బిగ్ బాస్ షోలో కలకలం: సోహెల్‌తో ఘర్షణ. కిందపడిపోయిన అరియానా.. దూషించుకొంటూ.. కొట్టుకునేంతగా!
తెలుగు బుల్లితెరపై కనీవినీ ఎరుగని రీతిలో స్పందనను అందుకుంటూ దూసుకుపోతోంది బిగ్ బాస్ షో. ఇక్కడ ఏకంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుని, నాలుగోది కూడా ప్రసారం చేస్తున్నారు నిర్వహకులు. ఎన్నో అంచనాల నడుమ గ్రాండ్‌గా మొదలైన నాలుగో సీజన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక, ఇది చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో సరికొత్త టాస్కులతో నిర్వహకులు ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ షోలో ఘర్షణ జరిగింది. ఇందులో ఓ కంటెస్టెంట్ కింద పడిపోయింది. ఆ వివరాలు మీకోసం!

గ్రాండ్ ఫినాలే కోసం వాళ్లందరికీ పరీక్ష
గ్రాండ్ ఫినాలే వారంలోకి అడుగు పెట్టేందుకు ఐదుగురు సభ్యులకు మాత్రమే అవకాశం ఉంటుంది. వారిలో అఖిల్ ఇప్పటికే రేస్ టు ఫినాలే మెడల్ ద్వారా ఎంట్రీ ఇచ్చేశాడు. సో.. మిగిలిన ఐదుగురిలో నలుగురు మాత్రమే టాప్ -5లో చోటు దక్కించుకుంటారు. ఈ నేపథ్యంలో అందరినీ నేరుగా నామినేట్ చేసి వాళ్లను ఎంపిక చేసే బాధ్యతను ప్రేక్షకుల పైనే ఉంచాడు బిగ్ బాస్.

ఓ టాస్క్ కంప్లీట్.. ఆరియానా విన్నర్
ఫైనల్‌లోకి అడుగు పెట్టాలంటే ఈ వారం కచ్చితంగా సేఫ్ అవ్వాలి. అందుకోసం అఖిల్‌కు మినహా మిగిలిన కంటెస్టెంట్లకు టాస్కుల రూపంలో తమను తాము నిరూపించుకోమని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో భాగంగానే కింగ్ ఆర్ క్వీన్ టాస్కును నిర్వహించాడు. అన్ని ఎమోషన్స్ మధ్య సాగిన ఇందులో ఆరియానా విన్నర్ అయింది. దీంతో ఆమె ప్రేక్షకులను నేరుగా ఓట్లు అడిగే ఛాన్స్ పొందింది.

ఓపిక టాస్కులో ఆ ఇద్దరి మధ్య గొడవ
రెండో రౌండ్‌లో భాగంగా ‘ఓపిక' అనే టాస్కును పెట్టాడు బిగ్ బాస్. దీని ప్రకారం.. గార్డెన్ ఏరియాలో ఉన్న ఓ కుర్చీ మీద కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా రోబో మాదిరిగా కూర్చోవాలి. మిగిలిన వారంతా కుర్చీపై ఉన్న కంటెస్టెంట్‌తో హావభావాలు మార్పిస్తూ ఉండాలి. దీన్ని సంచాలకుడైన అఖిల్ నోట్ చేస్తాడు. ఈ టాస్కులో ఆరియానా, మోనాల్ గజ్జర్ మధ్య భారీ స్థాయిలో గొడవ జరిగింది.

ఆ కంటెస్టెంట్‌కు ధైర్యం చెప్పిన బిగ్ బాస్
ఆరియానా కుర్చీపై ఉన్న సమయంలో ఆమెను ఓడించేందుకు మోనాల్ గజ్జర్ ఎంతగానో శ్రమించింది. ఈ క్రమంలోనే కోతి బొమ్మను సైతం విసిరేసింది. ఆ తర్వాత మోనాల్ కూర్చున్న సమయంలో ఆరియానా అలాగే చేసింది. ఇందులో భాగంగానే ఆమెపై వ్యక్తిగతంగా దూషణకు దిగింది. దీంతో బాగా బాధ పడుతోన్న గుజరాతీ భామకు బిగ్ బాస్ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు.

బిగ్ బాస్ షోలో కలకలం.. ఇద్దరి వార్
బుధవారం జరగనున్న ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద గొడవ జరుగుతుందని తెలుస్తోంది. మోనాల్ గజ్జర్‌ను బాధ పెట్టిన ఆరియానా గ్లోరీపై సయ్యద్ సోహెల్ రియాన్ మాటల దాడికి దిగినట్లు సమాచారం. గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఈ గొడవ జరిగినట్లు తెలిసింది. పక్కనే ఉన్న కంటెస్టెంట్లు ఆపడానికి ప్రయత్నించినా వీళ్లిద్దరూ అస్సలు తగ్గలేదని అంటున్నారు.
Recommended Video

ఘర్షణలో కింద పడిపోయిన కంటెస్టెంట్
ఈ ఘర్షణలో సోహెల్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా గొడవకు దిగింది ఆరియానా. ఆ సమయంలోనే ఇద్దరూ కొట్టుకునేంతగా ఒకరిపైకి ఒకరు వెళ్లారు. ఆ సమయంలో అతడిని అఖిల్ సార్థక్ పక్కకు తీసుకుని వెళ్లాడు. ఆరియానాను అభిజీత్ సముదాయించే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అప్పుడే ఆమె ఏడుస్తూ కింద పడిపోయింది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.


Click it and Unblock the Notifications











