For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్ 4 వచ్చేస్తున్నాడు.. రియాలిటీ షో డేట్స్ ఫైనల్.. సెలబ్రిటీల ఎంపికపై..

  |

  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే ప్రారంభానికి సిద్దం కావాల్సిన పాపులర్‌ షో లాక్‌డౌన్ కారణంగా కాస్త ఆలస్యమైంది. అయితే లాక్‌డౌన్‌తో వచ్చిన అవకాశాన్ని షో ప్లానింగ్‌ కోసం వాడుకొన్నారనే తెలిసింది. అయితే ఈ షో కోసం సెలబ్రిటీ ఎంపిక, తేదీల ఖరారుపై ఇప్పటికే ఎండమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ షో ఎప్పుడు మొదలవుతున్నదంటే..

  Bigg Boss Telugu Season 4 Dates Are Fixed,Here Is The Top List Contestents

  బిగ్‌బాస్ 4 అప్‌డేట్.. నెటిజన్ల ప్రశ్నకు సమాధానంగా.. యాంకర్ వర్షిణి క్లారిటీ

  మలయాళంపై కరోనా దెబ్బ

  మలయాళంపై కరోనా దెబ్బ

  ఇతర భాషల్లో బిగ్‌బాస్‌కు భారీ దెబ్బ కొట్టిందంటే మలయాళం బిగ్‌బాస్‌పైనే. క్రేజీ కాంట్రవర్సిలతో షోకు మంచి హైప్ వచ్చిన సమయంలోనే కరోనావైరస్ విజృంభించింది. దాంతో ఆ షోను అర్ధాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇంటి బయట నెలకొన్న పరిస్థితులను షోలోని సెలబ్రిటీలకు చెప్పి వారికి వ్యక్తిగతంగా ట్రోఫిలు ఇచ్చి షోను ముగించారు. ఇలా బిగ్‌బాస్ షో అర్ధాంతంరంగా ఆగిపోవడం ఇదే మొదటిసారి అని నిర్వాహకుల చెప్పుకొచ్చారు.

  తెలుగు షోపై జాగ్రత్తలు

  తెలుగు షోపై జాగ్రత్తలు

  ఇక బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4పై కరోనా ప్రభావం తీవ్రంగానే పడింది. మే, జూన్‌లో ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన ఎండెమాల్ షైన్ నిర్వాహకులకు లాక్‌డౌన్ భారీగా షాకిచ్చింది. ఈ రియాలిటీ షోకు సంబంధించిన పనుల వేగానికి కొంత కళ్లెం పడింది. అయితే ఇతర భాషలపై పడిన ఎఫ్టెక్ట్ తెలుగుపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు.

  లాక్‌డౌన్‌లో పక్కా ప్లానింగ్

  లాక్‌డౌన్‌లో పక్కా ప్లానింగ్

  లాక్‌డౌన్ పిరియడ్‌ను బిగ్‌బాస్ 4 కోసం అయ్యే ప్లానింగ్‌కు చక్కగా వాడుకొన్నట్టు తెలిసింది. ఇప్పటికే తుది జాబితా ఎంపిక పూర్తయిందని, అయితే అగ్రిమెంట్స్, ఇతర మానసిక, శారీరక పరీక్షల అంశాలపై సెలబ్రిటీల నుంచి క్లారిటీ తీసుకోవాల్సిన పరిస్థితులున్నాయి. ఇక లాక్‌డౌన్‌ సడలింపులను ప్రభుత్వాలు ఇవ్వడంతో పూర్తిస్థాయిలో ఈ షో కు సంబంధించిన కార్యక్రమాలు ఊపందుకొన్నాయని తెలుస్తున్నది.

  జూన్ తొలివారం నుంచి సెలబ్రిటీల ఎంపిక

  జూన్ తొలివారం నుంచి సెలబ్రిటీల ఎంపిక

  ఇక జూన్ మొదటి వారం నుంచి సెలబ్రిటీల ఫైనల్ ఎంపిక మొదలు కానున్నది. సెలబ్రిటీలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. వారితో సంప్రదింపులు జరుపుతూనే ఇతర అంశాలపై దృష్టిపెట్టాం. సాంకేతిక అంశాలు, సెట్ డిజైన్ పనులపై చర్చలు జోరుగా జరుగుతున్నట్టు సమాచారం.

  సెలబ్రిటీల పేర్లపై ఊహాగానాలు

  సెలబ్రిటీల పేర్లపై ఊహాగానాలు

  బిగ్‌బాస్ సీజన్ 4కు ప్రధానంగా పరిశీలనలో ఉన్నవారిలో అల్లరి నరేష్, యాంకర్ ఝాన్సీ, సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్, నటుడు నందు, తాగుబోతు రమేష్, సింగర్ మంగ్లీ పేర్లు టాప్ లిస్టులో ఉన్నట్టు సమాచారం. వీరిలో కొందరితో చర్చలు పూర్తయ్యాయని, వారికి సంబంధించిన రెమ్యునరేషన్ల విషయంపై రెండు వర్గాల మధ్య అవగాహన కుదిరిందనేది తెలిసింది.

   జూలై 26 లేదా ఆగస్టు 2 తేదీన

  జూలై 26 లేదా ఆగస్టు 2 తేదీన

  ఇక అన్ని పనులు సవ్యంగా పూర్తయి.. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటే బిగ్‌బాస్‌ తెలుగు షోను జూలై చివరి వారంలో ప్రారంభించేందుకు ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షోను జూలై 26వ తేదీన ఆదివారం గానీ, ఆగస్టు 2వ తేదీన గానీ ప్రారంభించేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. దాదాపు జూలై 26 తేదీనే ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది.

  English summary
  Bigg Boss Season 4 telugu news: Big Boss Telugu Show season 4 is getting ready to telecast. Reports sugggest that on July 29th or August 2 show will be aired. As Some of the celebrities list have been leaked in the media for season 4. Sudigali Sudheer, Rashmi Gautam, Allari Naresh, Anchor Jhansi etc are in the list. Organisers of Bigg Boss Telugu have been started selection process of Realty show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X