twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రాత్రి పెద్ద గొడవ, వదిలేయండని ఏడ్చా, పోలీసులు వచ్చారు: కౌశల్ భార్య నీలిమ

    |

    కౌశల్ వర్సెస్ కౌశల్ ఆర్మీ వ్యవహారం తెలుగు మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కౌశల్ ఆర్మీకి చెందిన కొందరు వ్యక్తులు కౌశల్ డబ్బు మనిషి, అతడికి కావాల్సింది అభిమానం కాదు.. డబ్బు మాత్రమే, డబ్బున్న అభిమానులను మాత్రమే దగ్గరి తీస్తాడు, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ పేరుతో డబ్బు వసూలు చేసి దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు చేసిన నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదు అంటూ కౌశల్, ఆయన భార్య నీలిమ గురువారం మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా నీలిమ తనకు కర్నూలులో ఎదురైన చేదు సంఘటన గురించి వెల్లడించారు. నిజా నిజాలు తెలుసుకోకుండా కొన్ని టీవీ ఛానల్స్ తమకు వ్యతిరేకంగా కేవలం ఆరోపణలను బేస్ చేసుకుని ప్రత్యేక షోలు చేయడంపై ఆమె మండి పడ్డారు. నీలిమ ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే...

    కర్నూలలో పెద్ద గొడవ

    కర్నూలలో పెద్ద గొడవ

    కర్నూలులో ఇటీవల కౌశల్ ఆర్మీలో గొడవలు జరుగుతుంటే.. అసలు మీకు ఏం కావాలని అడగటానికి మేము అక్కడికి వెళ్లాం. ‘ఓ నలుగురు మమ్మల్ని ట్రోల్ చేశారు, ఆ నలుగురు వచ్చి మా కాళ్ల మీద పడాలి, ఆ నలుగురిని వదిలేయండి' అని వారు అన్నారు. వదలడం అంటే ఏమిటి సార్? అని మేము అడిగాం. చంపేస్తాం, రామకృష్ణ అనే అతడిని చంపేస్తామి వారు అన్నారు. ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమైన వీడియో క్లిప్‌లో నేను బ్రతిమిలాడుతున్నట్లు ఉంది. ఆ నలుగురికీ ఫ్యామిలీస్ ఉన్నాయండీ, చిన్న పిల్లలు ఉన్నారండీ, వారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్.. చంపేస్తాం అంటే బయపడతారు.. సారీ కావాలి అంతేగా.. నేను సారీ చెబుతా.. అలాంటి మాటలు మాట్లాడకండీ అన్నాను. అదే ఆ వీడియోలో ఉందని నీలిమ చెప్పుకొచ్చారు.

    వారు ఏం చెబితే అది యాక్సెప్ట్ చేస్తారా?

    వారు ఏం చెబితే అది యాక్సెప్ట్ చేస్తారా?

    అలాంటి వీడియో చూసినపుడు సాధారంగా మీడియా పర్సన్స్.. అక్కడ ఏం జరిగింది? ఆ కారు ఏమిటి? మిడ్ నైట్ వారు అక్కడ ఎందుకు ఉన్నారు? అనే ప్రశ్నలు అడగాలి. కానీ ఆ టీవీ ఛానల్ వారు అవేమీ అడగకుండా లైవ్‌లో కూర్చున్న వారు ఏవేవో ఆరోపణలు చేస్తుండటం, ఛానల్ వారు దాన్ని యాక్సెప్ట్ చేయడమే కనిపించింది.

    మేము అన్నీ ఆపేయాలంట, కౌశల్ ఆర్మీని చంపేస్తారట

    మేము అన్నీ ఆపేయాలంట, కౌశల్ ఆర్మీని చంపేస్తారట

    భారత సైనికులకు మద్దతుగా కౌశల్ ఆర్మీ చేసే ర్యాలీ ఆగాలి, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఆగిపోవాలి, సినిమా ఇండస్ట్రీకి మీరు దూరం అవ్వాలని బెదిరించారు. ఒక వేళ గ్రూపులు అన్నీ తీసేసినా మీరు ఇవన్నీ ఎలా చేయగలరు సార్, మీరు ఎలా ఆర్మీని చంపేయగలరు? వారి అభిమానాన్ని ఎలా చంపేయగలరు అని ప్రశ్నించాను. దానికి వారు.. చంపేస్తాం, రెండు రోజులు చాలు మొత్తం ఆర్మీని లేపేయడానికి అని వారు చెప్పిన ఆడియో ప్రూఫ్ కూడా నా వద్ద ఉంది.

