For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg boss Telugu 5: టాప్ సెలబ్రేటిలకు భారీ ఆదాయం.. ఆ స్టార్స్ ఛాన్స్ వదులుకునేలా లేరట!

  |

  ఇండియన్ బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ ప్రతి భాషలో మంచి రేటింగ్ అందుకుంటోంది. భాష ఏదైనా సరే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గొడవలతో కొట్లాటలతో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఏ మాత్రం రేటింగ్స్ తగ్గినా కూడా నిర్వాహకులు సరికొత్త టాస్క్ లతో కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెడుతున్నారు. తెలుగులో సీజన్ 4 అసలు సక్సెస్ అవుతుందా లేదా అని అనుకున్న తరుణంలో ఫైనల్ వరకు మంచి క్రేజ్ ను అందుకుంది. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ముహూర్తం సెట్ చేసే పనిలో బిజీ అయ్యారు.

  ఇక హౌస్ లోకి రాబోయే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది కొంతమంది ప్రముఖ సెలబ్రిటీలకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్వాహకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది.

  సరికొత్త ప్రోమో..

  సరికొత్త ప్రోమో..

  గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ షో పై అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక షో కు సంబంధించిన లోగో ప్రోమోను కూడా ఇటీవల రిలీజ్ చేశారు. ఆ ప్రోమోకు అయితే భారీగా స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో కూడా బిగ్ బాస్ సీజన్ 5 ట్యాగ్ గట్టిగానే వైరల్ అయ్యింది. దీంతో ఈసారి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోయే సెలబ్రిటీలపై కూడా అనేక రకరకాల రూమర్స్ వస్తున్నాయి. వీలైనంతవరకూ తొందరగా రియాలిటీ షో ను మొదలుపెట్టాలని నిర్వాహకులు ప్లాన్ చేసుకుంటున్నారు.

  మొత్తంగా 15 మంది పేర్లు

  మొత్తంగా 15 మంది పేర్లు

  ఇక షో కు సంబంధించిన సెలబ్రిటీల విషయానికి వస్తే మొదటి నుంచి కూడా ఎక్కువగా యూట్యూబ్ కు సంబంధించిన సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా 15 మంది పేర్లు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులు అలాగే టీవీ ఆర్టిస్టులు, మరికొంత మంది సినిమా టెక్నీషియన్స్ అలాగే డాన్స్ మాస్టర్స్ వంటి వారు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి రాబోతున్నట్లు సమాచారం. అలాగే ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ కు భారీస్థాయిలో పారితోషికం ఇస్తారని కథనాలు వెలువడుతున్నాయి.

  పెద్ద మొత్తంలో ఆదాయం అందుకునేవారు ఎవరంటే..

  పెద్ద మొత్తంలో ఆదాయం అందుకునేవారు ఎవరంటే..

  ఇక ఆ లిస్టులో కొంతమంది ప్రముఖ సెలబ్రిటీలకు ప్రత్యేకమైన ప్యాకేజీ ని ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ షోలో పాల్గొనడానికి పెద్ద మొత్తంలో ఆదాయం అందుకునే వారిలో ముఖ్యమైన వారు యు ట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, ఇషా చావ్లా, సురేఖ వాణి మరియు యాంకర్ వర్షిణి కూడా ఉన్నట్లు టాక్ వస్తోంది. ఈ సెలబ్రిటీలు నిత్యం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో బిజీగా ఉండేవారు కాబట్టి వారు అడిగినంత పారితోషికం ఇవ్వడానికి స్టార్ మా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

  వారానికి.. స్పెషల్ ప్యాకేజ్

  వారానికి.. స్పెషల్ ప్యాకేజ్

  ఈ ప్రత్యేకమైన ప్యాకేజీ ద్వారా వారానికి పది లక్షల కంటే ఎక్కువ కూడా ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. గతంలో కొంతమంది సెలబ్రిటీలు ప్రైస్ మనీ కంటే కూడా వారికి వచ్చిన పారితోషికం ద్వారానే ఎక్కువ ఆదాయాన్ని రాబట్టినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే పారితోషకం అవసరం లేకపోయినా కూడా కొంతమంది కేవలం క్రేజ్ కోసమని బిగ్ బాస్ లో అడుగు పెడుతున్నారు అలాంటివారికి నిర్వాహకులు ఎలాంటి రెమ్యురేషన్ ఇవ్వడం లేదు.

  మంచి రేటింగ్ లభిస్తే

  మంచి రేటింగ్ లభిస్తే

  ఒకవేళ వారి ద్వారా షో కి మంచి రేటింగ్ లభిస్తే మాత్రం షో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ప్రత్యేకంగా ప్యాకేజీ ని అడగకముందే ఇస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సారి హోస్ట్ గా కనిపించబోయే స్టార్ హీరో ఎవరు అనే విషయంలో పెద్దగా తేడా లేకపోవచ్చని టాక్ వస్తోంది. ఎందుకంటే ఈసారి కూడా మన్మధుడు నాగార్జున హోస్ట్ గా ఒక వ్యవహరించబోతున్నట్లు సమాచారం.

  రానా రిజెక్ట్ చేశాడా?

  రానా రిజెక్ట్ చేశాడా?

  మొదట రానా దగ్గుబాటి పేరు కూడా బాగానే వైరల్ అయింది. ఈసారి రానా బిగ్ బాస్ హోస్ట్ గా సెట్ అయ్యారని నేషనల్ మీడియాలో కూడా కథనాలు వెలువడ్డాయి. కానీ ప్రస్తుతం రానా పెద్ద సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. అలాగే రానాకు బిగ్ బాస్ షోకు బాధ్యత వహించాలని పడుకోవడం లేదట. సరదాగా కొనసాగే నెంబర్ వన్ యారి లాంటి టాక్ షోలను మాత్రమే చేయాలని అనుకుంటున్నాడు.

  Athadu Ame Priyudu Movie Launch| Nagababu | Yandamuri Veerendranath | Kaushal | Filmibeat Telugu
  నాగార్జున ఎలా హ్యాండిల్ చేస్తారో..?

  నాగార్జున ఎలా హ్యాండిల్ చేస్తారో..?

  ఇక ఈసారి నిజంగానే నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తే గ్యాప్ లేకుండా వర్క్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం నాగార్జున చేతిలో రెండు ముఖ్యమైన సినిమాలు ఉన్నాయి. గరుడవేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమాను కూడా సెట్స్ పైకి తేవాలని ఫిక్స్ అయ్యారు.

  ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి పూర్తవ్వాలని నాగార్జున ప్లాన్ సెట్ చేసుకున్నాడు. ఈక్రమంలో బిగ్ బాస్ షో కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తీరిక లేకుండా వర్క్ చేయక తప్పదు. ఆరోగ్యం పై ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే నాగార్జున ఈసారి ఇ ఈ బిజీ షెడ్యూల్ ను ఎలా పూర్తి చేస్తాడో చూడాలి. ఇక త్వరలోనే బిగ్ బాస్ కు సంబంధించిన మరొక ప్రోమోను విడుదల చేయాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు.

  English summary
  Big demand for bigg boss 5 telugu top contestants solid remunerations. The names of Shanmuk Jashwant and Anchor Ravi have already been heard for Bigg Boss 5. Talk is coming that a glamorous heroine is also coming as well.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X