Bigg Boss 7 Telugu Host: బిగ్ బాస్ ప్రోమో రిలీజ్.. నాగార్జున ప్లేస్ కొట్టేసిన స్టార్ హీరో
బిగ్ బాస్ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై గత ఆరు సీజన్స్ దుమ్మురేపిన సగంతి తెలిసిందే. ఇక 7వ సీజన్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమోను వదిలారు. అయితే ఈ ప్రోమోలో ఎలాంటి డిటైల్స్ ఇవ్వలేదు. కేవలం లోగో చూపించారు. అయితే ఈ సీజన్ కు హోస్ట్ గా నాగార్జున చేయడం లేదట. ఆయన స్థానాన్ని మరో హీరో కొట్టేశాడని టాక్. ఆ వివరాల్లోకి వెళితే...
ప్రోమో రిలీజ్:బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్.. బిగ్ బాస్ 7 ప్రోమోను విడుదల చేశారు. ఈ రియాలిటీ షోకు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఇప్పటివరకు ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకోగా.. త్వరలో 7వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా... కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక బిగ్ బాస్ ఉండదేమో అనుకున్న ప్రేక్షకులకు మేకర్స్ ప్రోమో రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు.
తప్పుకున్న నాగార్జున:ఇక ప్రోమో విషయానికి వస్తే.. ఈ ప్రోమోలో ఎలాంటి డిటైల్స్ అయితే ఇవ్వలేదు. కేవలం లోగో చూపించారు. ఇక ఈ సీజన్ కోసం... ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా అయిందట. ఫైనల్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేశారని సమాచారం. జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటివారంలో సీజన్ మొదలుకానుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే నాలుగు సీజన్స్ కు నాగార్జున హోస్ట్ గా బాధ్యత తీసుకున్నాడు. అయితే ఈ సారి నాగార్జున ప్లేస్ ను ఓ స్టార్ హీరో కొట్టేశాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.

అట్టర్ ఫ్లాప్...:అయితే నాగార్జున.. సీజన్ 6 విషయంలో విమర్శల పాలయ్యారు. నాగార్జున పూర్తి స్థాయిలో మెప్పించలేదని.. ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఆ మధ్య ట్రోల్స్, మీమ్స్ కూడా వచ్చాయి. మొత్తంగా కూడా సీజన్ 6 అట్టర్ ప్లాప్ కాగా.. కనీస టీఆర్పీ రాలేదు. అందుకే నాగార్జున బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పారని తెలుస్తోంది. గత 6వ సీజన్స్ కంటెస్టెంట్స్ కూడా ఎవరో తెలియని వాళ్లను ఎంపిక చేశారు. ఈ సారి అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట మేకర్స్.

బాలయ్య హోస్ట్...:హోస్ట్ తో పాటు.. కంటెస్టెంట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. తెలిసిన వాళ్లు అయితే.. బాగుంటుందని.. పేరున్న వారినే సెలక్ట్ చేశారట. ఇక నాగార్జున ప్లేస్ లో స్టార్ హీరో పేరు వినిపిస్తోంది. ఆయన ఎవరో కాదు అన్ స్టాపబుల్ షో తో మంచి పేరు సంపాదించుకున్న బాలయ్య బాబు. ఆ షో చేయక ముందు బాలయ్యపై అభిప్రాయం వేరే ఉండేది. ఇక ఆ షో తర్వాత బాలయ్య అంటే.. బోళా శంకరుడు అన్నట్లు మారిపోయింది. అయితే ఈ షో కు హోస్ట్ గా రానా పేరు కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా.. జూలై చివరి వారంలో పూర్తి వివరాలు తేలనున్నాయి.


Click it and Unblock the Notifications











