కోట్లు ఇస్తామంటున్నారట: యాంకర్ ప్రదీప్ పెళ్లి హాట్ టాపిక్!

యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి ప్రపోజల్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

By Bojja Kumar

Recommended Video

యాంకర్ ప్రదీప్ పెళ్లి హాట్ టాపిక్! కోట్ల కట్నంతో పాటు హైదరాబాద్ లో ఖరీదైన ఫ్లాటు

ఈవెంట్ మేనేజర్ గా కెరీర్ మొదలు పెట్టి, ఆ పై రేడియో జాకీగా, ఇపుడు బుల్లితెర యాంకర్ గా దూసుకెలుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో మోస్ట్ పాపులర్ మేల్ యాంకర్ అయిన ప్రదీప్ సంపాదనలో కూడా టాప్‌లో ఉన్నాడు.

చూడటానికి ఆకట్టుకునే రూపం, మంచి మాటకారి అయిన ప్రదీప్‌కు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో మోస్ట్ ఎలిజబుల్ యాంకర్‌గా ఉన్న ప్రదీప్‌కు పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయని, కొందరు తమ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కోట్లలో కట్నం ఇస్తాంటూ ఆఫర్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

 తన కూతురును పెళ్లాడాలంటూ విశాఖ రియల్టర్

తన కూతురును పెళ్లాడాలంటూ విశాఖ రియల్టర్

ప్రదీప్ సమాజిక వర్గానికే చెందిన విశాఖ రియల్టర్ ఒకరు ప్రదీప్‌ను తన అల్లుడిగా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, ఆయనకు విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో భారీగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.

 భారీగా కట్నకానుకలు

భారీగా కట్నకానుకలు

ఆ రియల్ట్ కూతురు ప్రస్తుతం యూఎస్ఏలో ఎమ్మెస్ చేస్తోందని, ఆమెను పెళ్లి చేసుకుంటే ప్రదీప్‌కు దాదాపు రూ. 25 కోట్ల కట్నంతో పాటు హైదరాబాద్ లో ఖరీదైన ఫ్లాటు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

 ప్రదీప్ నుండి ఇంకా నో రెస్పాన్స్

ప్రదీప్ నుండి ఇంకా నో రెస్పాన్స్

అయితే ఈ పెళ్లి ప్రపోజల్ విషయమై ప్రదీప్ నుండి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదని అంటున్నారు. ప్రదీప్ వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజమో తేలాల్సి ఉంది.

 దూసుకెలుతున్న ప్రదీప్

దూసుకెలుతున్న ప్రదీప్

ప్రదీప్ పూర్తి పేరు ప్రదీప్ మాచిరాజు. హైదరాబాద్ లో ఈవెంట్ ఆర్గనైజర్ కెరీర్ మొదలు పెట్టాడు. తనకున్న టాకింగ్ స్కిల్స్ రేడియో జాకీగా అవకాశాన్ని తెచ్చిపెట్టింది. రేడియో జాకీగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందరినీ ఆకర్షించేలా మాట్లాడే నేర్పరితనంతో పాటు యాంకరింగుకు సూటయ్యేలా గుడ్ లుకింగ్ ఉండటంతో లోకల్ టీవీ ఛానల్ లో అవకాశం వచ్చింది. ఆ షో సక్సెస్ కావడంతో ప్రదీప్ కు అవకాశాలు పెరిగాయి.

 లేడీస్ ఫ్రోగ్రామ్స్

లేడీస్ ఫ్రోగ్రామ్స్

పూర్తిగా మహిళలకు సంబందించిన... ‘గడసరి అత్త-సొగసరి కోడలు' లాంటి టీవీ షోలు కూడా ప్రదీప్ విజయవంతంగా హ్యాండిల్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో అతని యాంకరింగుకు డిమాండ్ పెరిగింది.

 తొలి రెమ్యూనరేషన్

తొలి రెమ్యూనరేషన్

కెరీర్ మొదలు పెట్టిన తొలినాళ్లలో ఈవెంట్ ఆర్గనైజర్ గా నెలకు రూ. 25 వేలు సంపాదించాడట. తర్వాత తొలిసారి రేడియో జాకీగా అవకాశం వచ్చినపుడు రూ. 20 వేలు అందుకున్నాడట. తొలి టీవీ షోకు రూ. 15వేలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది.

 ఇపుడు భారీగా

ఇపుడు భారీగా

ప్రస్తుతం ప్రదీప్ ఒక్కో టీవీ షో ఎపిసోడ్‌కు లక్షల్లో పేమెంట్ తీసుకుంటున్నాడని టాక్. నెలకు యావరేజ్ గా ప్రదీప్ సంపాదన రూ. 25 నుండి రూ. 30 లక్షల వరకు ఉంటుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X