Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బిగ్ బాస్4 కోసం కఠిన నిర్ణయాలు.. షో స్టార్ అవ్వకముందే అజ్ఞాతంలోకి సెలబ్రెటీస్!
ఇండియన్ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో స్టార్ట్ కాబోతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికె చాలా ఆలస్యం కావడంతో వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. దాదాపు షోకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ని దృష్టిలో ఉంచుకొని గతంలో ఎప్పుడు లేని విధంగా కఠిన నిర్ణయాలు అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
మార్పులు ఉంటాయా?
ఇటీవల షోకి సంబంధించిన ఫస్ట్ లోగోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గత మూడు సీజన్ల కంటే కూడా ఈ సారి మరింత ఆకర్షించే విధంగా షోను ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ కారణంగా షోలో ఏమైనా మార్పులు జరుగుతాయా అనేది హాట్ టాపిక్ గా మారింది. అదే విదంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది అందరిలో మెదులుతున్న సందేహం.
ముందే కరోనా పరీక్షలు..
బిగ్ బాస్ సీజన్ 4 కోసం ఇప్పటికే కంటెస్టెంట్ లిస్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ లాస్ట్ వీక్ లో షో స్టార్ట్ కానుందని కామెంట్స్ వస్తున్నాయి. ఇక కంటెస్టెంట్స్ ని హౌజ్ లోకి పంపడానికి 14రోజుల ముందే కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. వారిని రెండు వారాల పాటు క్వారంటైన్ లోనే ఉంచి 15వ రోజు మరోసారి టెస్టులు నిర్వహించి ఆ తరువాత హౌజ్ లోకి పంపిస్తారట.
అజ్ఞాతంలో సెలబ్రెటీస్..
పూర్తిగా ఆరోగ్యంగా ఉంటేనే హౌజ్ లోకి పంపించాలని షో నిర్వాహకులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక షో స్టార్ట్ అయ్యే ముందు 14 రోజులు బయటకు ఎలాంటి సమాచారం లీక్ అవ్వకుండా వారిని అజ్ఞాతంలో ఉంచనున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ దృష్ట్యా షోలో సోషల్ డిస్టెన్స్ పై కూడా కొన్ని టాస్క్ లు ఇవ్వనున్నట్లు టాక్.
Recommended Video
క్లారిటీ ఇచ్చిన హీరో..
ఇక షోలో కంటెస్టెంట్ గా యువ హీరో తరుణ్ పాల్గొనబోతున్నారని ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక నిన్ననే ఒక వీడియో ద్వారా తాను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని తరుణ్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక హోస్ట్ విషయంలో కూడా అనేక రకాల సందేహాలు వస్తున్నాయి. నాగార్జున మరోసారి కనిపించబోతున్నారని టాక్ వచ్చినప్పటికీ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు చెప్పలేము.