    ఇలా చేయడం సరికాదని ఏడ్చాను

    ఇలా చేయడం సరికాదని ఏడ్చాను

    నా భర్త కౌశల్ మాట్లాడుతూ నేను జీరో నుంచి వచ్చా, జీరోకు వెళ్లడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. రేపు ర్యాలీ అయితే జరుగనీయండి అని మేమిద్దరం కార్లో వెళ్లి కూర్చున్నా వారు మమ్మల్ని వదల్లేదు. ఒక ఆడపిల్లగా చెబుతున్నాను, ఈ ఒక్కరాత్రికి వదిలేయండి, తెల్లారిన తర్వాత అందరినీ పిలిచి మాట్లాడతాను, హైదారబాద్ వెళ్లిపోవాలి... ఇంట్లో పిల్లలు ఉన్నారు.. మీ అందరి ఫ్యామిలీస్‌కు నేను తెలుసు.. రాత్రి రెండు మూడు గంటలకు వరకు ఇలా కూర్చోబెట్టడం సరికాదన్నాను. ఇలా చేయడం పద్దతికాదని ఏడ్చాను.

    పోలీసులకు ఫోన్ చేశాను

    పోలీసులకు ఫోన్ చేశాను

    నేను ఎంత ఏడ్చినా, ఎంత చెప్పినా వినలేదు, పెద్ద పెద్ద అరుపులతో మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేశారు. నేను కర్నూలు సీఐ గారికి ఫోన్ చేస్తే వచ్చారు. కంప్లయింట్ రైజ్ చేస్తే ఇప్పటికే రాత్రి 3 గంటలైంది, మీరు వెళ్లిపోండి నేను సర్ది చెబుతాను, తెల్లారితే మీడియా వస్తుందని ఆయన అన్నారు. మీడియా వచ్చినా ఫర్వాలేదు నా వద్ద అన్ని ప్రూప్స్ ఉన్నాయని చెప్పాను.

    చెక్ ఇచ్చిన వెంటనే ఎలిగేషన్స్ చేశారు

    చెక్ ఇచ్చిన వెంటనే ఎలిగేషన్స్ చేశారు

    వారితో ఎందుకు పెట్టుకుంటారు.. ఇకపై మీ జోలికి రాను అని వారితో లెటర్ రాయిస్తాను, ఒక నలుగురితో క్షమాపనలు చెప్పించండి సమస్య సాల్వ్ అవుతుందని సీఐ చెప్పారు. నేను నా భర్త కౌశల్‌ను కన్విన్స్ చేసి ఇకపై మీ ఆర్మీ వారు మిమ్మల్ని ఏమీ చేయరు అని లెటర్ రాయించి తీసుకొస్తే.. ఆ తర్వాత మాకు (కౌశల్‌తో సినిమా తీస్తానని చెప్పిన వ్యక్తి) ఇచ్చిన రూ. 10 లక్షల చెక్ కూడా ఇచ్చేయమని చెప్పారు. అది కూడా ఇచ్చేశాం. చెక్ ఇచ్చేసిన సాయంత్రమే మీడియాకు వెళ్లి వారంతా మాపై ఎలిగేషన్స్ చేశారు.

    మీడియా న్యాయం చేయాలి

    మీడియా న్యాయం చేయాలి

    ఎవరికైనా అన్యాయం జరిగితే మీడియాకు వెళ్లి చెప్పొచ్చు. కానీ మీడియా వారు న్యాయం చేయాలి. ఎవరైనా ఎలిగేషన్స్ చేస్తే అందులో నిజంఎంత? అనేది తెలుసుకోవాలి. సెలబ్రిటీ అంటే ఎక్కడో ఏదో షోట్లోనో, ఏదో పనిలోనో ఉంటారు. అప్పటికప్పుడు ఆయనకు ఫోన్ చేసి ఇక్కడ మీ మీద డిబేట్ జరుగుతోంది, ఆరోపణలు చేస్తున్నారు. మీరు వచ్చేస్తారా? అంటే ఎలా వస్తారు?

    నా వద్ద అన్నీ ఆధారాలు ఉన్నాయి

    నా వద్ద అన్నీ ఆధారాలు ఉన్నాయి

    మేము ఎంతో కష్టపడి ఈ స్థాయికి వస్తే 3 గంటలు నిజా నిజాలు తెలుసుకోకుండా షో పెట్టి మేము సంపాదించుకున్న పేరు కొలాప్స్ చేశారు. అయినా ఒకే... కష్టాన్ని నమ్ముకున్నాం, కష్టంతో బత్రుకుతాం. ఆరోజు రాత్రి ఏం జరిగింది? ఏమిటనేది ఎవరికీ తెలియదు. మా మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదని నిరూపించే ఆడియో, వీడియో ప్రూప్స్ నా వద్ద ఉన్నాయి. పోయిన మా ఫేం తిరిగి వస్తుందా? మా జీవితాన్ని ఇంత నాశనం చేశారు కదా ఎవరు తిరిగి ఇస్తారు? అని నీలిమ ప్రశ్నించారు. ఇమామ్, విక్రమ్, శేషు, క్రాంతి, సంతోష్, హరిగారు ఈ ఐదుగురు చేసిన ఆరోపణలకు ప్రతి దానికి నా వద్ద ఆన్సర్స్ ఉన్నాయని నీలిమ స్పష్టం చేశారు.

    English summary
    Big Boss Kaushal’s Wife Nelima denies the allegations. Kaushal Prasad Manda is an Indian actor and model who predominantly works in Tollywood and TV Serials. He is the title winner of Bigg Boss Telugu 2, who won with highest number of votes in entire bigg boss 2 telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X