Big Boss Telugu Season 7: ఇదేంటి ఇలా ఉంది.. ఊహకు అందకుండా.. ఈసారి బిగ్ బాస్ ప్లాన్ మామూలుగా లేదుగా?
బిగ్ బాస్ షో కోసం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడెప్పుడూ ప్రారంభం కానుందోనని.. ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ గురించి రోజుకో వార్త... సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది. ఇప్పటికే రిలిజ్ అయిన ప్రోమోలు ఆకట్టుకోగా... ఇప్పుడు తాజాగా మరో ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ ప్రోమోలో నాగార్జున బిగ్ బాస్ షో ఎలా ఉండబోతుందో హింట్స్ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే...
రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ బిగ్ బాస్ షో ఇప్పటికే ఆరు సీజన్స్ కంప్లీట్ చేసుకోగా... ఇప్పుడు ఏడో సీజన్ మొదలుకానుంది. మరి కొద్ది రోజుల్లో ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఇక ఈ క్రమంలో బిగ్ బాస్ షో నుంచి కంటెస్టెంట్స్ వీరే అంటూ రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇప్పటికే ఈ షో ప్రోమోలు రిలీజ్ అయి ఆకట్టుకోగా... తాజాగా మరో ప్రోమో రిలీజ్ అయింది.

ఇక తాజాగా ఈ షోకు సంబంధించిన కొత్త ప్రోమోను మేకర్స్ రీలిజ్ చేయగా... ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముందు నుంచి చెప్పినట్టుగానే ఈసారి అంతకుమించి ఉండబోతుందని నాగ్ ఒక చిన్న కాన్సెప్ట్ ద్వారా చెప్పుకొచ్చాడు. ప్రోమో ప్రారంభంలో ఓ ఎత్తైన కొండ... ఇద్దరు ప్రేమికులు.. ప్రేమించిన అబ్బాయి.. కొండ మీద నుంచి కిందపడిపోతుంటే.. కొండపైన ఉన్న అమ్మాయి తన చున్నీ ఇచ్చి పట్టుకోమని అబ్బాయికి చెబుతుంది. అతన్ని పైకి లాగేందుకు తెగ ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
నన్ను వదలద్దు రమేష్... అని అమ్మాయి అనగా.. రాధా నా ప్రాణం నీ చేతుల్లో ఉంది నేను చావను అని అబ్బాయి చెబుతాడు. దీనికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇక ఆ చున్నీతో ఆ అబ్బాయి పైకి వస్తుంటాడు. ఇక వారిద్దరూ కలిసిపోయారు.. అనుకునే లోపు నాక్ ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ ఈ సీన్ ఆకట్టుకుంది. ఇలాంటి క్లైమాక్స్ మనం చాలా సినిమాల్లో చూసాం కదా .. ఎండింగే మార్చేద్దాం.. ఇది అంతం కాదు ఆరంభం" అని చెప్తాడు.

దీంతో వెంటనే ఆ అమ్మాయి తుమ్మడం.. చేతిలో చున్నీ జారడం.. ప్రియుడు కళ్ళముందే కింద పడిపోవడం జరిగిపోతుంది. ఎవరి ఊహకు అందని సీజన్.. బిగ్ బాస్ సీజన్ 7.. అంతా ఉల్టా.. పూల్టా అంటూ నాగ్ డైలాగ్ చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఇక ఈ ప్రోమోకు ఇచ్చిన మ్యూజిక్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమాకు మించి ఉండబోతుందని అర్థం అవుతుంది.
ఇక ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఈ ప్రోమో బట్టి చూస్తే.. ఈ సారి బిగ్ బాస్ భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆరో సీజన్ పై విమర్శలు రావడంతో.. ఈ సారి పక్కా పకడ్భందీగా ప్లాన్ చేసి.. ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ షో ను ప్రచారం చేస్తున్నాడు. ఇక ఈ షో సెప్టెంబరులో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ కూడా ఫైనల్ అయ్యారని సమాచారం.


Click it and Unblock the Notifications











