Bigg Boss లో ఆర్జే కాజల్‌కు ఆరోస్థానం.. అతిగా ఆశపడ్డ ఆడది అంటూ వీజే సన్నీ, సిరి హన్మంతు సెటైర్లు

బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ చివరి అంకానికి చేరుకొన్నది. ఇక ఇంటిలో కేవలం ఆరుగురు సభ్యులు మిగలడంతో టాప్ 5‌లో ఎవరు ఉంటారు? సీజన్ విజేత ఎవరు అవుతారు అనే విషయం ఆసక్తిగామ మారింది. ఇలాంటి సమయంలో ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ టాస్క్ రూపంలో మరో కఠిన పరీక్ష ముందుంచాడు. అయితే సీరియస్‌గా సాగే టాస్క్‌ను వినోదభరితంగా మార్చిన వీజే సన్నీ.. ఆర్జే కాజల్‌ను ఆటపట్టించాడు. అంతేకాకుండా ఆమె సెటైర్లు వేస్తూ ఇంటిలో నానా హంగామా చేశాడు. తాజా ప్రోమోలో సన్నీ చేసిన హంగామా గురించిన వివరాల్లోకి వెళితే..

టాప్ 5లో ఎవరనే విషయంపై ..

టాప్ 5లో ఎవరనే విషయంపై ..

బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ 14వ వారంలోకి ప్రవేశించింది. ఇంటి నుంచి 13వ వారం ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యారు. దాంతో బిగ్‌బాస్ హౌజ్‌లో వీజే సన్నీ, ఆర్జే కాజల్, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంతు, మానస్ ఉన్నారు. ఈ ఆరుగురులో ఒకరు ఎలిమినేట్ అయితే మిగితా ఐదుగురు టాప్ 5లో ఉంటారు. దాంతో ఎవరు టాప్ 5లో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.

బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కఠిన పరీక్ష

బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కఠిన పరీక్ష

ఇలాంటి పరిస్థితుల్లో బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు మరో కఠినమైన పరీక్షను ముందుంచాడు. ఆరు స్థానాలకు సంబంధించిన ర్యాంక్స్‌తో కూడిన పిల్లర్లను చూపించి.. ఎవరు ఏ స్థానం కోరుకొంటారో తేల్చుకోండి. అసలు ఆట ఇప్పుడే మొదలైంది అంటూ రూల్స్ చెప్పాడు. అయితే సన్నీని ఇష్టపడే వ్యక్తి నెంబర్ 1 స్థానంలో సన్నీ ఉండాలనుకొంటాడు. షణ్ముఖ్‌ను ఇష్టపడే వ్యక్తి ఒకటో నెంబర్ స్థానంలో షన్ను ఉండాలని కోరుకొంటారు. ఎవరైనా ఒకటో నెంబర్‌నే కోరుకొంటారు అని సన్నీ చెప్పాడు. ఒకటో నెంబర్ స్థానంలో ఎవరు ఉండాలనే విషయంపై నేను నా అభిప్రాయం చెబుతా అంటూ.. సన్నీ ఒకటో నెంబర్ స్థానంలో నేను ఉంటా అని ఇంటి సభ్యులకు ఝలక్ ఇచ్చాడు.

 ఒకటో నెంబర్ స్థానం కోసం పోటీ

ఒకటో నెంబర్ స్థానం కోసం పోటీ

అయితే ఒకటో నెంబర్ స్థానం కోసం సన్నీతో ఆర్జే కాజల్ పోటీ పడింది. దాంతో ఆ నెంబర్ వన్ స్టాండ్‌ను తీసి తన ముందుకు పెట్టుకొన్నాడు. అయితే ఆ స్టాండ్‌ను కదిలించవద్దు అని కాజల్ అంటే.. అది నాతోనే ఉంటుంది. నువ్వెళ్లి ఆరో స్థానంలో నిలుచో అని సన్నీ అన్నాడు. దాంతో నీకు ఓ మంచి మాట చెప్పనా? అని ఆర్జే కాజల్ ఏదో అనబోతుండగా.. నీవు ఇక్కడే ఉండు అంటూ వీజే సన్నీ సమాధానం ఇస్తూ.. అతిగా ఆశపడ్డ ఆడది.. ఆవేశపడ్డ మగాడు.. సుఖ: పడినట్టు చరిత్రలో లేదు కాజల్ అంటూ అన్నాడు. దాంతో నేను అతిగా ఆశపడటం లేదు సన్నీ అంటూ కాజల్ ఏదో చెప్పబోతుండగా.. ఇంటి సభ్యులందరూ ఆమె ఆరో స్థానం ఇద్దామా? అంటూ మరో సెటైర్ వేశాడు.

 ఆర్జే కాజల్‌ నీవు అక్కడికి వెళ్లు అంటూ

ఆర్జే కాజల్‌ నీవు అక్కడికి వెళ్లు అంటూ

అయితే ఒకటో నెంబర్ స్థానంపై ఆర్జే కాజల్ నిలచోవడంతో సిరి హన్మంతు సెటైర్ వేసింది. ఆ స్థానంపై నిలుచుంటే చూడలేకపోతున్నామంటూ కాజల్‌ను ఉద్దేశించి కామెంట్ చేసింది. దాంతో నీవు రెండో స్థానంపై నిలబడు అంటూ సన్నీ కామెంట్ చేస్తే.. అయితే ఒకటో స్థానం ఎవరిది అని కాజల్ ప్రశ్నించగా.. ఎవరో ఒకరు ఉంటారులే. ఫ్రెండ్ అంటావు.. అర్ధం చేసుకోవు నీవు అంటూ సన్నీ తనదైన శైలిలో కామెంట్ విసిరాడు.

 దోస్తుల పేర్లు దోస్తులు చెప్పుకొంటే..

దోస్తుల పేర్లు దోస్తులు చెప్పుకొంటే..

అయితే టాప్ 5లో ఎవరు ఉండాలనేది మనం చెప్పుకొందాం అంటూ ఆర్జే కాజల్ సరికొత్త ప్రతిపాదనను తెచ్చింది. షన్ను అంటే సిరి పేరు చెబుతాడు.. సిరి పేరు చెబితే షన్ను అంటుంది. సన్నీ అంటే మానస్ అంటాడు. ఇలా దోస్తుల పేరు చెబితే అతడు (శ్రీరామచంద్ర) పేరు ఎవరు చెబుతారు. దోస్తులు దోస్తుల పేరు చెబితే.. ఎలా? అని సన్నీ నిలదీశాడు. దాంతో నేను జెన్యూన్‌గా చెబుతాను అని షణ్ముఖ్ అంటే.. నువ్వు స్టార్ట్ చేయి అంటూ వీజే సన్నీ సూచించారు. అలా ప్రోమోలో సన్నీ హంగామా కనిపించింది.

Recommended Video

Pushpa Trailer Delay | Samantha As Yashodha || Filmibeat Telugu
డిసెంబర్ 19న ఫినాలే.. ముఖ్య అతిథి ఎవరంటే?

డిసెంబర్ 19న ఫినాలే.. ముఖ్య అతిథి ఎవరంటే?

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తెలుగు 5 గ్రాండ్ ఫినాలేకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్య అతిథి ఎవరు అనే విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ముగింపు వేడుకలను మాత్రం వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రాండ్ ఫినాలేను డిసెంబర్ 19వ తేదీన నిర్వహించేందుకు బిగ్‌బాస్ హౌస్‌ను ముస్తాబు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X