బురదలో పడి ఫైటింగ్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్లు.. రాహుల్ మరోసారి.!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఈ షో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. మూడో సీజన్‌ను కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఫన్నీ టాస్కులు క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వహకులు.

ఇందులో భాగంగానే లగ్జరీ బడ్జెట్‌తో పాటు కెప్టెన్‌ను ఎంచుకునేందుకు బిగ్ బాస్ ఇచ్చే వీక్లీ టాస్క్‌ నిర్వహించారు. దీని ప్రకారం.. హౌస్‌లోని కొందరు గార్డెన్ ఏరియాలో ఉన్న ట్రైన్ సెట్టింగ్‌లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో కొందరు కంటెస్టెంట్లకు బాస్ కొన్ని పాత్రలను కేటాయించాడు. ఈ టాస్క్ ముగిసిన తర్వాత ఎవరు ముగ్గురు కంటెస్టెంట్లు మంచిగా ఆడారో వాళ్లను కెప్టెన్సీ టాస్క్ కోసం ఎంపిక చేస్తారు. వారు వారం రోజుల పాటు కెప్టెన్‌గా కొనసాగడానికి పోటీ పడతారు.

Big Fight In Bigg Boss House For captaincy task

ఇక, శుక్రవారం జరిగే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇందులో కెప్టెన్సీ టాస్క్ కోసం బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, రాహుల్ సింప్లీగంజ్‌లు పోటీ పడుతున్నట్లు చూపించారు. ఈ టాస్క్ కోసం 'మట్టిలో ఉక్కు మనిషి' అనే సరికొత్త పోటీని తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ముగ్గురు పోటీ దారులను కలిపి కట్టేసి బురదలోకి దింపారు. అందులో ఉన్న బాల్స్‌ను ఒక్కొక్కరికి కేటాయించిన బాస్కెట్‌లో వేయాలి. ఇలా ఎవరు ఎక్కువ బాల్స్ సాధిస్తారో వారే తదుపరి వారానికి కెప్టెన్ అవుతారు.

ఈ టాస్క్‌లో ముగ్గురూ పోటీ పడి ఆడుతున్నట్లు కనిపిస్తోంది. రాహుల్ కొంత బలంగా ఉంటాడు కాబట్టి అతడు మిగిలిన ఇద్దరినీ నెట్టేస్తున్నాడు. ముఖ్యంగా రాహుల్.. బాబా భాస్కర్‌ను తోసేయడం ప్రోమోలో కనిపించింది. దీంతో ఈ టాస్క్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశాలు ఉన్నాయని అర్థం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X