడియోలతో ఫేమస్‌ అయిన మెహబూబ్‌ గురించి ప్రత్యేక అవసరం లేదు. బిగ్‌బాస్‌ సీజన్‌-4 లో పాల్గొని మరింత పాపులర్‌ అయ్యాడు. ప్రస్తుతం కవర్‌ సాంగ్స్‌, వెబ్‌సిరీస్‌లు చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అయితే ఈయన గర్ల్ ఫ్రెండ్, యూట్యూబర్, టిక్ టాక్ స్టార్ అయిన శ్వేత నాయుడు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7లో ఎంట్రీ ఇవ్వనుందట. దీనితో సీజన్ 4లో ప్రియుడు వెళితే.. సీజన్ 7లో ప్రియురాలు వెళ్లనుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Mehboob

యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో ముద్దుగుమ్మ శ్వేతా నాయుడు టిక్ టాక్, మోజ్ వీడియోలు చేయడం ప్రారంభించింది. ఇందులో తనదైన టాలెంట్ తో ఆకట్టుకుని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ బ్యూటీ మెహబూబ్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరు కెరియర్ ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో బ్యూటిఫుల్ జంటగా క్రేజ్ తెచ్చుకున్నారు.

Sai Dharam Tej: ఆ విషయంలో భయమేస్తోంది.. ప్లీజ్ అర్ధం చేసుకోండి.. సాయి తేజ్ ఎమోషనల్
శ్వేత నాయుడు ఒకవేళ బిగ్ బాస్ కు ఎంట్రీ ఇస్తే ఎంటర్ టైన్ మెంట్ కు , మసాలకు లోటేం ఉండదు. తనదైన డ్యాన్స్, అందంతో అలరించనుంది. ఇక ఈ షోలో లవ్ ట్రాక్ లు ఉండనే ఉంటాయి. మరి ఈ సారి.. బిగ్ బాస్ ఎవరికి లవ్ ట్రాక్ వేస్తోడో వేచి చూడాల్సిందే. అయితే గతంలో ప్రియుడు ప్రియరాలు వేరు వేరు సీజన్స్ లో ఎంట్రీ ఇచ్చి.. బ్రేకప్ అయ్యాయి. మరి ఈ సీజన్ లో ఏం అవ్వనుందో చూడాలి.

Swetha Naidu

ఇక ఇప్పటికే ఈ షోలో శోభా శెట్టి, సింగర్ మోహన భోగరాజు, యూట్యూబర్ స్వేత నాయుడు, యాంకర్ దీపిక పిల్లి, దుర్గారావు కపూల్, సింగర్ సాకేత్, సురేఖ వాణి, సంతోషం సురేష్ వంటి వారు బిగ్ బాస్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అమర్ దీప్, తేజస్వీని జంట రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X